Telangana History, Art and Culture

 

TELANGANA HISTORY ,CULTURE AND  ART

Prepared by: Praturi Potayya Sarma

   PLEASE SEE FROM PAGE NO. 10 TO 72

Sl.No.

Topic

Page No.

From

 

1

 

 

 

2

తొలి శాతవాహనులు : (క్రీ. పూ.  271 – క్రీ. శ . 28 తర్వాత కూడా  )

 

3

 

3

శాతవాహనుల పరిపాలన విధానం (క్రీ. పూ .271 – క్రీ. శ. 178)

 

7

 

4

MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3

 

11

 

5

Model question on Telangana History -4

29

72

6

Ikshwakulu

73

 

7

Questions on Ikshwakulu

75

 

8

Vishnukundinulu

78

 

9

Questions on Vishnukundinulu

80

 

10

Vemulawada Chalukyulu

82

 

11

Questions on Vemulawada Chalukyulu

85

 

12

Mudigonda Chalukyulu

89

 

13

Questions on Mudigonda Chalukyulu

92

 

14

Kalyani Chalukyulu

96

 

15

శాతవాహనుల అనంతర కాలం (క్రీ. శ.3 వ శతాబ్దం – క్రీ. శ. 12 వ శతాబ్దం ) -  పరిపాలన

 

100

 

16

Telangana History Questions and one word answers

104

 

17

Telangana History Part -1  Questions

109

 

18

Notes on Kakateeyulu  - Samantha Kakateeyulu

112

 

19

Notes on Kakateeyulu – Swatamtrya Kakateeyulu

114

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

Notes prepared by : Praturi Potayya Sarma

 

 

తొలి శాతవాహనులు : (క్రీ. పూ.  271 – క్రీ. శ . 28 తర్వాత కూడా  )

 

సిముఖుడు (క్రీ. పూ. 271 )

1)ఇతను ధనకాడ (ఆధునిక ధరణికోట , అమరావతి ) నిర్మించాడు

2) రాజధాని : ధనకాడ

3) రాజధానిని పైఠాన్ లేదా ప్రతిష్ఠానపురం కు (ఔరంగాబాద్ జిల్లా ) కు మార్చబడింది

4)ఇతని వారసులను ధనకడస్వామి (ధన కటక స్వామి (ధన కాటక సాములు) అని పిల్వబడ్డారు

5)నానాఘాట్ శాసనం లో ఇతని చిత్రం కనిపిస్తుంది

6) ఇతని నాణాలు కోటి లింగాల (పాత కరీంనగర్ జిల్లా ) ప్రాంతం లో కనుగొన్నారు

7)నాణాల పై చిముఖ అని ఉంది . ఇదే శ్రీ ముఖ , సిముఖ అయి ఉండవ చ్చును

8) ఇతను 23 సంవత్సరాలు  పరిపాలన చేశాడు

 


కృష్ణ (శాసనాలలో కన్హుడు గా పేర్కొన్నారు )

(క్రీ. పూ . 248 నుండి  దాదాపు 18 సంవత్సరాల పరిపాలన సాగించాడు

1 )ఇతను తొలి సారిగా శాసనాలు ముద్రించాడు

2)నాసిక్ గుహ శాసనం బౌధ్ధ బిక్షుల కోసం అంకితం చేశాడు

3) నాసిక్ ప్రాంతానికి మహామాత్ర ను అధికారిగా నియమించాడు

 


మొదటి శాతకర్ణి (క్రీ. పూ 220 రాజయ్యాడు )

 


పూర్ణోత్సo గా

 


స్కందస్తంబి  (దాదాపు 46 ఏళ్ళు పాలించాడు )

 

రెండవ శాతకర్ణి ( క్రీ. పూ . 184 – క్రీ. శ.28 )

1)56 ఏళ్ళు పాలించాడు

2) ఇతను మగధ రాజు పుష్య మిత్ర శుంగునికి , కళింగ రాజు ఖారవేలునికి , గ్రీకు రాజు – బాక్ట్రియన్ రాజు , డెమిట్రియస్  కు సమకాలికుడు

3) మరాఠా త్రణ కైయిరో  కుమార్తె దేవి నాగనిక ను  వివాహం చేసుకున్నాడు

4) ఖారవేలుని హాతి గుంఫా శాసనం లో తొలి శాతవాహనుల నుండి తూర్పు తీరాలను ఆక్రమించి , తన రాజ్యం లో విలీనం చేసుకున్నట్లు పేర్కొన్నాడు

5) క్రీ. పూ . 175 లో డెమిట్రియస్ భారత దేశం సరిహద్దు లో అడుగు పెట్టాడు

6)క్రీ. పూ. 172 లో ఖారవేలుడు , క్రీ. పూ . 148 లో పుష్య మిత్రుడు మరణించారు.

7) ఇతని విజయాలను నానాఘాట్ శాసనం లో పేర్కొన్నారు . ఇతని భార్య దేవి నాగనిక ఈ శాసనం చెక్కించింది .

8) సామ్రాట్ , దక్షిణాధిపతి అనే బిరుదులు పొందాడు

9) నానాఘాట్ గుహలో ఇతని పూర్వీకుల చిత్రాలు చెక్కించాడు

 


పులోమావి

(కాణ్వా రాజైన సుశర్మ ను సంహరించి కాణ్వా వంశాన్ని అంతమొందించి మగధ ను ఆకారమించాడు )

1)ఇతని కాలం లో శతవాహనుల స్వతంత్ర పాలన ప్రారంభమైనది

 


హాలుడు

1)ఇతను గాధా సప్తశతి ని రచించాడు

2)ఇతన్ని కవి వత్సలుడు అని కవులు పొగిడారు

3)ప్రాకృత సాహిత్యం లో హాలుడి కి ప్రత్యేక స్థానం ఉంది

 

 


గౌతమి పుత్ర శాతకర్ణి ( 23 వ రాజు )

1)ఇతని విజయాలను నాసిక్ , కార్లే  శాసనాలలోని సమాచారం తెలియచేస్తుంది

2)భూమకుడు , సహ పాణుడు  ఇతని సమకాలికులు

3)కద్రమాక రాజులైన  చస్టానుడు , రుద్ర దమనుడు లకు శాతవాహనులతో సత్సంబంధాలున్నాయి

4) రుద్ర దమనుని వారసులు రెండో చంద్రగుప్త  విక్రమాదిత్యుని కాలం వరకు పాలించారు

5 )ఇతను సింహాసనం అధి ఇష్ఠిo  చి  18 వ ఏట వేయించిన నాసిక్ శాసనం అతని సైనిక విజయాలను  వర్ణిస్తుంది     

6)సహపానుడు ని,   గౌతమి పుత్ర శాతకర్ణి ఓడించాడు

7)గౌతమి బాలశ్రీ   నాసిక్  ప్రశస్తి లో గౌతమి పుత్ర శాతకర్ణి ని  క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు వర్ణిస్తుంది 

8 ) గౌతమి బాల శ్రీ నాసిక్ ప్రకారం  గౌతమి పుత్ర శాతకర్ణి     అసిక , అశోక , మూలక , సూరత, కకూర, అపరాంత , విదర్భ ప్రాంతాలకు   అధిపతి

9) ఇతనికి ఏక బ్రాహ్మణ , ఆగమ నిలయ , క్షత్రియ దర్ప మాన , త్రిసముద్ర తోయ పీత వాహన ,  శాతవాహన – కుల – యశ – పత్రి ష్ఠా  పనాకార బిరుదులు ఇవ్వబడ్డాయి

 

 


వశిష్ఠీ పుత్ర పులోమావి   సింహాసం అధిష్ఠిoచాడు

 


కడపటి శాతవాహనులు : -

రెండో వాసిష్ఠ పుత్ర పులోమావి

1 )రెండో వాసిష్ఠ పుత్ర పులోమావి కాలం నుండి శాతవాహన శాసనాలలో , నాణాలు ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో లభించాయి .

 2)ఇతనికి దక్షిణా పధీశ్వర అని నాసిక్ ప్రశస్తి వర్ణించింది .

3) ఉజ్జయిని పాలకుడైన చష్టనుని తో పోరాడాడు. ఇతని సేనలు ఓడిపోయాయి .

 

 


శివశ్రీ

 


శివస్కంధ

 


శ్రీ యజ్ఞ శ్రీ శాతకర్ణి

1 ) సౌరాష్ట్ర  పై దండెత్తి  కొంకణ్ – సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించాడు

2) హర్ష చరిత్ర రచయిత బాణుని ప్రకారం శ్రీ యజ్ఞ శ్రీ శాతకర్ణి బౌద్ధ మాట సమర్ధకుడు

3) ఆచార్య నాగార్జునుని ఇతడే తన ఆస్థానం లో ఆదరించాడు

4) ఆచార్య నాగార్జునుని గౌరవార్ధం శ్రీ పర్వతం వద్ద ఒక మహా చైతన్యాన్ని కట్టించాడు , చైనీస్ , టిబెటియన్ కధనాల ప్రకారం.

