Brief Notes on Mudigonda Chalukyulu

 

 ముదిగొండ చాళుక్యులు  (క్రీ. శ. 960 – క్రీ. శ .1125  )

Notes prepared by : Praturi Potayya Sarma

1 )10వ శతాబ్ది ప్రారంభం లో వరంగల్ , ఖమ్మం ప్రాంతాలలో గల ముదిగొండ , కొరవి ప్రాంతాలను వీరు పాలించారు.

2) ఈ వంశస్థుల చరిత్ర గురించి కుసుమాయుధ IV యొక్క  దానం  శాసనాల వల్ల , కూకునూరు (క్రివ్వక దానం)  తామ్రపత్రాలు , కుసుమాదిత్య నట్టరమేశ్వరాల లేఖా ప్రమాణాల వల్ల తెలుస్తోంది.

3)ముడి గొండూరు ను రాజధానిగా చేసుకుని పరిపాలించటం వల్ల వీరికి ముదిగొండ చాళుక్యులని పేరు వచ్చింది .

4)వీరి రాజ్యానికి  ….   వేంగి , మాల్ఖేడ్ ప్రాంతాలు సరిహద్దులుగా ఉండేవి.

5)వేంగి రాజ్యం ఆగ్నేయ ప్రాంతానికి రక్షణ  బాధ్యతలు వీరు  నిర్వహించారు

6)వీరు వేంగి చాళుక్యుల రాజముద్రను ఆచరణ లోనికి దత్తత తీసుకున్నారు.

7) ఆ రాజముద్ర వరాహ లాంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , రెండు వింజామరాలు , ఖాళీ రాజ సింహాసనం , గొడుగుల కలయిక తో కూ డి ఉంది.

8) మొగలి చెరువు శాసనాలలో తెలిపినట్లుగా   కొక్కిరాజ, రణమర్ధ అనే సోదరులు ఈ ప్రాంతాన్నిఅనగా  ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో గల ముదుగొందూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు తెలుస్తోంది.    

కొక్కిరాజు 

(ఇతని సోదరుడు : రణమర్ధ )

i)మొగిలిచెరువు శాసనం వీరి గురించి తెలుపుతుంది.

Ii)రణమర్ధ  తమ రాజ్యాన్ని మంచి కొండ విషయ మరియు కొండపల్లి ప్రాంతాల వరకు విస్తరించాడు

iii)రణమర్ధక కంఠిక అనే గౌరవ ప్రదమైన చిహ్నం గా   కంఠాభరణా న్ని ధరించి ., దానికి రణమర్ధ కంఠీయము అనే పేరు పెట్టాడు

iv) రణమర్ధక కంఠీయాన్ని , కులధనముగా భావించి , తర్వాత తరాల వారు కుల దేవత గా భావించి పూజించారు

కుసుమాయుధ I

(ఇతను రణమర్ధ కొడుకు )

ఇతను రణమర్ధీయ కులతిలక అని పిల్వబడ్డాడు

ఇతను వేంగి చాళుక్య వంశస్థుడైన చాళుక్య భీమ I కి నమ్మకమైన సేవలు అందించాడు

విజయాదిత్య గొణగ

I ) కొరవి శాసనాలలో చెప్పినట్లుగా విజయాదిత్య గొణగ , సోదరుడైన నిరవాద్య తో బలవంతం గా రాజ్యం పోగొట్టుకున్నాడు . నిరవాద్య తనను తాను రాజ్యశ్రీ అనే బిరుదు తో సంబోధించుకున్నాడు

 ↓

కుసుమాయుధ II

(ఇతను విజయాదిత్య గొణగ కుమారుడు )

                       I )ఇతను వినిత జనాశ్రయ అనే పేరు పొందాడు .

                      ii)నిరవా ద్య నుండి వచ్చిన కొరవి రాజ్యాన్ని పొందాడు .

                      iv)వీరి పాలన మంచి కొండ , కొరవి , కొండపల్లి వరకు వ్యాపించింది  

 ↓

విజయాదిత్య (క్రీ. శ. 960 – క్రీ. శ .980 )

 ↓

కుసుమాయుధ III (క్రీ . శ. 980  – క్రీ. శ . 1000 ) 

 ↓

 గొణగ                      నిజ్జయరాజ                          మల్లప                               లోభచాలక 

                                             ↓

                                      కుసుమాయుధ IV

                                              ↓

     బేతరాజు I   (క్రీ. శ. 1075 – క్రీ. శ .1100 )

i)ఇతని కాలం లో కొరవి నుండి గుండ్యన వరకు గల కాకతీయ కుటుంబానికి  చెందిన ప్రాంతాలు పోగొట్టుకున్నాడు

ii)బేతరాజుని బలవంతం గా బొత్తు అనే గోదావరి పరీవాహక ప్రాంతానికి పంపారు . అయినా ఆయన కొరవి ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశారు . అప్పటి నుండి కొరవి రాజ్య బొత్తు నాయకులు గా పేరు పొందారు

iii)విరియాల మల్ల గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎర్ర రాజు , బొట్టు బేతరాజు శత్రువులను సంహరించి కొరవి రాజ్యాన్ని అతనికి అప్పగించినట్లు పేర్కొనబడినది .

                            ↓

కుసుమాయుధ V   (క్రీ. శ. 1100  – క్రీ. శ .1125  )

i)             ముత్త నెగేళ్ల ఇతని బిరుదు

    Ii ) ఇతని కుమారుడు : బొత్తు బేత  (లేక ) బొట్టు బేత

                        ↓

                   బొత్తు బేత

i)ఇతనికి వినిత జనాశ్రయ అనే బిరుదు ఉంది .

ii ) ఈయనకి ఇద్దరు కుమారులు   :   a ) కుసుమాదిత్య VI             b )నాగతి రాజ


                     ↓                                                                                       ↓

       కుసుమాది త్య VI                                                                  నాగతి రాజ

i)ఇతనికి మార్బల కేసరి అనే బిరుదు ఉంది                      I )ఇతనికి వివేక నారాయణ   అనే బిరుదు ఉంది  

                                                                   ii)ఇతను ఈ వంశం లో ఆఖరి వాడు

                                                                         iii)ఇతను కాకతీయ గణపతి దేవుని సైన్యం చేతిలో

                                                                   ఓడిపోయి , తన విసురు నాడు ప్రాంతాన్ని వదలి

                                                                   పోయాడు . 

 


 

 

 


                                                                                                                       


Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)