MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3
MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3
Prepared by: Praturi
Potayya Sarma
1) ఎప్పుడు గులాం యాజ్దాని గారిని డైరెక్టర్‌గా నిజాం
ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది?
ఏ)1914 లో
2) 1979-83 మధ్యకాలంలో ఎక్కడ జరిపిన త్రవ్వకాల్లో పూర్వ
శాతవాహన, శాతవాహనుల కాలాలకు సంబంధించిన
అనేక చారిత్రక, సాంస్కృతిక అవశేషాలు బయల్పడ్డాయి?
ఏ)కోటిలింగాలలో
( combined కరీంనగర్ జిల్లా )
3)
ఎక్కడ బయటపడిన మహాస్తూప వివరాలను అంచనా
వేసి అది ఒక ‘పారిభోగిక స్తూపం’గా నిర్ణయించారు?
ఎ)ఫణిగిరి(నల్గొండ జిల్లా
)
(నోట్ : ‘పారిభోగిక స్తూపం’ అంటే బౌద్ధ సన్యాసుల వ్యక్తిగత వస్తువులు ఉన్నటువంటి, స్తూపంగా చెప్తారు. బౌద్ధ సన్యాసులు, భిక్షువులు ఈ ప్రాంతంలో అధికంగా ఉండేవారు. తెలంగాణాలో లభించిన మొదటి ‘పారిభోగిక స్తూపం’ గా దీన్ని
భావిస్తున్నారు)
4) 1890- 1910 ప్రాంతంలో
వనపర్తి రాజా ఆస్థానంలో ఉన్న
ఎవరు మహబూబ్‌నగర్ శాసనాలను సేకరించినారు?
ఎ) మానవల్లి రామకృష్ణ కవి
5) మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేసిన, తెలంగాణాలో శాసనాల పట్ల అవ
గాహనతో, ఆసక్తితో శాసనాలను చదివిన మొదటి
వ్యక్తి ఎవరు ?
ఎ ) జె.ఎ.ఫ్లీట్
6) 1916-1918 ప్రాంతంలో ఎవరు నల్లగొండ, వరంగల్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అనేక శాసనాలను సేకరించారు.
వీరి కృషి తెలంగాణ చరిత్రకు ఆయువుపట్టు అంటారు .
ఎ ) శేషాద్రి రమణకవులు
7) తెలంగాణాలో __________ పరిశోధక సంస్థ ద్వారా కొమర్రాజు ‘తెలంగాణ శాసనాలు’ రెండు సంపుటాలుగా
1930, 19 32లలో వెలువరించారు
ఎ) కొమర్రాజు లక్ష్మణరాయ
8) స్టేట్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో ”కార్పస్ ఇన్స్‌స్క్రిప్షన్స్
ఆఫ్ తెలంగాణ” 4 సంపుటాలు వెలువడ్డాయి. మొదటి మూడు
సంపుటాలకు ______________ఎడిటర్‌గా
వ్యవహరించగా, 4వ సంపుటం మల్లంపల్లి సోమశేఖర శర్మ
ఆధ్వర్యంలో వచ్చింది.
ఎ ) పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు
9) ఉపాసికాయ బుద్ధ రక్షిషాయ దానం (_____________) రాసిన శాసనం ఏది / ఎక్కడ ఉంది?
ఎ )వర్ధమానుకోట
10) మొదటి సంస్కృత శాసనం విష్ణుకుండిన
గోవిందవర్మ శాసనం ఏది ?
ఏ) ఇంద్రపాలనగర
11) మొదటి ______ శాసనం
వర్ధమానుకోటలో లభించిన ఉపాసికాయ బుద్ధరక్షితాయ దాన శాసనం.
ఎ) ప్రాకృత
12) మొదటి పద్య శాసనం జినవల్లభుడి ________ శాసనం
ఎ) కుర్క్యాల
13) దేన్ని మొదటి గద్య శాసనంగా
పేర్కొంటున్నారు?
ఎ) మొదటి గద్య శాసనం
కొరవి శాసనం
14) తెలంగాణ రాష్ట్రం లో మొదట శాసనాల్లో ఏ భాష ఉంది ?
ఎ) ప్రాకృత
నోట్: అటు తర్వాత క్రమంగా శాసనాల్లో సంస్కృతం ప్రవేశించింది. ఎక్కువ
ప్రాకృతం, తక్కువ సంస్కృతం నుండి తక్కువ
ప్రాకృతం ఎక్కువ సంస్కృతం ఉన్న శాసనాలు వచ్చినవి. కాలక్రమంలో ప్రాకృతం పూర్తిగా
అదృశ్యమైంది. సంస్కృతం- కన్నడ, కన్నడ – సంస్కృతం, కన్నడ – తెలుగు, తెలుగు – కన్నడ, సంస్కృతం – తెలుగు, తెలుగు –
సంస్కృతం.. ఈవిధంగా శాసనాల్లో ఆయా రాజుల అధికార భాషానుగుణంగా భాష స్థిరపడింది.
కొన్ని మరాఠీ శాసనాలు, పర్షియన్, ఉర్దూశాసనాలు కూడా ఈ ప్రాంతంలో లభించినాయి.