 


చంద్ర శ్రీ శాతవాహన    ఏలినాడు

ఇతని అనంతరం వచ్చిన శాతవాహన  రాజుల అసమర్ధత వల్ల :-

i) ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతం లో ;  

ii)చాటులు పశ్చిమ – దక్షిణ ప్రాంతం లో ;

iii)అభీరులు ఉత్తరం లో ;

iv)పశ్చిమ క్షా త్రపులు  పశ్చిమొత్తర ప్రాంతం లో నూ స్వాతంత్రం ప్రకటించుకున్నారు  

 

 

 

 

 

 

 

 

 

 

Model questions (Satavahana period Administration )

G.S. PAPER STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP  1 & 4  /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

 శాతవాహనుల పరిపాలన విధానం (క్రీ. పూ .271 – క్రీ. శ. 178)

1)శాతవాహనులు పరిపాలన లో మౌర్యులకు వారసులు .వీరు ఎవరికి మార్గదర్శకులు ?

జవాబు : పల్లవులు

2)శాతవాహనుల కాలo లో రాజు గురించి ఏ భావన ఏర్పడింది ?

జవాబు : దైవాంశ సంభూతుడు

3)శాతవాహనులు సామ్రాజ్యాలను ఏ విధంగా విభజించారు ?

జవాబు : ఆహారాలు (రాష్ట్రాలు ) గా

4)గ్రామాధికారులను ఏమని పిలిచేవారు ?

జవాబు : గ్రామణి

5)పట్టణాలను ఏమని పిలిచేవారు ?

జవాబు : నిగమ

6)శాతవాహనుల కాలం లో ముఖ్యపట్టణాలు ఏవి ?

జవాబు : బారుకచ్చ (బ్రోచ్ ) , సోపార, కల్యాణి (కర్నాటక ), కన్హేరి , పైధాన్ (మహారాష్ట్ర ), గోవర్ధన్ ,

ధాన్యకటకం (ఆంధ్ర ప్రదేశ్ ) , కోటిలింగాల , ఏలేశ్వరం (తెలంగాణ )

 7) నాసిక్ శాసనం లో ఏ యంత్రాల గురించి పేర్కొన్నారు ?

జవాబు : ఉదక యంత్రాలు

8) భూమి శిస్తు ఎంత ?

జవాబు : 1/6 వంతు

9) ఓద యoత్రికులు ఎవరు ?

జవాబు : ఉదక యంత్రాన్ని ఉపయోగించేవారు

10)నాసిక్ , జున్నార్ శాసనాలలో తెలిపిన వారు ఎవరెవరు ఉన్నారు ?

ఎ)తిలపిసక  లేదా నూనె తయారు చేసే వారు ; నూనె గానుగల పని వారు

బి ) దమ్నికులు :ధాన్యం వర్తకులు

సి )కొలికలు : నేత పని వారు

డి) వస కరులు : వెదురు బుట్టలు తయారు చేసేవారు

జవాబు : పై అన్నీ

11) గిల్డులు (శ్రేణులు )ఏవి నిర్వహించేవారు ?

జవాబు : బ్యాంక్ ల్లాగా కార్యకలాపాలు , లావా దేవీలు

12) టాలమి రాసిన గ్రంధం ఏది ?

జవాబు : ఎ గైడ్ తో జియోగ్రఫీ

13) అమరావతి శాసనం లో ఏవి ఉన్నాయి ?

జవాబు : కెవురూరా , విజయపుర , గూడూరు , ధాన్యకటం

14) తెలంగాణా రాష్ట్రం లో ఏవి గొప్ప వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి ?

జవాబు : ధూళికట్ట , పెద్ద బంకూరు , కొండపూర్ , కోటి లింగాల

15)శాతవాహనుల కాలం లో ఏది ముఖ్య రవాణా సాధనం ?

జవాబు : ఎడ్ల బండ్లు

16)విదేశీ వ్యాపార కేంద్రాలు ఏవి ?

జవాబు : పైధాన్ , తగర , జున్నార్ , నాసిక్ లు ,

వైజయంతి  (కర్నాటక ), బారుగజ (గుజరాత్ ) లేదా బ్రోచ్ పట్టణాలు  పశ్చిమాన నౌక పట్టణాలుగా ఉన్నాయి

17)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ) బారుగజ (నేటి  సూరత్ )

బి ) సోపార (కర్నాటక లోని కల్యాణి )

జవాబు : పై రెండు

18)తూర్పు  తీరాన గల అంతర్గత నౌకా కేంద్రాలు ఏవి ?

ఎ) కంఠ శాల

బి ) కొండాయిరా (గూడూరు )

సి )అల్లోసిస్ మసోలియా (మచిలీపట్నం )

డి ) పైవన్ని

జవాబు : డి

19) నాణాలను వేటితో తయారు చేసేవారు ?

జవాబు : సీసం , తగరం , రాగి , వెండి

20) ఏది ఎక్కువగా ఉపయోగించిన నాణెం ?

జవాబు : కార్షపణ

21) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ )గధికులు (సుగంధ ద్రవ్యం తయారు చేసేవారు )

బి)వధకులు (వడ్రంగులు )

సి ) కమ్మరులు (ఇనుప పరికరాలు చేసే వారు )

డి ) పైవన్ని

జవాబు : డి

21) శాతవాహనుల సమాజం ముఖ్యం గా ఎలాంటిది ?

జవాబు : పితృస్వామ్యమైనది

23) శాతవాహన రాజులు తమ పేర్ల కు ముందు ఎవరి పేరు పెట్టుకుని  ప్రసిద్ధి చెందారు ?

జవాబు : తల్లి పేరుతో   [ ఉదాహరణ : గౌతమి పుత్ర శాతకర్ణి  (తల్లి : గౌతమి బాల శ్రీ )] ;

    వశి ష్ఠ పుత్ర శాతకర్ణి ; యజ్ఞ శ్రీ శాతకర్ణి

24) హాలుడు ఎవర్ని వివాహం చేసుకున్నాడు ?

జవాబు : లీలావతి (శ్రీ లంక రాణి )

25) ఆచార్య నాగార్జునుని నేతృత్వం లో ఏ బౌద్ధ మత శాఖ విశేష ఖ్యాతి పొందిది ?

జవాబు : మహాయాన

26) సాహిత్య సేవలో ఏ భాష ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది ?

జవాబు : ప్రాకృత భాష

27) అశోకుని ధాన్య కటక , రాజుల మoదరికి , ఎర్రగుడి , భట్టి ప్రోలు శాసనాలు ఏ భాష లో ఉన్నాయి ?

జవాబు : ప్రాకృత భాష

28)బౌద్ధులు ప్రాకృత భాష ను అనుసరించారు.    జైనులు ఏ భాష వాడారు ? 

జవాబు : అర్ధ మాగధి , అనే ఒక రకమైన ప్రాకృత భాష

29) ధెర వాదు డైన బుద్ధ ఘోషుడు (క్రీ. శ. 4 వ శతాబ్దం ) దేనిపై వ్యాఖ్యానం రాశాడు ?

జవాబు : త్రిపీఠికల పైన

ఇతని ప్రముఖ రచన విసుధ్ది మగ్గ   ప్రాకృత భాషలో విరచిత మైనది

30) హాలుడు ఏది రాశాడు ?

జవాబు :  గాధా సప్త శతి (700 శృంగార కధల సకలనం )

31) గుణాఢ్యుడు బృహత్ కధ ను దేనిలో రాశాడు ?

జవాబు : పై శాచి ప్రాకృతం  భాష లో

32)సోమ దేవుని గ్రంధం ఏది ?

జవాబు : కధా సరిత సారగం (సం స్కృతo)

 దీనికి ఆధారం గుణాఢ్యుని బృహత్ కధ .

33) శర్వ వర్మ రాసిన పుస్తకం ఏది ?

జవాబు : కాతంత్ర  వ్యాకరణం రాశాడు

34) కడపటి శాతవాహన రాజుల వెండి నాణాలు దేన్ని నిరూపిస్తున్నాయి ?

జవాబు : దేశి అనే ఒక ప్రత్యేక భాష

35) నల్గొండ లోని ఫణి గిరి ఎవరి కాలం లో నిర్మించ బడ్డ అత్యంత మనోహర స్ఠూపం ?

జవాబు : శాతవాహనుల కాలం 

36) తెలంగాణ లోని బౌద్ధ స్థూపాలన్నీ దేనికి నమూనాలు ?

జవాబు : సాంచి స్థూపానికి

37) శాతవాహన రాజుల చిత్రా కళను ఎక్కడ చూడ వచ్చును ?

జవాబు : అజంతా లోని నెంబర్ 9 , 10 గుహల్లో

38) తెలంగాణ లోని స్థూపాలలో ముఖ్య లక్షణం ఏది ?

