Model questions on Vemulavada Chalukyulu ( 750 AD to 973 AD )
Model questions on
Vemulavada Chalukyulu ( 750 AD to 973 AD )
Prepared by :
Praturi Potayya Sarma
1)వేములవాడ
పూర్వము,
శాసనములలో ఏమని పిలువబడినది?
ఎ)
లేంబులవాడ
2)వేములవాడ
చాళుక్యుల పాలనా కాలము ఏ భాషకు స్వర్ణ యుగము వంటిది ?
ఎ)
కన్నడ భాషకు . రెండవ అరికేసరి పంప
మహాకవి ని గౌరవించెను.
3)
వేములవాడ చాళుక్యులకు సంబంధించిన రెండు తామ్ర శాసనాలు ఏవి ?
ఎ
) మొదటి అరికేసరి ‘కొల్లిపర ‘ తామ్ర శాసనము ; మరియు మూడవ అరికేసరి ‘పర్భణీ’ తామ్ర శాసనము .
4)వేములవాడ
చాళుక్యుల కు చెందిన 6 శాసనాలు ఏవి ?
ఎ )
కురవగట్టు శాసనము ; రెండవ అరికేసరి కరీంనగర్ శాసనము ; రెండవ అరికేసరి
వేములవాడ శిలాశాసనము ;
బి )
జీనవల్లభుని కుర్క్యాల శాసనము
సి )
క్రీ.శ. 946 నాటి కరీంనగర్ శాసనము; రెండవ అరికేసరి క్రీ. శ . 941 నటి చెన్నూరు శిలా శాసనము
డి )
పైవన్నీ
జవాబు
: డి
5)
వేములవాడ చాళుక్యుల వంశ మూల పురుషుడు ఎవరు అంటున్నారు ?
ఎ )
సత్యాశ్రయ రణ విక్రముడు . ( ఈయన
కుమారుడు పృథ్వీపతి )
6)
సపాద లక్ష భూమి అంటే ఏమిటి ?
ఎ )
లక్ష పాతిక వేల సువర్ణములు ఆదాయము వచ్చు భూమి. అని అర్ధము.
7)పూర్వము
బోధను , అస్మక రాష్ట్రమునకు రాజధానిగా వర్ధిల్లి
ఉండేను. 1,25,000 బంగారు నాణెములు ఆదాయము గా గల రాజ్యభాగము
సపడ లక్ష దేశ మనబడినది. గోదావరి నదికి
దక్షిణ మున మంజీర నది నుండి మహా కాళేశ్వరము పర్యంతము వ్యాపించి ఉన్న భూభాగము పోధన
నాడు అని వ్యవహరించారు. ఇదియే సపాద లక్ష దేశము. తర్వాతి కాలములో కరీంనగర్ మండల మును ఏమని
పిలిచారు ?
ఎ:
సబ్బినాడు ( సబ్బిసాయిర మండలము )
8)తురుష్క
, యవన ,కాంభోజ , కాశ్మీర , నేపాళ , మాళవ , మగధ , కళింగాధి
దేశములను వినయాదిత్య యుద్ధమల్లుడు
జయించినట్లు ఏ శాసనం లో ఉన్నది ?
ఎ)
కొల్లిపర తామ్ర శాసనము
9)జిన విల్లభుడు వేయించిన బొమ్మల గుట్ట శాసనమున్న ప్రదేశమునుండి గంగాధర
నాలుగు కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఎవరు గంగాధర రాజధానిగా వేములవాడ చాళుక్య
రాజ్యమును క్రీ. శ. 955 నుండి క్రీ. శ . 960 వరకు పాలించారు ?
ఎ) వగరాజు ( లేక ) వాగ రాజు
10) జిన విల్లభుడు వేయించిన బొమ్మల గుట్ట
శాసనములో ఎన్ని తెలుగు పద్యములు ఉన్నాయి ?
ఎ ) మూడు కంద పద్యాలున్నాయి. (ఇవి తెలుగు
లో ఉన్నాయి )
11) జిన విల్లభుడు , ఎవరి సోదరుడు ?
ఎ ) పంప కవి
12) పంప కవి కన్నడ భాషలో రాసిన పుస్తకాలు
ఏవి ?
ఎ) (I )
మహా భారతమును ‘విక్రమార్జున విజయము ‘
అనే పేరు తో జైన మత పరముగా కన్నడ భాషలో రచించి అరికేసరి మహారాజుకి అంకిత మిచ్చాడు
.
(ii ) ఇతని రెండవ కావ్యము
పేరు : ఆది పురాణము. ఇందులో జైన తీర్ధంకరుల చరిత్రలు వర్ణించ బడ్డాయి.