15) క్రీ.పూ. 6వ శతాబ్దిలో
భారతదేశంలో ఏర్పడ్డ 16 జనపదాలతో దక్షిణ భారతదేశం మొత్తంలో
ఉన్న ఒకే ఒక జనపదం (Republic) ఏది ? దీని ద్వారా మన
తెలంగాణ లోని కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలంటేనే తెలంగాణ
ప్రాశస్త్యం తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాల వారు, అధికారులు తదితరులు వివిధ సందర్భాలలో అనేక శాసనాలు జారీచేశారు. ఈ
చారిత్రక శాసనాలు మన చరిత్ర రచనకు శ్వాసనాళాలు. ఈ శాసనాలలో ఎక్కువగా దాన శాసనాలే
కన్పిస్తాయి.
ఎ) అస్సకా
16) క్రీ.పూ. 4వ శతాబ్ది నాటి
కోటిలింగాల నాణెములపై ఏ పేర్లు కన్పిస్తాయి ? (ఇవి శాతవాహనుల పూర్వకాలానికి చెందినవి)
ఎ ) గోబధ, కంవాయస, నరన
17) వేటిని శాసన పరిశోధకులు ”తొలిశిలాశాసన యుగం” అంటారు ?
ఎ) క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి, నేటి జగిత్యాల
జిల్లాలోని కోటిలింగాల, దనాళికట్ట, మునులగుట్టలో కన్పించిన లఘుశాసనాలు మన ప్రాంతంలోని తొలి శాసనాలని
చెప్పవచ్చు. ఇవన్నీ కూడా బౌద్ధుల చైత్య, స్థూప విహారాలలో లభించినవే. వస్తుపరంగా యివి రాతిపై (శిలలపై)
చెక్కినవి.
18) దేన్ని ‘రాగిరేకుల యుగమ’ని లేక ‘లోహరేకుల యుగమ’ని అంటారు అంటారు
తెలంగాణ చరిత్రలో ?
ఎ) క్రీ.శ. 2,3 శతాబ్దాల నుండి రాళ్ళకి (శిలకి) బదులుగా శాసనాలకి రాగి రేకులను
(లోహపు రేకులు) వినియోగించారు. దీన్ని రాగిరేకుల యుగమని లేక లోహరేకుల యుగమని
అంటారు. వీటిని ఎక్కువగా బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసే సందర్భంలో యిచ్చేవారు.
మల్లoపల్లి వారి అభిప్రాయంలో ‘రాగిరేకుల శాసనం లభించిందంటే అది
బ్రాహ్మణులకిచ్చిన భూ దానమని చెప్పవచ్చు. ‘వైదిక, బ్రాహ్మణ మతంలోనే ఈ రాగి రేకుల జారీ అధికంగా కన్పిస్తుంది
19) దేన్ని ”రెండవ శిలాశాసన యుగం” అంటారు ?
ఎ ) క్రీ.శ. 7,8 శతాబ్దాల నుండి రాగి రేకులతోపాటు తిరిగి శిలాశాసనాలు జారీ కావడం పునః
ప్రారంభమైనది. ఇది కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలానికి ఉచ్ఛ స్థాయికి చేరింది. దీన్ని ”రెండవ శిలాశాసన
యుగం” అంటారు. లోహయుగంలో శిలా శాసనాలు లేవనికాదు. కానీ, తక్కువగా ఉన్నాయి.
20) ఎవరి శాసనాలలో పార్శీ, తెలుగు ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి?
ఎ) రేచర్ల
పద్మనాయకులు, విజయనగర, కుతుబ్‌షా, అసఫ్ జాలు ప్రముఖులు – కుతుబ్‌షాల
శాసనాలలో పార్శీ, తెలుగు ద్విభాషా శాసనాలు
లభిస్తున్నాయి
21) దేని ద్వారానే చరిత్రకారులకి
తొలిసారిగా ”కాకతీయ వంశం” గురించి తెలిసింది ?
ఎ ) తెలంగాణలో శాసన
పరిశోధన, శాస్త్రీయ పరిష్కరణ క్రీ.శ. 1882 నుండి జె.ఎ.ఫ్లీట్ హనుమకొండ వేయి స్థంభాల గుడి శాసనం చదివిన నాటి
నుండి ఆరంభమైనదని చెప్పవచ్చు. ఫ్లీట్ అప్పట్లో భారత ప్రభుత్వ (ఆంగ్లేయుల
అధికారంలోని) ప్రధాన శాసన పరిశోధకునికి సహాయకారిగా ఉండేవాడు. హైదరాబాద్ నిజాం
నుండి ప్రత్యేక అనుమతి పొంది జె.ఎ.ఫ్లీట్
రుద్రదేవుని ‘హనుమకొండ శాసనం’ చదివాడు. దీని ద్వారానే చరిత్రకారులకి తొలిసారిగా ”కాకతీయ వంశం”
గురించి తెలిసింది
22) ఏ ఆస్థాన పండితుడైన మానవల్లి రామకృష్ణ కవి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూధ్‌పూర్, వర్థమానపురం శాసనాలను ప్రకటించారు?
ఎ) వనపర్తి
సంస్థానంలో ఆస్థాన పండితుడైన మానవల్లి రామకృష్ణ కవి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూధ్‌పూర్, వర్థమానపురం శాసనాలను ప్రకటించారు
23) దేన్ని ‘ఆర్షశాఖ’గా వ్యవహరించారు ?