జవాబు : ఇటుకలతో నిర్మించ బడిన స్థూపాలు

   

  

 

 

 

 

 

 

 

 

MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3

 

Prepared by: Praturi Potayya Sarma

 

1)  ఎప్పుడు    గులాం యాజ్దాని గారిని  డైరెక్టర్‌గా నిజాం ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది?

 

ఏ)1914 లో

2) 1979-83 మధ్యకాలంలో ఎక్కడ జరిపిన త్రవ్వకాల్లో పూర్వ శాతవాహన, శాతవాహనుల కాలాలకు సంబంధించిన అనేక చారిత్రక, సాంస్కృతిక అవశేషాలు బయల్పడ్డాయి?

 

ఏ)కోటిలింగాలలో (      combined కరీంనగర్ జిల్లా )

 

3) ఎక్కడ బయటపడిన మహాస్తూప వివరాలను అంచనా వేసి అది ఒక పారిభోగిక స్తూపంగా నిర్ణయించారు?

 

ఎ)ఫణిగిరి(నల్గొండ జిల్లా )

(నోట్ : పారిభోగిక స్తూపం అంటే బౌద్ధ సన్యాసుల వ్యక్తిగత వస్తువులు ఉన్నటువంటి, స్తూపంగా చెప్తారు. బౌద్ధ సన్యాసులు, భిక్షువులు ఈ ప్రాంతంలో అధికంగా ఉండేవారు. తెలంగాణాలో లభించిన మొదటి పారిభోగిక స్తూపం గా దీన్ని భావిస్తున్నారు)

 

4) 1890- 1910 ప్రాంతంలో వనపర్తి రాజా ఆస్థానంలో ఉన్న ఎవరు మహబూబ్‌నగర్‌ శాసనాలను సేకరించినారు?

 

ఎ) మానవల్లి రామకృష్ణ కవి

 

 

5) మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేసిన,  తెలంగాణాలో శాసనాల పట్ల అవ గాహనతో, ఆసక్తితో శాసనాలను చదివిన మొదటి వ్యక్తి  ఎవరు ?

 

ఎ ) జె.ఎ.ఫ్లీట్‌

 

6) 1916-1918 ప్రాంతంలో ఎవరు  నల్లగొండ, వరంగల్‌ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అనేక శాసనాలను సేకరించారు. వీరి కృషి తెలంగాణ చరిత్రకు ఆయువుపట్టు అంటారు .

 

ఎ ) శేషాద్రి రమణకవులు

 

 

7) తెలంగాణాలో __________ పరిశోధక సంస్థ ద్వారా కొమర్రాజు ‘తెలంగాణ శాసనాలు’ రెండు సంపుటాలుగా 1930, 19 32లలో వెలువరించారు

ఎ) కొమర్రాజు లక్ష్మణరాయ

 

 

8) స్టేట్‌ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో ”కార్పస్‌ ఇన్స్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ తెలంగాణ” 4 సంపుటాలు వెలువడ్డాయి. మొదటి మూడు సంపుటాలకు ______________ఎడిటర్‌గా వ్యవహరించగా, 4వ సంపుటం మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో వచ్చింది.

 

ఎ ) పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు

 

 

9) ఉపాసికాయ బుద్ధ రక్షిషాయ దానం (_____________) రాసిన  శాసనం  ఏది  / ఎక్కడ  ఉంది?

 

ఎ )వర్ధమానుకోట

 

10) మొదటి సంస్కృత శాసనం విష్ణుకుండిన గోవిందవర్మ శాసనం ఏది ?

 

ఏ) ఇంద్రపాలనగర

 

11) మొదటి ______ శాసనం వర్ధమానుకోటలో లభించిన ఉపాసికాయ బుద్ధరక్షితాయ దాన శాసనం.

 

ఎ) ప్రాకృత

 

12) మొదటి పద్య శాసనం జినవల్లభుడి ________ శాసనం

ఎ) కుర్క్యాల

 

13) దేన్ని మొదటి  గద్య శాసనంగా పేర్కొంటున్నారు?

ఎ) మొదటి గద్య శాసనం కొరవి శాసనం

 

 

14) తెలంగాణ రాష్ట్రం  లో  మొదట శాసనాల్లో   భాష ఉంది ?

 

 

ఎ) ప్రాకృత  

నోట్: అటు తర్వాత క్రమంగా శాసనాల్లో సంస్కృతం ప్రవేశించింది. ఎక్కువ ప్రాకృతం, తక్కువ సంస్కృతం నుండి తక్కువ ప్రాకృతం ఎక్కువ సంస్కృతం ఉన్న శాసనాలు వచ్చినవి. కాలక్రమంలో ప్రాకృతం పూర్తిగా అదృశ్యమైంది. సంస్కృతం- కన్నడ, కన్నడ – సంస్కృతం, కన్నడ – తెలుగు, తెలుగు – కన్నడ, సంస్కృతం – తెలుగు, తెలుగు – సంస్కృతం.. ఈవిధంగా శాసనాల్లో ఆయా రాజుల అధికార భాషానుగుణంగా భాష స్థిరపడింది. కొన్ని మరాఠీ శాసనాలు, పర్షియన్‌, ఉర్దూశాసనాలు కూడా ఈ ప్రాంతంలో లభించినాయి.

 

15) క్రీ.పూ. 6వ శతాబ్దిలో భారతదేశంలో ఏర్పడ్డ 16 జనపదాలతో దక్షిణ భారతదేశం మొత్తంలో ఉన్న ఒకే ఒక జనపదం (Republic) ఏది ?    దీని ద్వారా   మన తెలంగాణ లోని కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలంటేనే తెలంగాణ ప్రాశస్త్యం తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాల వారు, అధికారులు తదితరులు వివిధ సందర్భాలలో అనేక శాసనాలు జారీచేశారు. ఈ చారిత్రక శాసనాలు మన చరిత్ర రచనకు శ్వాసనాళాలు. ఈ శాసనాలలో ఎక్కువగా దాన శాసనాలే కన్పిస్తాయి.

 

ఎ) అస్సకా

 

 

16) క్రీ.పూ. 4వ శతాబ్ది నాటి కోటిలింగాల నాణెములపై పేర్లు కన్పిస్తాయి ? (ఇవి శాతవాహనుల పూర్వకాలానికి చెందినవి)

 

 

ఎ ) గోబధ, కంవాయస, నరన

 

17) వేటిని శాసన పరిశోధకులు ”తొలిశిలాశాసన యుగం” అంటారు ?

 

ఎ) క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి, నేటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల, దనాళికట్ట, మునులగుట్టలో కన్పించిన లఘుశాసనాలు మన ప్రాంతంలోని తొలి శాసనాలని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా బౌద్ధుల చైత్య, స్థూప విహారాలలో లభించినవే. వస్తుపరంగా యివి రాతిపై (శిలలపై) చెక్కినవి.

 

18) దేన్ని రాగిరేకుల యుగమని లేక లోహరేకుల యుగమని అంటారు అంటారు తెలంగాణ చరిత్రలో  ?

 ఎ) క్రీ.శ. 2,3 శతాబ్దాల నుండి రాళ్ళకి (శిలకి) బదులుగా శాసనాలకి రాగి రేకులను (లోహపు రేకులు) వినియోగించారు. దీన్ని రాగిరేకుల యుగమని లేక లోహరేకుల యుగమని అంటారు. వీటిని ఎక్కువగా బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసే సందర్భంలో యిచ్చేవారు. మల్లoపల్లి వారి అభిప్రాయంలో ‘రాగిరేకుల శాసనం లభించిందంటే అది బ్రాహ్మణులకిచ్చిన భూ దానమని చెప్పవచ్చు. ‘వైదిక, బ్రాహ్మణ మతంలోనే ఈ రాగి రేకుల జారీ అధికంగా కన్పిస్తుంది

 

 

19) దేన్ని ”రెండవ శిలాశాసన యుగం” అంటారు ?

 

ఎ ) క్రీ.శ. 7,8 శతాబ్దాల నుండి రాగి రేకులతోపాటు తిరిగి శిలాశాసనాలు జారీ కావడం పునః ప్రారంభమైనది. ఇది కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలానికి ఉచ్ఛ స్థాయికి చేరింది. దీన్ని ”రెండవ శిలాశాసన యుగం” అంటారు. లోహయుగంలో శిలా శాసనాలు లేవనికాదు. కానీ, తక్కువగా ఉన్నాయి.

 

 

20)  ఎవరి శాసనాలలో పార్శీ, తెలుగు ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి?

 

ఎ) రేచర్ల పద్మనాయకులు, విజయనగర, కుతుబ్‌షా, అసఫ్‌ జాలు ప్రముఖులు – కుతుబ్‌షాల శాసనాలలో పార్శీ, తెలుగు ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి

 

21) దేని  ద్వారానే చరిత్రకారులకి తొలిసారిగా ”కాకతీయ వంశం” గురించి తెలిసింది ?

