Brief notes on Vemulawada Chalukyas
వేములవాడ(లేములవాడ ) చాళుక్యులు
(క్రీ. శ. 750 – క్రీ . శ . 973)
1)వేములవాడ చాళుక్యుల తొలి కుటుంబ సభ్యులు బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దగ్గర
పనిచేశారని ప్రముఖ చరిత్ర కారులైన బి. ఎన్. శాస్త్రి గారు అభిప్రాయ పడ్డారు. .
వారి పరాక్రమనికి మెచ్చుకొని బాదామి చాళుక్య రాజులు, సత్యాశ్రయ
రణ విక్రమునకు ‘సపద లక్ష’ ప్రాంతాన్ని
(నేటి తెలంగాణ లో ని కరీం నగర్ , నిజామాబాద్ జిల్లాలు ) , బోధన్ రాజధాని గా చేసుకొని పాలించటానికి ఇచ్చారుట. సత్యాశ్రయ రణ
విక్రముని వారసులైన పృత్వీ పతి , రాజాధిత్య పృత విక్రముడు
చాళుక్య రాజుల యుధ్ధాలలో సహాయం చేశారు .
2) బాదామి చాళుక్యుల పతనం అనంతరం , వేములవాడ చాళుక్యులు , రాష్ట్రకూటుల కింద రాజులు గా , అర్ధ – స్వతంత్ర
హోదాలో రెండు సంవత్సరముల పాటు పరిపాలన చేశారు.
3)ఈ కుటుంబ చరిత్ర మనకు ( i ) కొల్లిపర, ( ii )కురవ గట్ట, ( iii ) పరభని ( iv ) వేములవాడ శాసనాల ద్వారా
తెలుస్తోంది. అంతే కాకుండా పంప కవి
రాసిన ‘విక్రమార్జున విజయం ‘ లోనూ ఈ కుటుంబ వంశా వళి వివరాలు ఉన్నాయి.
వినయాదిత్య యుద్ధ మల్ల I (క్రీ. శ. 750 – క్రీ . శ . 775 )
(రాజధాని : బోధన్ ) ((కరీంనగర్ & నిజామాబాద్ జిల్లాలు ) (ఇక్కడ చోటుకు ‘సపద లక్ష ‘ పేరు ఉంది )
⇩
అరికేసరి I (క్రీ. శ. 775 – క్రీ . శ . 800 )
⇩
నరసింహ I
⇩
యుద్ధ మల్ల II
⇩
(నోట్:
ఈ మధ్యకాలపు వివరాలు తెలియటం లేదు )
⇩
బద్దెగ (క్రీ. శ. 850 – క్రీ . శ . 895 )
ఇతని బిరుదులు : “సొలద గండ “, ‘42 యుద్ధా
లలో వీరుడు’ , ‘ఓడింప
బడని వీరుడు ‘
ఇతను బద్దెగే శ్వరాలయము నిర్మించాడు. దీన్నే
వేములవాడలోని భీమేశ్వరాలయం అంటున్నారు .
యుద్ధ మల్ల III (క్రీ. శ. 895 – క్రీ . శ . 915 )
⇩
నరసింహ II ( క్రీ. శ. 915
– క్రీ . శ . 930 )
(‘కళా ప్రియ’ అనే ప్రదేశం లో విజయ స్థూపాన్ని
స్థాపించాడు . )
(‘జకన్వి ‘ అనే రాజకుమారిని వివాహమాడాడు)
⇩
ఆరి కేసరి
III (క్రీ. శ. 930 – క్రీ . శ . 941 )
ఇతని కాలం లో కన్నడ కవి ‘పంప’ ‘విక్రమార్జున విజయం ‘ అనే కన్నడ కావ్యం రాశాడు
.
ఇతని కాలం లో వేములవాడలో ‘ఆదిత్య గృహము ‘ నిర్మించ బడింది
ఇతను ‘రేవకణి ర్మడి’, ‘లోకాంబిక ‘ అనే ఇద్దరు రాజ కన్యలను
వివాహమాడాడు
ఇతనికి ‘రేవకణి ర్మడి’ భార్య ద్వారా ‘వగరాజు ‘ అనే కొడుకు ; మరియు ‘లోకాంబిక’ భార్య ద్వారా ‘భద్ర దేవ’ అనే
కొడుకు జన్మించారు
అందువల్ల రాజ్యాన్ని రెండు భాగాలు చేశారు .
| ⇩ | |||
వగరాజు భద్ర
దేవ
ఇతని రాజధాని : గంగాధర ఇతని
రాజధాని : వేములవాడ
వగరాజు , ‘యశస్తిలక చంపు ‘ అనే గ్రంధం
రాసిన సోమ దేవ సూరి ని
ప్రోత్సహించాడు .
సోమదేవ సూరి , వగ రాజుని
‘పాద పద్మోప జీవి ‘ అని వర్ణించాడు
భద్ర దేవు
ని కుమారుడైన
అరికేసరి
IV(క్రీ. శ. 946 – క్రీ . శ . 968 )
కాలం లో రాష్ట్ర కూటు రాజుల ప్రభావం అంతమైనది
తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర కూటుల ప్రభావం పోయి , కల్యాణి చాళుక్యుల ప్రభావం వచ్చినట్లు మెదక్ జిల్లాలో కొర ప్రోలు వద్ద లభ్యమైన తైల రాజు (క్రీ. శ . 973 ) శాసనం ద్వారా మనకు తెలుస్తోంది
Comments
Post a Comment