ఎ ) 1914లో నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌లో పురావస్తుశాఖను ఏర్పరచింది. దీన్ని
‘ఆర్షశాఖ’గా వ్యవహరించారు. దీనికి గులాంయాజ్దాని సంచాలకులుగా నియుక్తులయ్యారు
24) ఎవరి సంచాలకత్వంలోనే
తర్వాత కాలంలో పుట్టపర్తి శ్రీనివాసచారి, సంపాదకత్వంలో ‘కార్పస్ ఆఫ్ యిన్స్ క్రిప్షన్స్ ఆఫ్ తెలంగాణ’ పేర
శాసన సంపుటాలు వెలువడ్డాయి ?
ఎ ) గులాంయాజ్దాని సంచాలకత్వంలోనే (Director) తర్వాత కాలంలో
పుట్టపర్తి శ్రీనివాసచారి, సంపాదకత్వంలో ‘కార్పస్ ఆఫ్ యిన్స్
క్రిప్షన్స్ ఆఫ్ తెలంగాణ’ పేర శాసన సంపుటాలు వెలువడ్డాయి
25) ఎప్పుడు వరంగల్‌లో
కాకతీయ జయంత్యుత్సవాలు జరిగాయి ? ఫలితంగా 1935లో
‘కాకతీయ సంచిక’ వెలువడ్డది
ఎ ) 1932లో వరంగల్‌లో కాకతీయ జయంత్యుత్సవాలు
జరిగాయి. ఫలితంగా 1935లో ‘కాకతీయ సంచిక’ వెలువడ్డది. దీనిలో
కాకతీయులనాటివి శాసనాలు అనేకం ప్రచురించబడ్డాయి. మారేమండ రామారావు దీనికి
సంపాదకులు. భావరాజు వెంటక కృష్ణారావు, రాళ్ళబండి
సుబ్బారావు, శేషాద్రి రమణ కవులు, ఆచార్య సిరుగూరు హనుమంతరావు వంటి చరిత్ర, శాసన పరిశోధకులు దీనిలో పాలుపంచుకున్నారు
26) శాతవాహనుల తొలి శాసనాలు కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట లభించిన
ప్రాంతాలు , ఏ జిల్లాలో ఉన్నాయి ?
ఎ ) శాతవాహనుల తొలి
శాసనాలు కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట వద్ద లభిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాలు నేటి జగిత్యాల
జిల్లాలలోనివే.
27) ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర భట్టారిక ఎవరి భార్య ?
ఎ ) ఉజ్జయినీ శకరాజ
కుమార్తె రుద్రధర భట్టారిక ఇక్ష్వాకు వీరపురుష దత్తుని భార్య.
28) ఇక్ష్వాకుల కాలంనాటి ఏ శాసనాలకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నది ?
ఎ )ఇక్ష్వాకుల
కాలంనాటి నాగార్జునకొండ, ఏలేశ్వరం, ఫణిగిరి (Nalgonda) శాసనాలు చారిత్రక
ప్రాధాన్యత ఉన్నవి
29) ఏ శాసన శకలముపై ‘శక’
వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉన్నది. ?
ఎ) నాగార్జున కొండ త్రవ్వకాలలో లభించిన శతాధిక శాసన శకలాలలో నాలుగు
శాసనాలు అత్యంత ప్రాముఖ్యమైనవన్న విషయం అందరూ అంగీకరించాల్సిన విషయమే. ఒక శాసన శకలముపై
‘శక’ వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉన్నది. ఉజ్జయిని కేంద్రంగా ఇక్ష్వాకుల
సమకాలీనులుగా పరిపాలన చేసిన వారు ఈ శకులు
30 ) ఏ శాసనాల ద్వారా తెలంగాణా ప్రాంతానికి యితర ప్రాంతాలలో (సుదూర
శ్రీలంకతో సహా) గల సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి ?
ఎ )నాగార్జున కొండ
శాసనాల ద్వారా తెలంగాణా ప్రాంతానికి యితర ప్రాంతాలలో (సుదూర శ్రీలంకతో సహా) గల
సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి
31) యిటీవల ఎక్కడ బయల్పడిన రుళ పురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం అత్యంత ప్రాముఖ్యమైనది. ?
ఎ )ఫణిగిరి (Nalgonda)లో యిటీవల బయల్పడిన రుళ పురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం అత్యంత ప్రాముఖ్యమైనది. యిప్పటి వరకు రుళ
పురుష దత్తుడు 12 సంవత్సరాలే రాజ్యం చేశాడని
భావించారు. కానీ, ఈ శాసనం వల్ల ఇక్ష్వాకుల పాలనా కాలం
మరొక ఆరు, ఏడు సంవత్సరాలు ముందుకు జరుగుతుంది.
32 ) ఏ శాసనంలో బుద్ధున్ని ‘కంసనిసూదన’ వంటి బిరుదులతో పేర్కొన్నారు ?
ఎ )
ఫణిగిరి (Nalgonda) శాసనంలో బుద్ధున్ని ‘కంసనిసూదన’ వంటి
బిరుదులతో పేర్కొన్నారు. అంటే బుద్దుడు హైందవ దేవగణంలో కలిసే దశ (కలిపేసే దశ)
ఆరంభమైనదని చెప్పవచ్చు. అట్లే శాసనాలు ప్రాకృత భాష నుండి సంస్కృత భాషలోకి మార్పు
చెందడం ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.