 

ఎ ) తెలంగాణలో శాసన పరిశోధన, శాస్త్రీయ పరిష్కరణ క్రీ.శ. 1882 నుండి జె.ఎ.ఫ్లీట్‌ హనుమకొండ వేయి స్థంభాల గుడి శాసనం చదివిన నాటి నుండి ఆరంభమైనదని చెప్పవచ్చు. ఫ్లీట్‌ అప్పట్లో భారత ప్రభుత్వ (ఆంగ్లేయుల అధికారంలోని) ప్రధాన శాసన పరిశోధకునికి సహాయకారిగా ఉండేవాడు. హైదరాబాద్‌ నిజాం నుండి ప్రత్యేక అనుమతి పొంది జె.ఎ.ఫ్లీట్‌  రుద్రదేవుని హనుమకొండ శాసనం చదివాడు. దీని ద్వారానే చరిత్రకారులకి తొలిసారిగా ”కాకతీయ వంశం” గురించి తెలిసింది

 

22) ఆస్థాన పండితుడైన మానవల్లి రామకృష్ణ కవి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బూధ్‌పూర్‌, వర్థమానపురం శాసనాలను ప్రకటించారు?

 

ఎ) వనపర్తి సంస్థానంలో ఆస్థాన పండితుడైన మానవల్లి రామకృష్ణ కవి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బూధ్‌పూర్‌, వర్థమానపురం శాసనాలను ప్రకటించారు

 

23) దేన్ని  ‘ఆర్షశాఖ’గా వ్యవహరించారు ?

 

ఎ ) 1914లో నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌లో పురావస్తుశాఖను ఏర్పరచింది. దీన్ని ‘ఆర్షశాఖ’గా వ్యవహరించారు. దీనికి గులాంయాజ్దాని సంచాలకులుగా నియుక్తులయ్యారు

 

24)   ఎవరి సంచాలకత్వంలోనే తర్వాత కాలంలో పుట్టపర్తి శ్రీనివాసచారి, సంపాదకత్వంలో ‘కార్పస్‌ ఆఫ్‌ యిన్స్‌ క్రిప్షన్స్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేర శాసన సంపుటాలు వెలువడ్డాయి ?

 

ఎ )  గులాంయాజ్దాని  సంచాలకత్వంలోనే (Director) తర్వాత కాలంలో పుట్టపర్తి శ్రీనివాసచారి, సంపాదకత్వంలో ‘కార్పస్‌ ఆఫ్‌ యిన్స్‌ క్రిప్షన్స్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేర శాసన సంపుటాలు వెలువడ్డాయి

 

25) ఎప్పుడు వరంగల్‌లో కాకతీయ జయంత్యుత్సవాలు జరిగాయి ?  ఫలితంగా 1935లో ‘కాకతీయ సంచిక’ వెలువడ్డది

 

ఎ ) 1932లో వరంగల్‌లో కాకతీయ జయంత్యుత్సవాలు జరిగాయి. ఫలితంగా 1935లో ‘కాకతీయ సంచిక’ వెలువడ్డది. దీనిలో కాకతీయులనాటివి శాసనాలు అనేకం ప్రచురించబడ్డాయి. మారేమండ రామారావు దీనికి సంపాదకులు. భావరాజు వెంటక కృష్ణారావు, రాళ్ళబండి సుబ్బారావు, శేషాద్రి రమణ కవులు, ఆచార్య సిరుగూరు హనుమంతరావు వంటి చరిత్ర, శాసన పరిశోధకులు దీనిలో పాలుపంచుకున్నారు

 

 

26) శాతవాహనుల తొలి శాసనాలు కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట లభించిన  ప్రాంతాలు  , ఏ జిల్లాలో ఉన్నాయి ?

 

ఎ ) శాతవాహనుల తొలి శాసనాలు కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట వద్ద లభిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాలు నేటి జగిత్యాల జిల్లాలలోనివే.

 

27) ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర భట్టారిక ఎవరి  భార్య ?

 

ఎ ) ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర భట్టారిక ఇక్ష్వాకు వీరపురుష దత్తుని భార్య.

 

28) ఇక్ష్వాకుల కాలంనాటి   శాసనాలకు  చారిత్రక ప్రాధాన్యత ఉన్నది ?

 

ఎ )ఇక్ష్వాకుల కాలంనాటి నాగార్జునకొండ, ఏలేశ్వరం, ఫణిగిరి (Nalgonda) శాసనాలు చారిత్రక ప్రాధాన్యత ఉన్నవి

 

29)  శాసన శకలముపై ‘శక’ వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉన్నది.  ?

ఎ)  నాగార్జున కొండ త్రవ్వకాలలో లభించిన శతాధిక శాసన శకలాలలో నాలుగు శాసనాలు అత్యంత ప్రాముఖ్యమైనవన్న విషయం అందరూ అంగీకరించాల్సిన విషయమే. ఒక శాసన శకలముపై ‘శక’ వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉన్నది. ఉజ్జయిని కేంద్రంగా ఇక్ష్వాకుల సమకాలీనులుగా పరిపాలన చేసిన వారు ఈ శకులు

 

 

30 ) శాసనాల ద్వారా తెలంగాణా ప్రాంతానికి యితర ప్రాంతాలలో (సుదూర శ్రీలంకతో సహా) గల సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి ?

ఎ )నాగార్జున కొండ శాసనాల ద్వారా తెలంగాణా ప్రాంతానికి యితర ప్రాంతాలలో (సుదూర శ్రీలంకతో సహా) గల సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి

 

 

31)  యిటీవల ఎక్కడ  బయల్పడిన రుళ పురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం అత్యంత ప్రాముఖ్యమైనది. ?

 

ఎ )ఫణిగిరి (Nalgonda)లో యిటీవల బయల్పడిన రుళ పురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం అత్యంత ప్రాముఖ్యమైనది. యిప్పటి వరకు రుళ పురుష దత్తుడు 12 సంవత్సరాలే రాజ్యం చేశాడని భావించారు. కానీ, ఈ శాసనం వల్ల ఇక్ష్వాకుల పాలనా కాలం మరొక ఆరు, ఏడు సంవత్సరాలు ముందుకు జరుగుతుంది.

 

 

32 ) శాసనంలో బుద్ధున్ని ‘కంసనిసూదన’ వంటి బిరుదులతో పేర్కొన్నారు ?

ఎ )  ఫణిగిరి (Nalgonda) శాసనంలో బుద్ధున్ని ‘కంసనిసూదన’ వంటి బిరుదులతో పేర్కొన్నారు. అంటే బుద్దుడు హైందవ దేవగణంలో కలిసే దశ (కలిపేసే దశ) ఆరంభమైనదని చెప్పవచ్చు. అట్లే శాసనాలు ప్రాకృత భాష నుండి సంస్కృత భాషలోకి మార్పు చెందడం ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.

 

 

33) ఇక్ష్వాకుల తర్వాత ఫణిగిరి(Nalgonda) లో  కన్పిస్తున్నవి ఎవరి  శాసనాలు ? వీరి శాసనాలలో చరిత్ర గతిని మార్చినవి గోవింద వర్మ, విక్రమేంద్ర భట్టార వర్మల తుమ్మల గూడెం తామ్ర శాసనాలు

 

 

ఎ ) ఇక్ష్వాకుల తర్వాత యిక్కడ కన్పిస్తున్నవి విష్ణుకుండినుల శాసనాలు. వీరి శాసనాలలో చరిత్ర గతిని మార్చినవి గోవింద వర్మ, విక్రమేంద్ర భట్టార వర్మల తుమ్మల గూడెం తామ్ర శాసనాలు

34 ) రంగనాథ రామాయణము తెలుగు సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన. దీని రచయిత ఎవరు ?

 

జవాబు : దీని రచయిత గోన బుద్ధారెడ్డి. ఈయన కాలం క్రీ.శ. 1250-1320. మహబూబ్‌నగర్‌ జిల్లా వర్ధమానపురం ఏలిన ప్రభువు.  తెలంగాణలో పుట్టిన రంగనాథ రామాయణము తెలుగు సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన.

35 ) అగ్గలయ్య ఎవరు ?

 

ఎ ) అగ్గలయ్య అనే శస్త్రచికిత్సకుడు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని చాళుక్య జయసింహుని క్రీ.శ. 1034 నాటి కొలనుపాక దగ్గరి శాసనంలో ప్రశంసింపబడినాడు.

మధ్యయుగంలో నొక శల్యచికిత్సకుడు తెలంగాణలో నున్నట్లు క్రీస్తుశకం 1034 నాటి శాసనం ద్వారా తెలిసిరావటం గర్వించదగిన విషయం.