13) గంగాధర పట్టణమున నివసించిన సోమదేవ
సూరి ఏ గ్రంధము రాశాడు ?
ఎ) ‘యశ
స్తిలక’
14)పంప మహాకవి రెండవ అరికేసరి ఆస్థాన
కవి. అతడు వేములవాడ రాజ్యమున ఏ పదవిని నిర్వహించేను ?
ఎ ) దండ నాయక
15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (పాత పేరు :
నేటి పేరు )
ఎ )బూద పురము : భూత్పూర్
బి ) వర్ధమాన పురము : వడ్డెమాను
సి ) పోదన : బోధన్
డి ) పైవన్ని
జవాబు : డి
14) ప్రణీతా నది , ఎక్కడ గోదావరి నదిలో కలుస్తుంది ?
ఎ) కాళేశ్వరం దగ్గర
15) బద్దెగ కి (క్రీ. శ.
850 – క్రీ. శ . 895 ) గల బిరుదులు ఏవి ?
ఎ ) ‘సోలద గండ ‘ , ‘42 యుధ్ధాలాలో ఓడింపబడని
వీరుడు’, ’ఓడింప బడని వీరుడు’
16)
బద్దెగేశ్వరాలయము , లేక నేటి భీమేశ్వరాలయము ను
వేములవాడ లో ఎవరు నిర్మించారు ?
ఎ ) బద్దెగ (క్రీ. శ. 850 – క్రీ. శ . 895 )
17) యమునా నదీ తీరం లో కళా ప్రియ అనే ప్రదేశం లో విజయ
స్థూపాన్ని స్థాపించినది ఎవరు ?
ఎ )
నరసింహ II (క్రీ. శ. 915 – క్రీ. శ . 930 )
18) ‘జకన్వి ‘ అనే ఆమెను ఎవరు వివాహము చేసుకున్నారు ?
ఎ ) నరసింహ
II (క్రీ. శ. 915 – క్రీ. శ . 930 )
19) కన్నడ కవి ‘పంప’
ఎవరి కాలం లో ‘విక్రమార్జున
విజయం ‘ అనే కన్నడ కావ్యం రాశారు ?
ఎ
) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 )
20)
ఎవరి కాలం లో వేముల వాడలో ‘ఆదిత్య గృహము ‘ నిర్మించబడింది ?
ఎ
) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 )
21) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ) ఏ రాజకన్యను వివాహమాడి , ఆమె ద్వారా వగ రాజు అనే కొడుకుని కన్నాడు ?
ఎ)
రేవక ణిర్మడి
22)
) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 )
లోకాంబిక అనే మరో రాజకన్య ను వివాహమాడి , ఆమె ద్వారా
కన్న కొడుకు ఎవరు ?
ఎ )
భద్రా దేవ
23)
వగ రాజు రాజధాని ఏది ?
ఎ )
గంగాధర
24) ‘యశ స్తి లక’ అనే చంపూ గ్రంధం రాసిన సోమ దేవ సూరి ని ప్రోత్సహించింది ఎవరు ?
ఎ )
వగ రాజు
25) ‘పాద పద్మోప జీవి’ అని సోమదేవ సూరి ఎవర్ని
వర్ణించాడు ?
ఎ )
వగ రాజు
26) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ), కొడుకు భద్రదేవ
రాజధాని ఏది ?
ఎ )
వేములవాడ
27)భద్ర
దేవ తర్వాత రాజైన అరికేసరి IV (క్రీ. శ. 946 – క్రీ. శ . 968 ) కాలం లో
వచ్చిన మార్పు ఏది ?
ఎ )
వేముల వాడ చాళుక్యుల ప్రభావం అంతం ప్రారంభ మైనది .
28)
తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర కూటుల ప్రభావం పోయి , కల్యాణి చాళుక్యుల ప్రభావం వచ్చి నట్లు , మనకి ఎలా తెలుస్తోంది ?
ఎ )
మెదక్ జిల్లాలో కోర ప్రోలు వద్ద లభ్యమైన
తైల రాజు (క్రీ. శ . 973 ) శాసనం ద్వారా
29) వేములవాడ
చాళుక్యులు తొలుత ఏ మతావలంబికులు ?
ఎ )
జైన మతము
30) కొల్లిపర
శాసనాలలో ఎవరు తనను వ్యాకరణం లో దిట్ట గాను , గణ తంత్ర విద్యలో ను , తర్క శాస్త్రం , విలు విద్య లో ప్రావీణ్యుడు అని అభివర్ణించు కున్నాడు ?
ఎ )
అరికేసరి I (క్రీ. శ. 775 – క్రీ. శ . 800 )
Comments
Post a Comment