33) ఇక్ష్వాకుల తర్వాత ఫణిగిరి(Nalgonda)
లో కన్పిస్తున్నవి ఎవరి శాసనాలు ? వీరి శాసనాలలో చరిత్ర గతిని మార్చినవి గోవింద వర్మ, విక్రమేంద్ర భట్టార వర్మల తుమ్మల గూడెం తామ్ర శాసనాలు
ఎ ) ఇక్ష్వాకుల తర్వాత
యిక్కడ కన్పిస్తున్నవి విష్ణుకుండినుల శాసనాలు. వీరి శాసనాలలో చరిత్ర గతిని
మార్చినవి గోవింద వర్మ, విక్రమేంద్ర భట్టార వర్మల తుమ్మల
గూడెం తామ్ర శాసనాలు
34 ) రంగనాథ రామాయణము తెలుగు సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన. దీని రచయిత ఎవరు ?
జవాబు : దీని రచయిత గోన బుద్ధారెడ్డి. ఈయన కాలం క్రీ.శ. 1250-1320. మహబూబ్‌నగర్ జిల్లా వర్ధమానపురం ఏలిన ప్రభువు. తెలంగాణలో పుట్టిన రంగనాథ రామాయణము తెలుగు
సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన.
35 ) అగ్గలయ్య ఎవరు ?
ఎ ) అగ్గలయ్య అనే
శస్త్రచికిత్సకుడు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని
చాళుక్య జయసింహుని క్రీ.శ. 1034 నాటి కొలనుపాక
దగ్గరి శాసనంలో ప్రశంసింపబడినాడు.
మధ్యయుగంలో నొక శల్యచికిత్సకుడు తెలంగాణలో నున్నట్లు క్రీస్తుశకం 1034 నాటి శాసనం ద్వారా తెలిసిరావటం గర్వించదగిన విషయం.
అగ్గలయ్య జైనుడు. మంత్రితో సమానమైన హోదాతో చాళుక్య రెండవ జయసింహుని
కాలంలో (1015-1042) నున్న వాడు.
ఇతనికి వైద్యరత్నాకర ప్రాణాచార్య నరవైద్య అనే బిరుదులున్నట్లు పేర్కొనబడింది.
రెండు జైనబసదులను నిర్మించినాడు. ఉమాతంత్రం సంగ్రహపరిచ్ఛేదం మొదలైనవాటిలో
నిష్ణాతుడు. ఆలేరు దగ్గరి ముప్ప(చ్చ)నపల్లిని రెండు జైనబసదుల నిర్వహణకొరకు
దానమిచ్చినాడు. అందులో నొక బసదికి అగ్గలయ్య బిరుదుతో వైద్యరత్నాకర జినాలయం అని
పేరు. నరవైద్యుడైన అగ్గలయ్య ఇతర వైద్యులకు సాధ్యంకాని ఎన్నో రోగాలను కుదిర్చినాడు.
36) రాజమహీపతిరాయ్ ఎవరు ?
ఎ ) 19వ శతాబ్ది ప్రారంభంలో ప్రస్తుత విదర్భ ప్రాంతంలోనే బీరార్ నిజాం
రాజులు ఏలుబడిలో ఉండేది. బీరార్‌కు రాజమహీపతిరాయ్ అనే ఆయన గవర్నర్. నాడు గవర్నర్
పదవి నిజాం ప్రభుత్వం యంత్రాంగంలో కీలకమైంది. అప్పట్లో బ్రిటిష్‌వారికి
మహారాష్ట్రులకు మధ్య యుద్ధం జరుగుతోంది. బీరార్ గవర్నర్‌గా ఉన్న మహీపతిరాయ్
బ్రిటిష్ సేనలకు మద్దతు నివ్వాలని నిజాం నవాబు ఆదేశించాడు. అయితే మహీపతిరాయ్ తమ
రాజు ఇచ్చిన ఆదేశాల్ని పాటించలేదు. బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ఉద్యమించాడు.
నిజాం నవాబుకు ఆగ్రహం కలిగింది. మహీపతిరాయ్‌ని గవర్నర్ పదవినుండి తొలగించారు.
37) 19వ శతాబ్ది ప్రారంభంలో రాజమహీపతిరాయ్
స్ఫూర్తి తో ముందుకు సాగినవారు ఎవరు ?
ఎ ) నిర్మల్
ప్రాంతానికి చెందిన రామాగౌడ్, రాంజీగోండు మహబూబ్‌నగర్
జిల్లాలో వనపర్తి ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య.. వంటి ఎందరో వీరులు నాటి పోరాటాలలో భాగస్వాములయ్యారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో అమితమైన స్ఫూర్తితో ఉద్యమించిన పండుగ శాయన్న వంటి వీరులు మరణశిక్షను
అనుభవించవలసి వచ్చింది.
38 ) తుర్రెబాజ్‌ఖాన్ ఎవరు ?
ఎ ) 1857 నాటి పోరాట చరిత్రలో తుర్రెబాజ్‌ఖాన్ వీరత్వం ఒక ఉజ్వల ఘట్టం.