అగ్గలయ్య జైనుడు. మంత్రితో సమానమైన హోదాతో చాళుక్య రెండవ జయసింహుని కాలంలో (1015-1042) నున్న వాడు. ఇతనికి వైద్యరత్నాకర ప్రాణాచార్య నరవైద్య అనే బిరుదులున్నట్లు పేర్కొనబడింది. రెండు జైనబసదులను నిర్మించినాడు. ఉమాతంత్రం సంగ్రహపరిచ్ఛేదం మొదలైనవాటిలో నిష్ణాతుడు. ఆలేరు దగ్గరి ముప్ప(చ్చ)నపల్లిని రెండు జైనబసదుల నిర్వహణకొరకు దానమిచ్చినాడు. అందులో నొక బసదికి అగ్గలయ్య బిరుదుతో వైద్యరత్నాకర జినాలయం అని పేరు. నరవైద్యుడైన అగ్గలయ్య ఇతర వైద్యులకు సాధ్యంకాని ఎన్నో రోగాలను కుదిర్చినాడు.

36) రాజమహీపతిరాయ్‌ ఎవరు ?

 

ఎ ) 19వ శతాబ్ది ప్రారంభంలో ప్రస్తుత విదర్భ ప్రాంతంలోనే బీరార్‌ నిజాం రాజులు ఏలుబడిలో ఉండేది. బీరార్‌కు రాజమహీపతిరాయ్‌ అనే ఆయన గవర్నర్‌. నాడు గవర్నర్‌ పదవి నిజాం ప్రభుత్వం యంత్రాంగంలో కీలకమైంది. అప్పట్లో బ్రిటిష్‌వారికి మహారాష్ట్రులకు మధ్య యుద్ధం జరుగుతోంది. బీరార్‌ గవర్నర్‌గా ఉన్న మహీపతిరాయ్‌ బ్రిటిష్‌ సేనలకు మద్దతు నివ్వాలని నిజాం నవాబు ఆదేశించాడు. అయితే మహీపతిరాయ్‌ తమ రాజు ఇచ్చిన ఆదేశాల్ని పాటించలేదు. బ్రిటిష్‌ వారిని వ్యతిరేకిస్తూ ఉద్యమించాడు. నిజాం నవాబుకు ఆగ్రహం కలిగింది. మహీపతిరాయ్‌ని గవర్నర్‌ పదవినుండి తొలగించారు.

 

37) 19వ శతాబ్ది ప్రారంభంలో రాజమహీపతిరాయ్‌ స్ఫూర్తి తో  ముందుకు సాగినవారు ఎవరు  ?

 

ఎ ) నిర్మల్‌ ప్రాంతానికి చెందిన రామాగౌడ్‌, రాంజీగోండు మహబూబ్‌నగర్‌ జిల్లాలో వనపర్తి ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య.. వంటి  ఎందరో వీరులు నాటి పోరాటాలలో భాగస్వాములయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అమితమైన స్ఫూర్తితో ఉద్యమించిన పండుగ శాయన్న వంటి వీరులు మరణశిక్షను అనుభవించవలసి వచ్చింది.

  38 ) తుర్రెబాజ్‌ఖాన్‌ ఎవరు ?

 

ఎ ) 1857 నాటి పోరాట చరిత్రలో తుర్రెబాజ్‌ఖాన్‌ వీరత్వం ఒక ఉజ్వల ఘట్టం. తుర్రెబాజ్‌ఖాన్‌ నాటి సైన్యంలో తిరుగుబాటు చేసి బ్రిటిష్‌ వ్యతిరేక వైఖరిని బాహాటంగా వ్యక్తపరిచిన ధీరుడు. అత్యంత ధైర్యశాలి. హైదరాబాద్‌ నగరం నట్టనడుమ బ్రిటిష్‌ రెసిడెన్సీ (ప్రస్తుతం కోఠీ ప్రాంతం) ఉంది. తుర్రెబాజ్‌ఖాన్‌ తనతోపాటు మౌల్వీ అల్లా ఉద్దీన్‌ను తీసుకొనిపోయి బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడి చేశాడు. 1857వ సంవత్సరం 17వ తేదీనాడు పట్టపగలు ఈ మెరుపుదాడి జరిగింది. ఈ దాడిలో కొన్నివందలమంది పాల్గొన్నారు. దాడిని గురించి రెసిడెంట్‌కు ఎటువంటి ముందస్తు సమాచారం అందలేదు! అంత పకడ్బందీగా వ్యూహరచన జరిగింది.

 

 

39 ) 1857 తిరుగుబాటులో పాల్గొన్న  నిజామాబాద్‌ జిల్లాలోని ఎవరు ప్రముఖులు ?

 

ఎ )1857 తిరుగుబాటులో నిజామాబాద్‌ జిల్లాలోని కౌలాస్‌ జాగీర్దార్‌ రాజాదీప్‌సింగ్‌, నార్ఖేడ్‌ గ్రామ పట్వారీ రంగారావుల పాత్ర గణనీయమైంది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడినందుకు రాజాదీప్‌సింగ్‌ తన జాగీరును కోల్పోయాడు. రంగారావు కఠోరమైన శిక్షలు అనుభవించాడు

 

 

40 ) నిజాం వ్యతిరేక పోరాటంలో ఎవరు పాల్గొన్నారు ?

ఎ )నిజాం వ్యతిరేక పోరాటంలో రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టి.హయగ్రీవాచారి, పి.వి. నరసింహారావు వంటివారు చాందా, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ముఖ్యపాత్ర నిర్వహించారు.

 

41) వట్టికోట ఆళ్వార్‌ స్వామి ఎవరు ?

 

ఎ )ప్రముఖ రచయిత, దేశోద్ధారక గ్రంథమాల వ్యవస్థాపకులు వట్టికోట ఆళ్వార్‌ స్వామి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార వాసాన్ని అనుభవించారు

 

 

42) సిర్పూర్‌ కోటనుండి కొంత కాలం పాటు పాలన కొనసాగించిన బీర్‌షా అనంతరం రాజధానిని ఎక్కడకు  మార్చాడు ?

 

ఎ ) సిర్పూర్‌ కోటనుండి కొంత కాలం పాటు పాలన కొనసాగించిన బీర్‌షా అనంతరం రాజధానిని ”జునుగాం”కు మార్చాడు. ఆ తర్వాత ”బల్లాల్‌షా” చంద్రపూర్‌ నదికి దక్షిణం వైపు కొత్త రాజధానిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ నగరమే ”బల్లార్‌షా” గా పిలవబడుతోంది

 

43) జు న్‌ గాం ఎక్కడుంది ?

 

ఎ ) 900 సంవత్సరాల క్రితం ”జున్‌గాం” అంటే ఆసిఫాబాద్‌లోని ప్రాంతం దట్టమైన అడవులు కొండలతో నిండి ఉండేది.

 

44) దేవ దుర్గం ఏది ?

 

ఎ ) కేరామేరి, ఝరి, జోడేఘాట్‌ కొండల్లో విస్తరించిన అలనాటి గోండు రాజ్యం ”దేవదుర్గం”. ”దేవదుర్గం” క్రింద సుమారు 180 గ్రామాల పాలన సాగేది. 900 సంవత్సరాల క్రితం ”భీంబల్లాల్‌షా” ఇక్కడ పటిష్ఠమైన కోటను ”జున్‌గాం” లోని కంచు కోటకు ధీటుగా 1600 అడుగుల ఎత్తయిన కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ”దేవదుర్గం” ఎత్తయిన కొండపై నిర్మించటం వల్ల శత్రు రాజులకు ఈ దుర్గాన్ని జయించాలంటే చాలా కష్ఠంగా ఉండేది. ఇప్పటికి ఈ కొండను చేరుకోవాలంటే చాలా కష్ఠం. ఆసిఫాబాద్‌ నుండి 32 కిలో మీటర్ల దూరంలోని మొవాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి 12 కిలో మీటర్లు నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది

 

45 ) ”సవతుల గుండం” జలపాతం ఎక్కడుంది ?

ఎ ) ఆసిఫాబాద్‌ నుండి 32 కిలో మీటర్ల దూరంలోని మొవాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి 12 కిలో మీటర్లు నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది. కొండపైనున్న వనదేవతకి ఇప్పటికి దసరా సమయంలో మొవాడ్‌ చుట్టు ప్రక్కల గోండులు 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. కోటకు రక్షణగా ఈ వనదేవతను ప్రతిష్ఠించారని గిరిజనుల నమ్మకం. నిలువైన కొండపైకి ఎక్కటం అంత సులువు కాదు. దట్టమైన అటవీ ప్రాంతం. కొండకి తూర్పువైపున ”సవతుల గుండం” జలపాతం కన్నుల పండుగగా ఉంటుంది. ఉత్తరాన పెద్ద వాగు ఉధృతి విపరీతంగా ఉంటుంది.

 

46 ) పానగల్లు కోట ఎక్కడుంది ?

ఎ ) హైద్రాబాద్‌ నుండి సుమారు 163 కి.మీ. దూరంలో, నాటి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 74 కి.మీ. దూరంగా ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా కేంద్రానికి 15 కి.మీ. దూరంలో, పానగల్లు బస్‌స్టాండ్‌కి సుమారు 2 కి.మీ. దూరంలో ఎత్తయిన రెండు కొండల మధ్య 11, 12 శతాబ్ధాల మధ్య కళ్యాణి చాళుక్యుల కాలంలో అత్యంత పటిష్ఠంగా, ప్రణాళికాబద్దంగా, శత్రదుర్భేధ్యంగా ఈ గిరిదుర్గం నిర్మించబడింది.

పానగల్లు కోటలో మార్బెల్‌ రాళ్ళతో నిర్మించిన ఉయ్యాల మండపంలో ”బంగారు ఊయాల” ఉండేదట. దాని ఆనవాళ్ళు కోటలో ఇప్పటికీ మనకు కానవస్తాయి

 

47 ) ఈ కింది వాటిల్లో ఏది సరైనది  ?

ఎ )వెలిగందలలోని (కరీంనగర్‌) రామగిరి ప్రభావవంతమైన ఓషధులకు

నిలయమై ఎందరినో ఆకర్షించేది.

బి )జైనవిద్యానిధియైన ఉగ్రాదిత్యాచార్యుడు కల్యాణకారకo’   నే ఆయుర్వేద గ్రంథాన్ని  రామగిరి  వ్రాసినట్లు తెలుస్తున్నది.

సి ) పాలమూరు ( మహబూబ్‌నగర్‌ ) జిల్లాలోని పూడూరు శాసనంలో (క్రీ.శ.1088 ) హల్లకరసు అనే గొప్ప విద్వాంసుడు -భైషజ్యశాస్త్ర దానవినోద-అని కీర్తింపబడినాడు. అంటే వైద్యశాస్త్రాన్ని బోధించేవాడని తెలుస్తున్నది

డి)  పైవన్ని

జవాబు : డి 

 

48 ) బావరి ఎవరు ? వివరాలు ఏవి ?

ఎ ) బావరి అనే ఒక ఋషి ధార్మిక ప్రగతికోసం ఉత్తరాపథంనుండి దక్షిణాపథానికి నాటి 16 మహాజన పదాలలోని దక్షిణ భారతంలోనే ఏకైక అస్సక (అశ్మక) జనపదంలోని గోదావరి తీరానికివచ్చి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల మధ్యగల గోదావరీ నదీ ద్వీపంలో అంటే నేటి నిర్మల్‌ జిల్లా, ఖానాపూర్‌ మండలంలోని బాదనకీర్తిలో కపిత్తవనంలో స్థిర నివాసానేర్పరచుకొని జీవనం కొనసాగించాడని తెలుస్తోంది

బి ) బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధ ధర్మం తెలంగాణ (తెలుగు నేల)లో ప్రవేశించిందనడానికి త్రిపీఠకాల్లో ఒకటైన సుత్తపీఠకంలోని సుత్తనిపాతంలో భాగమైన పారాయణవగ్గలోని ఒక వృత్తాంతంవల్ల తెలుస్తోంది. అందులోని వివరాల ప్రకారం బావరి అనే ఒక ఋషి ధార్మిక ప్రగతికోసం ఉత్తరాపథంనుండి దక్షిణాపథానికి నాటి 16 మహాజన పదాలలోని దక్షిణ భారతంలోనే ఏకైక అస్సక (అశ్మక) జనపదంలోని గోదావరి తీరానికివచ్చి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల మధ్యగల గోదావరీ నదీ ద్వీపంలో అంటే నేటి నిర్మల్‌ జిల్లా, ఖానాపూర్‌ మండలంలోని బాదనకీర్తిలో కపిత్తవనంలో స్థిర నివాసానేర్పరచుకొని జీవనం కొనసాగించాడని తెలుస్తోంది. తనకొచ్చిన సంశయాలను తీర్చుకోవడానికి వయోభారంవల్ల తనవద్దగల 16మంది శిష్యులను ఉత్తరాపథంలో ఉన్న తథాగత గౌతమబుద్ధ వద్దకు పంపాడు. వారు ఆనాటి అస్సక జన పదంలోని నేటి బాదనకుర్తి నుండి ములక, మణిశ్మతి, ఉజ్జయిని, విదిశ, కోశాంబి, సాకేతపుర, శ్రావస్థి, కపిలవస్తు, సాతవ్య, కుశినగర, పావ, తదితర ప్రాంతాలగుండా, చివరన వైశాలిలో బుద్ధుడు ప్రవచిస్తున్నాడని తెలుసుకొని అక్కడకువెళ్ళి, తమ గురువు సంశయాలను తీర్చుకొని, సుమారు 15మంది శిష్యులు అక్కడనే బౌద్ధ బిక్షువులుగా ఉండిపోయారు.

సి )బావరి ప్రియశిష్యుడు పింగియ మాత్రం తిరిగి వచ్చి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని బావరికి వివరించాడు. అతనికి కలిగిన సంశయాలన్నింటికి బుద్దుని వద్దనుంచి వచ్చిన పింగియ సమాధానాలతో సంతృప్తి చెందిన బావరి బౌద్ధమే అన్ని కాలాలలో, అందరికీ శాంతిని చేకూర్చే ధర్మం అని తెలుసుకొని, తాను బౌద్ధాన్ని స్వీకరించి అక్కడినుండి బౌద్ధ ధర్మ ప్రచారం గావించాడని సుత్తనిపాతంలోని పారాయణవగ్గ మనకు వివరిస్తుంది.

డి ) పైవన్ని

జవాబు : డి

 

 

49)  బోధన్ పాత పేరు ఏది ?

ఎ ) బోధన్‌గా పిలుస్తున్న నాటి పోథలిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న అస్మకరాజు కూడా బౌద్ధాన్ని తీసుకున్నట్లు చరిత్రకారులవల్ల మనకు తెలుస్తోంది.

 

50) తెలంగాణాలోని ఎక్కడికి  మొదటిసారిగా  బౌద్ధ ధర్మం  ప్రవేశించింది ?

 

ఎ )  క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే ఉత్తరాదినుంచి దక్షిణాదిలోని తెలంగాణాలోని బాదవకుర్తికి మొదటిసారిగా ప్రవేశించిన బౌద్ధ ధర్మం

 

51 ) బుద్ధవనం వివరాలు ఏవి ?

 

ఎ ) ఒకనాటి బౌద్ధ ప్రాభవాన్ని మనం గుర్తు చేసుకుంటూ బౌద్ధ వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పం నుంచి రూపుదిద్దుకొన్నదే నేటి ‘శ్రీపర్వత ఆరామ’.

బి)బుద్ధవనంగా ప్రచారం పొందిన ఈ ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు కుడివైపున డ్యాంకు 3 కి.మీ. దూరంలో, నల్గొండ జిల్లాలో ఉంది.

సి )తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 152 కి.మీ. దూరంలో నల్గొండ జిల్లా కేంద్రానికి 60 కి.మీ. దూరంలో ఉన్న బుద్ధవనం చక్కని ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులకు, బౌద్ధ భిక్షువులకు, చరిత్ర కారులకు, ముఖ్యంగా నాగార్జునసాగర్‌, నాగార్జునకొండను సందర్శించే రాష్ట్రీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల బౌద్ధ వారసత్వ ప్రతీకగా మన్ననలను అందుకొంటోంది.

డి ) పై వన్నీ

జవాబు : డి

 

52) శ్రీపర్వత ఆరామ వివరాలు ఏవి ? ఆచార్య నాగార్జునుడు ఎక్కడ ఉన్నాడు ?

ఎ ) క్రీ.శ. 2వ శతాబ్దంనుంచి ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వత విజయపురిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు నివాసమేర్పచుకొని మహాయాన బౌద్ధ కేంద్రంగా మాధ్యమిక సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేయడంవల్ల ఈ ప్రదేశం నాగార్జునకొండగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 5వ శతాబ్దం వరకు కూడా ఈ శ్రీపర్వతం గొప్ప బౌద్ధ సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడికి శ్రీలంక, నేపాల్‌, టిబెట్‌లనుంచి అలాగే మన దేశం అన్ని ప్రాంతాలనుంచి అధ్యయనం కోసం భిక్షువులు వచ్చేవారు. కాలక్రమంలో దీనిని నందికొండ అని పిలిచారు. ఏలేశ్వరానికి 7 కి.మీ. దిగువన కృష్ణానదిపై అడ్డంగా కట్టిన నాగార్జునసాగర్‌ ఆనకట్టవల్ల ఏర్పడిన జలాశయంలో నాగార్జునకొండ ముంపునకు గురైంది

 

53) వైఢూర్యపురం ఏది ?