తుర్రెబాజ్‌ఖాన్ నాటి సైన్యంలో తిరుగుబాటు చేసి బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని
బాహాటంగా వ్యక్తపరిచిన ధీరుడు. అత్యంత ధైర్యశాలి. హైదరాబాద్ నగరం నట్టనడుమ
బ్రిటిష్ రెసిడెన్సీ (ప్రస్తుతం కోఠీ ప్రాంతం) ఉంది. తుర్రెబాజ్‌ఖాన్ తనతోపాటు
మౌల్వీ అల్లా ఉద్దీన్‌ను తీసుకొనిపోయి బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేశాడు. 1857వ సంవత్సరం 17వ తేదీనాడు పట్టపగలు ఈ మెరుపుదాడి
జరిగింది. ఈ దాడిలో కొన్నివందలమంది పాల్గొన్నారు. దాడిని గురించి రెసిడెంట్‌కు
ఎటువంటి ముందస్తు సమాచారం అందలేదు! అంత పకడ్బందీగా వ్యూహరచన జరిగింది.
39 ) 1857 తిరుగుబాటులో పాల్గొన్న నిజామాబాద్ జిల్లాలోని ఎవరు ప్రముఖులు ?
ఎ )1857 తిరుగుబాటులో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ జాగీర్దార్ రాజాదీప్‌సింగ్, నార్ఖేడ్ గ్రామ పట్వారీ రంగారావుల పాత్ర గణనీయమైంది. బ్రిటిష్
వారికి వ్యతిరేకంగా పోరాడినందుకు రాజాదీప్‌సింగ్ తన జాగీరును కోల్పోయాడు.
రంగారావు కఠోరమైన శిక్షలు అనుభవించాడు
40 ) నిజాం వ్యతిరేక పోరాటంలో ఎవరు పాల్గొన్నారు ?
ఎ )నిజాం వ్యతిరేక
పోరాటంలో రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు. టి.హయగ్రీవాచారి, పి.వి.
నరసింహారావు వంటివారు చాందా, విజయవాడ తదితర
ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ముఖ్యపాత్ర నిర్వహించారు.
41) వట్టికోట ఆళ్వార్ స్వామి ఎవరు ?
ఎ )ప్రముఖ రచయిత, దేశోద్ధారక గ్రంథమాల వ్యవస్థాపకులు వట్టికోట ఆళ్వార్ స్వామి క్విట్
ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార వాసాన్ని అనుభవించారు
42) సిర్పూర్ కోటనుండి కొంత కాలం పాటు పాలన కొనసాగించిన బీర్‌షా
అనంతరం రాజధానిని ఎక్కడకు మార్చాడు ?
ఎ ) సిర్పూర్
కోటనుండి కొంత కాలం పాటు పాలన కొనసాగించిన బీర్‌షా అనంతరం రాజధానిని ”జునుగాం”కు
మార్చాడు. ఆ తర్వాత ”బల్లాల్‌షా” చంద్రపూర్ నదికి దక్షిణం వైపు కొత్త రాజధానిని
నిర్మించాడు. ప్రస్తుతం ఆ నగరమే ”బల్లార్‌షా” గా పిలవబడుతోంది
43) జు న్ గాం ఎక్కడుంది ?
ఎ ) 900 సంవత్సరాల క్రితం ”జున్‌గాం” అంటే ఆసిఫాబాద్‌లోని ప్రాంతం దట్టమైన
అడవులు కొండలతో నిండి ఉండేది.
44) దేవ దుర్గం ఏది ?
ఎ ) కేరామేరి, ఝరి, జోడేఘాట్ కొండల్లో విస్తరించిన
అలనాటి గోండు రాజ్యం ”దేవదుర్గం”. ”దేవదుర్గం” క్రింద సుమారు 180 గ్రామాల పాలన సాగేది. 900 సంవత్సరాల క్రితం ”భీంబల్లాల్‌షా” ఇక్కడ పటిష్ఠమైన కోటను ”జున్‌గాం”
లోని కంచు కోటకు ధీటుగా 1600 అడుగుల ఎత్తయిన కొండపై శత్రు
దుర్భేద్యంగా నిర్మించాడు. ”దేవదుర్గం” ఎత్తయిన కొండపై నిర్మించటం వల్ల శత్రు
రాజులకు ఈ దుర్గాన్ని జయించాలంటే చాలా కష్ఠంగా ఉండేది. ఇప్పటికి ఈ కొండను
చేరుకోవాలంటే చాలా కష్ఠం. ఆసిఫాబాద్ నుండి 32 కిలో మీటర్ల దూరంలోని మొవాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి 12 కిలో మీటర్లు నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది
45 ) ”సవతుల గుండం” జలపాతం ఎక్కడుంది ?
ఎ ) ఆసిఫాబాద్ నుండి 32 కిలో మీటర్ల దూరంలోని మొవాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి 12 కిలో మీటర్లు నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది.
కొండపైనున్న వనదేవతకి ఇప్పటికి దసరా సమయంలో మొవాడ్ చుట్టు ప్రక్కల గోండులు 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. కోటకు రక్షణగా ఈ వనదేవతను
ప్రతిష్ఠించారని గిరిజనుల నమ్మకం. నిలువైన కొండపైకి ఎక్కటం అంత సులువు కాదు.
దట్టమైన అటవీ ప్రాంతం. కొండకి తూర్పువైపున ”సవతుల గుండం” జలపాతం కన్నుల పండుగగా
ఉంటుంది. ఉత్తరాన పెద్ద వాగు ఉధృతి విపరీతంగా ఉంటుంది.