ఎ ) ఎన్నో వందల ఏళ్ళ (సుమారు 400 ఏళ్ళు) క్రితం వైఢూర్యపురంగా విరాజిల్లిన నేటి ఈ వడూర్‌కిగల చారిత్రక నేపథ్యం అంతా ఇంతా కాదు. లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం వైఢూర్యపురాన్ని వెంకటరాయుడు అనే రాజు పాలించేవారు. కానీ అంతకుముందునుండే వైఢూర్యపురానికి చారిత్రక నేపథ్యం ఉంది. నిమ్మలపట్టణ నిర్మాణానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చింది ఈ వైఢూర్యపురం. అంతటి ధనధన్యాలకు నిలయం ఈ వడూర్‌కోటకి అంతటి సంపదకు నిలయమైన వైఢూర్యపురం, నిమ్మల (ప్రస్తుత నిర్మల్‌) పట్టణానికి సుమారు 35 కి.మీ. దూరంలో నిర్మల్‌ నుండి ఆదిలాబాద్‌ వెళ్ళే మార్గమధ్యలో బోధ్‌, నేరడికొండ మండల కేంద్రాలకు సమీపాన ఉన్నది. అప్పట్లో వైఢూర్యపురాన్ని అందులోని ఖజనాను కేంద్రంగా చేసుకుని వెంకట్రాయుడు నిమ్మల, బొందిడి రాజ్యాలను పాలించేవాడు.

 

54) నాటి నిజాం నవాబుల పాలనలో మొత్తం ఎన్ని  సంస్థానాలు ఉండేవి ? వివరాలు  ఏవి ?

ఎ ) నాటి నిజాం నవాబుల పాలనలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి.

బి )అందులో సంస్థాన్‌ నారాయణపురం, సంస్థాన్‌ రాజాపేటలను ప్రధాన పాలనా కేంద్రాలుగా చేసుకొని వారు పాలనా కార్యకలాపాలు జరిపేవారు.

సి )గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత పాల్వంచ సంస్థానాలు స్వంత పాలనాధికారాలు కలిగి ఉండేవి

డి ) పైవాన్ని

జవాబు : డి

 

55) కరిమొద్దిన్‌’ తన పేరిట స్థాపించిన పట్టణo ఏది ?

ఎ ) హైదరాబాద్‌ రాజధానిగా నిజాం సంస్థానాన్ని 200 ఏళ్ళ పాటు పాలించిన అసఫ్‌జాహీల కాలంలో ఎలగందుల ఖిలేదారుగా పనిచేసిన ‘కరిమొద్దిన్‌’ తన పేరిట స్థాపించిన పట్టణమే నేటి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ పట్టణం.

 

56) రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) దేన్ని పాలించాడు ?

ఎ ) వేములవాడను  రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) పాలించాడు

57)  ఆనాటి సపాదక్షి ఏ ప్రాంతం లో ఉంది ?

ఎ ) నేటి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రాంతమే ఆనాటి సపాదక్షి

 

58 ) ప్రతాప గిరి కోట వివరాలు ఏవి ?

 

ఏ ) ప్రతాప గిరి కోటది. ప్రత్యేకమైన చరిత్ర. కరీంనగర్‌కు ఈశాన్యంగా 120 కి.మీ. దూరంలో జిల్లా తూర్పు సరిహద్దు ప్రాంతమైన దట్టమైన మహదేవ్‌పూర్‌ అడవులల్లో కాటారం మండలంలో వున్న వన దుర్గమే ఈ ‘ప్రతాపగిరి కోట’.

బి ) ముచ్చనాయనింగారు ప్రతాపగిరి కోటను 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. అతనికి గల ఇరువత్తు గండడు, గండగోపాలుడు, కంచి రక్ష పాలకా, చోళరాజ్య స్థాపనాచార్య, పాండ్య మనువిభాళ, దాయ గజకేసరి, అరిరాయ గజకేసరి, తెలుగు రాయుడు మున్నగు బిరుదులు ఉన్నాయి

సి ) దాయగజకేసరి, రాయగజకేసరి, కాకతీయుల బిరుదులను బట్టి ఈ శాసనములు కాకతీయుల కాలపు శాసనమని భావించవచ్చు. కాకతీయ ప్రతాపరుద్రదేవుని పేరిట నిర్మింపబడిన దుర్గము గనుక ఇది ప్రతాపగిరి కోటగా ప్రసిద్ధి చెందింది

డి ) పైవన్ని

జవాబు : డి 

 

 

59) నగరూరు’ నేడు ‘నగునూరు’గా పిలుస్తున్న దాని వివరాలు ఏవి ?

 

ఏ ) ఒకనాడు రాజధానిగా సబ్బినాడులో ప్రాచుర్యం పొందిన ‘నగరూరు’ నేడు ‘నగునూరు’గా పిలువబడుతోంది

బి ) 1159 ప్రాంతంలో నగునూరును పాలించిన దొమ్మరాజు, పొలవాస పాలకుడు మేడరాజు, కళ్యాణి సేనాని మైలిగి దేవుడు ముగ్గురు మంచి మిత్రులు. లేబెల్‌ శాసనాన్ని అనుసరించి ఈ మిత్ర కూటమి మొదటగా జరిగిన యుద్ధంలో కాకతి రుద్ర దేవుడ్ని ఓడించిన అనంతరం జరిగిన మరో యుద్ధంలో ఈ కూటమితో పాటు సబ్బినాడులోని అన్ని ప్రాంతాలని కాకతి రుద్రదేవుడు గెలుచుకున్నాడని వేయిస్తంభాల గుడిలోని శాసనం తెలియజేస్తోంది.

సి )  కాకతి రుద్రదేవుని మంత్రి నగునూరు పాలకుడు వెల్లకి గంగాధరుడు నగునూరులో త్రికూట దేవాలయాన్ని కట్టించినట్లు కరీంనగర్‌ కలెక్టర్‌ బంగ్లాలో ఉన్న శాసనాన్ని అనుసరించి తెలుస్తోంది

డి ) పైవన్నీ

జవాబు : డి

60 ) ‘నగునూరు’ రాజధానిగా సబ్బిమండలాన్ని ఎవరు  పాలించాడు ?

 

ఎ )కాకతీయ గణపతి దేవుని, సామంతుడు అక్షయ చంద్రదేవుడు ‘నగునూరు’ రాజధానిగా సబ్బిమండలాన్ని పాలించాడు. కొంత కాలం ఇది జైన మత కేంద్రంగా కూడా విలసిల్లింది.

 

 

 

 

 

MODEL QUESTIONS ON TELANGANA HISTORY - 4

 

 

 

1)శ్రీశైల ఉత్తర ద్వారంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉమా మహేశ్వరం. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లాలో నల్లమల అడవి ప్రాంతంలో కొండలో కలిసిపోయి ఉంటుంది. సంవత్సరం మొత్తం కొండలోనుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ ప్రకృతి రమణీయంగా కన్పిస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుండి 100 కి.మీ. దూరంలో శ్రీశైలం వెళ్లే దారిలో ఈ క్షేత్రం ఉంది.

 

 

2)వరంగల్‌ జిల్లా కొమురవెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. 

 

3) వరంగల్‌ పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఐనవోలు గ్రామముంది. ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది. ఇక్కడి ప్రధాన దైవతం ‘ఐనవోలు మల్లన్నగా’ ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయాన్ని కాకతీ రెండవ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించినట్లు సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తోంది. ఆలయానికి తూర్పు, దక్షిణ దిశల్లో రెండు కీర్తి తోరణాలు నిర్మించబడ్డాయి.

 

 

4) హైదరాబాదుకు 30 కి.మీ. దూరంలో భవానీసమేత శ్రీ రామలిం గేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది త్రేతాయుగం నాటిదని ఐతిహ్యం

 

 

5) తెలుగుదేశాన్ని పాలించిన, పౌరుష పరాక్రమాలకు మారుపేరుగా నిలిచిన కాకతీయుల కాలంలో వేయి స్తంభాల గుడి నిర్మించబడింది. ఇందులో పరమ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. విశిష్ట నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1138 – 1145 మధ్య కాలంలో కాకతి రుద్రదేవుడు నిర్మించాడు.

 

 

6) తెలంగాణలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో వేములవాడ అగ్రగణ్యమైంది. ప్రధాన దైవం శ్రీరాజరాజేశ్వరుడు. ఈ ఆలయాన్ని చాళుక్యవంశ రాజులు నిర్మించారు

 

7) చాళుక్యరాజులలో గొప్పవాడు రెండవ అరికేసరి. ఇతడి తంత్ర పాలకుడు పెద్దనార్యుడు. రాజేశ్వరదేవుని వద్దకు వచ్చే భక్తులకు అన్నదాన సత్రాలు వేములవాడలో ఉండేవి. పెద్దనార్యుని కోరిక మేరకు సత్రాల నిర్వహణకు శతవర్తన విస్తారమైన భూమిని, 8 నివర్తనాల నీరునేలను దానమిస్తూ శాసనం వేయించాడు. ఈ శాసనం వల్ల వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోడానికి వీలవుతుంది.

 

8) కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం వాడపల్లి. ఇది కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం. దీనికి మూడు వైపులా నీరు, ఒక వైపు భూభాగం ఉంది. ఇది నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఏకైక జలదుర్గం. దీనిచుట్టూ లోతైన కందకం ఉండి బలిష్టంగా నిర్మించబడింది.