46 ) పానగల్లు కోట ఎక్కడుంది ?
ఎ ) హైద్రాబాద్
నుండి సుమారు 163 కి.మీ. దూరంలో, నాటి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 74 కి.మీ. దూరంగా ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా
కేంద్రానికి 15 కి.మీ. దూరంలో, పానగల్లు బస్‌స్టాండ్‌కి సుమారు 2 కి.మీ. దూరంలో ఎత్తయిన రెండు కొండల మధ్య 11, 12 శతాబ్ధాల మధ్య కళ్యాణి చాళుక్యుల కాలంలో అత్యంత పటిష్ఠంగా, ప్రణాళికాబద్దంగా, శత్రదుర్భేధ్యంగా
ఈ గిరిదుర్గం నిర్మించబడింది.
పానగల్లు కోటలో మార్బెల్ రాళ్ళతో నిర్మించిన ఉయ్యాల మండపంలో ”బంగారు ఊయాల”
ఉండేదట. దాని ఆనవాళ్ళు కోటలో ఇప్పటికీ మనకు కానవస్తాయి
47 ) ఈ
కింది వాటిల్లో ఏది సరైనది ?
ఎ )వెలిగందలలోని
(కరీంనగర్) రామగిరి ప్రభావవంతమైన ఓషధులకు
నిలయమై ఎందరినో ఆకర్షించేది.
బి )జైనవిద్యానిధియైన
ఉగ్రాదిత్యాచార్యుడు ‘కల్యాణకారకo’ అ నే ఆయుర్వేద గ్రంథాన్ని రామగిరి వ్రాసినట్లు తెలుస్తున్నది.
సి ) పాలమూరు ( మహబూబ్‌నగర్
) జిల్లాలోని పూడూరు శాసనంలో (క్రీ.శ.1088 ) హల్లకరసు అనే గొప్ప విద్వాంసుడు -భైషజ్యశాస్త్ర దానవినోద-అని
కీర్తింపబడినాడు. అంటే వైద్యశాస్త్రాన్ని బోధించేవాడని తెలుస్తున్నది
డి)
పైవన్ని
జవాబు : డి
48 ) బావరి ఎవరు ? వివరాలు ఏవి ?
ఎ ) బావరి అనే ఒక ఋషి
ధార్మిక ప్రగతికోసం ఉత్తరాపథంనుండి దక్షిణాపథానికి నాటి 16 మహాజన పదాలలోని దక్షిణ భారతంలోనే ఏకైక అస్సక (అశ్మక) జనపదంలోని
గోదావరి తీరానికివచ్చి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మధ్యగల గోదావరీ నదీ ద్వీపంలో అంటే నేటి నిర్మల్
జిల్లా, ఖానాపూర్ మండలంలోని బాదనకీర్తిలో
కపిత్తవనంలో స్థిర నివాసానేర్పరచుకొని జీవనం కొనసాగించాడని తెలుస్తోంది
బి ) బుద్ధుని జీవిత
కాలంలోనే బౌద్ధ ధర్మం తెలంగాణ (తెలుగు నేల)లో ప్రవేశించిందనడానికి త్రిపీఠకాల్లో
ఒకటైన సుత్తపీఠకంలోని సుత్తనిపాతంలో భాగమైన పారాయణవగ్గలోని ఒక వృత్తాంతంవల్ల
తెలుస్తోంది. అందులోని వివరాల ప్రకారం బావరి అనే ఒక ఋషి ధార్మిక ప్రగతికోసం
ఉత్తరాపథంనుండి దక్షిణాపథానికి నాటి 16 మహాజన పదాలలోని దక్షిణ భారతంలోనే ఏకైక అస్సక (అశ్మక) జనపదంలోని
గోదావరి తీరానికివచ్చి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మధ్యగల గోదావరీ నదీ ద్వీపంలో అంటే నేటి నిర్మల్
జిల్లా, ఖానాపూర్ మండలంలోని బాదనకీర్తిలో
కపిత్తవనంలో స్థిర నివాసానేర్పరచుకొని జీవనం కొనసాగించాడని తెలుస్తోంది. తనకొచ్చిన
సంశయాలను తీర్చుకోవడానికి వయోభారంవల్ల తనవద్దగల 16మంది శిష్యులను ఉత్తరాపథంలో ఉన్న తథాగత గౌతమబుద్ధ వద్దకు పంపాడు.
వారు ఆనాటి అస్సక జన పదంలోని నేటి బాదనకుర్తి నుండి ములక, మణిశ్మతి, ఉజ్జయిని, విదిశ, కోశాంబి, సాకేతపుర, శ్రావస్థి, కపిలవస్తు, సాతవ్య, కుశినగర, పావ, తదితర ప్రాంతాలగుండా, చివరన వైశాలిలో బుద్ధుడు ప్రవచిస్తున్నాడని తెలుసుకొని అక్కడకువెళ్ళి, తమ గురువు సంశయాలను తీర్చుకొని, సుమారు 15మంది శిష్యులు అక్కడనే బౌద్ధ
బిక్షువులుగా ఉండిపోయారు.
సి )బావరి
ప్రియశిష్యుడు పింగియ మాత్రం తిరిగి వచ్చి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని బావరికి
వివరించాడు. అతనికి కలిగిన సంశయాలన్నింటికి బుద్దుని వద్దనుంచి వచ్చిన పింగియ
సమాధానాలతో సంతృప్తి చెందిన బావరి బౌద్ధమే అన్ని కాలాలలో, అందరికీ శాంతిని చేకూర్చే ధర్మం అని తెలుసుకొని, తాను బౌద్ధాన్ని స్వీకరించి అక్కడినుండి బౌద్ధ ధర్మ ప్రచారం
గావించాడని సుత్తనిపాతంలోని పారాయణవగ్గ మనకు వివరిస్తుంది.
డి ) పైవన్ని
జవాబు : డి
49)
బోధన్ పాత పేరు ఏది ?
ఎ ) బోధన్‌గా
పిలుస్తున్న నాటి పోథలిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న అస్మకరాజు కూడా
బౌద్ధాన్ని తీసుకున్నట్లు చరిత్రకారులవల్ల మనకు తెలుస్తోంది.
50) తెలంగాణాలోని ఎక్కడికి మొదటిసారిగా బౌద్ధ ధర్మం
ప్రవేశించింది ?
ఎ ) క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే ఉత్తరాదినుంచి దక్షిణాదిలోని తెలంగాణాలోని
బాదవకుర్తికి మొదటిసారిగా ప్రవేశించిన బౌద్ధ ధర్మం
51 ) బుద్ధవనం వివరాలు ఏవి ?
ఎ ) ఒకనాటి బౌద్ధ ప్రాభవాన్ని మనం గుర్తు చేసుకుంటూ బౌద్ధ వారసత్వాన్ని
భావితరాలకు అందించాలనే సంకల్పం నుంచి రూపుదిద్దుకొన్నదే నేటి ‘శ్రీపర్వత ఆరామ’.
బి)బుద్ధవనంగా
ప్రచారం పొందిన ఈ ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు కుడివైపున డ్యాంకు 3 కి.మీ. దూరంలో, నల్గొండ జిల్లాలో
ఉంది.
సి )తెలంగాణ రాష్ట్ర
రాజధాని హైదరాబాదుకు 152 కి.మీ. దూరంలో నల్గొండ జిల్లా
కేంద్రానికి 60 కి.మీ. దూరంలో ఉన్న బుద్ధవనం చక్కని
ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులకు, బౌద్ధ భిక్షువులకు, చరిత్ర కారులకు, ముఖ్యంగా
నాగార్జునసాగర్, నాగార్జునకొండను సందర్శించే
రాష్ట్రీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల బౌద్ధ వారసత్వ ప్రతీకగా మన్ననలను అందుకొంటోంది.
డి ) పై వన్నీ
జవాబు : డి
52) శ్రీపర్వత ఆరామ వివరాలు ఏవి ? ఆచార్య నాగార్జునుడు ఎక్కడ ఉన్నాడు ?
ఎ ) క్రీ.శ. 2వ శతాబ్దంనుంచి ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వత విజయపురిగా ప్రసిద్ధి
చెందిన ఈ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు నివాసమేర్పచుకొని మహాయాన బౌద్ధ కేంద్రంగా
మాధ్యమిక సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేయడంవల్ల ఈ ప్రదేశం
నాగార్జునకొండగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 5వ శతాబ్దం వరకు కూడా ఈ శ్రీపర్వతం గొప్ప బౌద్ధ సాంస్కృతిక కేంద్రంగా
విరాజిల్లింది. ఇక్కడికి శ్రీలంక, నేపాల్, టిబెట్‌లనుంచి అలాగే మన దేశం అన్ని ప్రాంతాలనుంచి అధ్యయనం కోసం
భిక్షువులు వచ్చేవారు. కాలక్రమంలో దీనిని నందికొండ అని పిలిచారు. ఏలేశ్వరానికి 7 కి.మీ. దిగువన కృష్ణానదిపై అడ్డంగా కట్టిన నాగార్జునసాగర్
ఆనకట్టవల్ల ఏర్పడిన జలాశయంలో నాగార్జునకొండ ముంపునకు గురైంది
53) వైఢూర్యపురం ఏది ?
ఎ ) ఎన్నో వందల ఏళ్ళ (సుమారు 400 ఏళ్ళు) క్రితం వైఢూర్యపురంగా విరాజిల్లిన నేటి ఈ వడూర్‌కిగల
చారిత్రక నేపథ్యం అంతా ఇంతా కాదు. లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం
వైఢూర్యపురాన్ని వెంకటరాయుడు అనే రాజు పాలించేవారు. కానీ అంతకుముందునుండే
వైఢూర్యపురానికి చారిత్రక నేపథ్యం ఉంది. నిమ్మలపట్టణ నిర్మాణానికి కావాల్సిన
ధనాన్ని సమకూర్చింది ఈ వైఢూర్యపురం. అంతటి ధనధన్యాలకు నిలయం ఈ వడూర్‌కోటకి అంతటి
సంపదకు నిలయమైన వైఢూర్యపురం, నిమ్మల
(ప్రస్తుత నిర్మల్) పట్టణానికి సుమారు 35 కి.మీ.
దూరంలో నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే మార్గమధ్యలో బోధ్, నేరడికొండ మండల కేంద్రాలకు సమీపాన ఉన్నది. అప్పట్లో
వైఢూర్యపురాన్ని అందులోని ఖజనాను కేంద్రంగా చేసుకుని వెంకట్రాయుడు నిమ్మల, బొందిడి రాజ్యాలను పాలించేవాడు.
54) నాటి
నిజాం నవాబుల పాలనలో మొత్తం ఎన్ని సంస్థానాలు ఉండేవి ? వివరాలు ఏవి ?
ఎ ) నాటి నిజాం నవాబుల పాలనలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి.
బి )అందులో సంస్థాన్ నారాయణపురం, సంస్థాన్
రాజాపేటలను ప్రధాన పాలనా కేంద్రాలుగా చేసుకొని వారు పాలనా కార్యకలాపాలు జరిపేవారు.
సి )గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత పాల్వంచ సంస్థానాలు స్వంత పాలనాధికారాలు కలిగి ఉండేవి
డి ) పైవాన్ని
జవాబు : డి
55) కరిమొద్దిన్’ తన పేరిట స్థాపించిన
పట్టణo ఏది ?
ఎ ) హైదరాబాద్ రాజధానిగా నిజాం
సంస్థానాన్ని 200 ఏళ్ళ పాటు పాలించిన అసఫ్‌జాహీల
కాలంలో ఎలగందుల ఖిలేదారుగా పనిచేసిన ‘కరిమొద్దిన్’ తన పేరిట స్థాపించిన పట్టణమే
నేటి జిల్లా కేంద్రమైన కరీంనగర్ పట్టణం.
56) రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) దేన్ని పాలించాడు ?
ఎ ) వేములవాడను రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) పాలించాడు
57) ఆనాటి ‘సపాదక్షి’ ఏ ప్రాంతం లో ఉంది ?
ఎ ) నేటి కరీంనగర్, నిజామాబాద్
జిల్లాల ప్రాంతమే ఆనాటి సపాదక్షి
58 ) ప్రతాప గిరి కోట వివరాలు ఏవి ?
ఏ ) ప్రతాప గిరి కోటది. ప్రత్యేకమైన చరిత్ర. కరీంనగర్‌కు
ఈశాన్యంగా 120
కి.మీ. దూరంలో జిల్లా తూర్పు సరిహద్దు ప్రాంతమైన దట్టమైన మహదేవ్‌పూర్ అడవులల్లో
కాటారం మండలంలో వున్న వన దుర్గమే ఈ ‘ప్రతాపగిరి కోట’.
బి ) ముచ్చనాయనింగారు ప్రతాపగిరి
కోటను 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. అతనికి గల ఇరువత్తు
గండడు, గండగోపాలుడు, కంచి రక్ష పాలకా, చోళరాజ్య స్థాపనాచార్య, పాండ్య మనువిభాళ, దాయ గజకేసరి, అరిరాయ గజకేసరి, తెలుగు రాయుడు మున్నగు
బిరుదులు ఉన్నాయి
సి ) దాయగజకేసరి, రాయగజకేసరి, కాకతీయుల బిరుదులను బట్టి ఈ శాసనములు కాకతీయుల కాలపు శాసనమని
భావించవచ్చు. కాకతీయ ప్రతాపరుద్రదేవుని పేరిట నిర్మింపబడిన దుర్గము గనుక ఇది
ప్రతాపగిరి కోటగా ప్రసిద్ధి చెందింది
డి ) పైవన్ని
జవాబు : డి
59) నగరూరు’ నేడు ‘నగునూరు’గా పిలుస్తున్న దాని వివరాలు ఏవి ?
ఏ ) ఒకనాడు రాజధానిగా సబ్బినాడులో ప్రాచుర్యం పొందిన ‘నగరూరు’ నేడు
‘నగునూరు’గా పిలువబడుతోంది
బి ) 1159 ప్రాంతంలో నగునూరును పాలించిన దొమ్మరాజు, పొలవాస పాలకుడు మేడరాజు, కళ్యాణి సేనాని మైలిగి దేవుడు ముగ్గురు మంచి మిత్రులు. లేబెల్
శాసనాన్ని అనుసరించి ఈ మిత్ర కూటమి మొదటగా జరిగిన యుద్ధంలో కాకతి రుద్ర దేవుడ్ని
ఓడించిన అనంతరం జరిగిన మరో యుద్ధంలో ఈ కూటమితో పాటు సబ్బినాడులోని అన్ని
ప్రాంతాలని కాకతి రుద్రదేవుడు గెలుచుకున్నాడని వేయిస్తంభాల గుడిలోని శాసనం
తెలియజేస్తోంది.
సి ) కాకతి రుద్రదేవుని మంత్రి
నగునూరు పాలకుడు వెల్లకి గంగాధరుడు నగునూరులో త్రికూట దేవాలయాన్ని కట్టించినట్లు
కరీంనగర్ కలెక్టర్ బంగ్లాలో ఉన్న శాసనాన్ని అనుసరించి తెలుస్తోంది
డి ) పైవన్నీ
జవాబు : డి
60 ) ‘నగునూరు’ రాజధానిగా సబ్బిమండలాన్ని ఎవరు పాలించాడు ?
ఎ )కాకతీయ గణపతి
దేవుని, సామంతుడు అక్షయ చంద్రదేవుడు
‘నగునూరు’ రాజధానిగా సబ్బిమండలాన్ని పాలించాడు. కొంత కాలం ఇది జైన మత కేంద్రంగా
కూడా విలసిల్లింది.
Comments
Post a Comment