వాడపల్లిలో రెండు ప్రాచీన, ప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు నిర్మించ బడినాయి.

9) రాష్ట్ర రాజధాని నుంచి జహీరాబాదు వెళ్ళే మార్గంలో ఝరాసంగమనే గ్రామంలో పరమశివుడు సంగమేశ్వర స్వామిగా వెలసినాడు. ఈయననే కేతకీ సంగమేశ్వరుడని కూడా అంటారు. పూర్వం ఈ ప్రాంతం కేతకీ వనమని, శౌనకాది మునులు ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడున్న గుండాన్ని ‘అమృత గుండం’ అంటారు.

 

 

10) భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం కాళేశ్వరాలయం ప్రత్యేకత. ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద, గౌతమీ పురాణాల్లో కనిపిస్తుంది. దేవాలయంలో మొదట కాళేశ్వరుడిని (యముడు) పూజించి తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం

 

 

11) నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణానికి 3 కి.మీ. దూరంలో పానుగల్లు గ్రామం ఉంది. ఈ గ్రామం కందూరు చోళులు, కాకతీయులకు రాజధానిగా నిలిచింది. చారిత్రకంగా పానుగల్లుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రముఖ శివ కవి పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో పానగల్లును ప్రస్తావించడం జరిగింది. పానగల్లు నగరంలో శిథిల శివాలయాలు, నందీశ్వర విగ్రహాలు, పానవట్టాలతో కూడిన శివలింగాలు, శివుని పానవట్టం ఆకృతి కలిగిన రాళ్ళు ఈ ప్రాంతంలో లభించడం వలన ‘పానవట్టపు కల్లు’ క్రమంగా పానగల్లుగా మారి ఉండవచ్చని చారిత్రకుల కథనం.

 

 

12)

తెలంగాణ రాష్ట్రంలో నేడు ‘నిజామాబాద్‌’గా పిలవబడుతున్న ‘ఇందూరు’ది చాలా ప్రత్యేక స్థానం

ఇందూరు అంటే జైనుల, బౌద్ధుల బోధనశాల, విష్ణు కుండినులు ఏలిన నేల. ఇందూరు అంటే జిన వల్లభుడు, హరికేశరుడు, పంపకవి రచించిన బోధనలు మనకు గుర్తుకు వస్తాయి. ‘ఇందూరు’ పేరు వినగానే ఇంద్రపురి, కైలాస గిరి, బాల కొండ దుర్గాల స్ఫురణ కూడా కలుగుతుంది. ఈ నగరాన్ని పాలించింది రాష్ట్ర కూట సామ్రాజ్యానికి చెందిన మూడవ ఇంద్రుడు, ఆయన పేరుమీదుగానే ఈ ప్రాంతాన్ని ‘ఇంద్రపురి’గా పిలిచే వారు. నిజాం ప్రత్యేక రాజ్యంగా కొనసాగిన కాలం లో తెలంగాణ భారతదేశంలో విలీనమవకముందు ఈ ప్రాంతాన్ని అసఫ్‌జాహీలు పాలించడంతో ఆయా రాజుల పేర్ల మీదుగా నిజాం రాజ్యంలోని అనేక నగరాల పేర్లు మార్చబడ్డాయి. అదేవిధంగా నిజాం ఉల్‌ ముల్క్‌ పేరుమీదుగా వందల ఏళ్ళపాటు ‘ఇందూరు’గా పిలవబడ్డ నగరం ‘నిజామాబాద్‌’గా మార్పు చెందింది.

13) రాష్ట్ర కూట సామ్రాజ్యాన్ని స్థాపించింది దాంతీ దుర్గుడు. దక్షిణ గుజరాత్‌లో ప్రారంభించిన ఆయన సామ్రాజ్య విస్తరణ దక్షిణ భారతదేశంలోని తంజావూరు వరకు అప్రతిహతంగా కొనసాగింది

 

14 ) మూడవ ఇంద్రుని కాలంలో వేసిన పునాది రాయే ఈ ‘ఇందూర్‌ ఖిల్లా’. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 177 కి.మీ. దూరంలో వున్న ‘ఇందూరు ఖిల్లా’ నిర్మాణానికి 10వ శతాబ్ద కాలంలో 3వ ఇంద్రుడి ద్వారా బీజం పడింది. రాష్ట్ర కూట రాజులచే నిర్మించబడిన ‘ఇందూర్‌ ఖిల్లా’

పట్టణ ప్రధాన కూడలి గాంధీ చౌక్‌ నుండి 2 కి.మీ. దూరంలో, నిజామాబాద్‌ పట్టణ ప్రాంతానికి దక్షిణ దిశలో వుంది.

15) ఇందూరు కోట రాష్ట్ర కూటుల నుండి కాలక్రమేణా కాకతీయులు, బహిమనీలు, మొగలాయిలు, కుతుబ్‌ షాహీలు, అసఫ్‌జాహీల చేతుల్లో తీర్చిదిద్దుకోబడిందని తెలుస్తోంది.

 

 

16) రాష్ట్రకూట రాజులలో ప్రసిద్ధి చెందిన ఇంద్రుడు క్రీ.శ. 914 – 928 సంవత్సర మధ్య కాలంలో ఇందూర్‌ను పాలించినప్పుడు పట్టణానికి నైరుతి దిశలో ఈ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. సుమారు 3900 చ.గజాల వైశాల్యంలో నిర్మింపబడి వుంది ఈ శ్రీ రఘునాథ ఆలయం. శ్రీ సమర్థ రాందాస్‌ జీ (ఛత్రపతి శివాజీ గురువు) గతంలో ఈ కొండపై రఘునాథ మందిరాన్ని నెలకొల్పారు. 

 

 

 

17) వెయ్యి సంవత్సరాల క్రితం కోట నిర్మించినప్పటికీ ఇప్పటికీ కోట ఆనవాళ్ళు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇక్కడి 53 అడుగుల అఖండ శిలా ధ్వజ స్తంభంపై నాడు ప్రతినిత్యం ‘గరుడ దీపం’ వెలిగిస్తే చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రజలు దీపాలు వెలిగించేవారని ప్రతీతి.

 

 

18) కాలక్రమేణ 1296 మధ్య కాలంలో ఈ కోట ఢిల్లీ సామ్రాజ్యానికి చెందిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ చేతుల్లోకి వెళ్ళి మహమ్మదీయ సేనల చేతిలో దాదాపు 1296 నుండి 1316 వరకు వారి పాలనను చవిచూసింది

 

 

19) ఇందూర్‌ ఖిల్లా’. అనంతర కాలంలో కుతుబ్‌ షాహీల నిజాముల పాలనను సైతం చవి చూసింది. వారి కాలంలో మసీదులు దర్గా నిర్మాణాలకు కూడా నెలవైంది

 

 

20)

వెలమరాజుల ఏలుబడిలో వైభవంగా పాలింపబడి, శత్రుదుర్భేధ్యంగా తీర్చిదిద్దబడిన కోట రాచకొండ కోట. భూమికి 600 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఒక అద్భుత కోట నిర్మాణం మన తెలంగాణ ప్రాంతంలో రాజధానికి అతి దగ్గరలో కొలువుదీరి వుంది. ఈ కోటలో నైపుణ్యతకు, సాంకేతిక నిర్మాణానికి కొదవే లేదు. శత్రువు రాకలను పసిగట్టి ఎక్కడికక్కడ వారిని మట్టుబెట్టే విధంగా వైవిధ్యంగా నిర్మించబడిన ఈ కోట నిర్మాణ తీరు అద్భుతం. ఎత్తయిన కొండలపై ఎంతో పటిష్టంగా నిర్మించిన రాచకొండ కోట చుట్టూ 40 కి.మీ. పొడవైన ఎత్తయిన రాతి గోడ, భారీ గ్రానైట్‌ రాళ్ళతో, పలు మలుపులతో ‘ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ను తలపించే విధంగా నిర్మించారు. 12వ శతాబ్ధం నుండి కాకతీయ రాజులకు సామంతులుగా ఉన్న రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన రేచర్ల సింగమ నాయకుడు 14వ శతాబ్ధంలో ఈ కోట నిర్మాణానికి పునాది వేసాడు. ముస్లిం రాజులైన బహుమనీసుల్తానులకు, హిందూ రాజులైన విజయనగర రాజులకు మధ్య రాచకొండ రాజ్యం కొంతకాలం పాటు ఇరు మతస్తులకు వారధిగా నిలిచి మత సమైక్యతకు, సామరస్యతకు కృషి చేసింది.

21)1433లో ఈ కోటను బహుమనీ సుల్తానులు అత్యంత పాశవికంగా జరిగిన ఘోర యుద్ధంలో స్వాధీనం చేసుకున్నారు. 1480 నుండి బహుమనీ గవర్నరుగా వ్యవహరించిన శితాబ్‌ఖాన్‌ 1503లో బహుమనీలను ధిక్కరించి స్వాతంత్య్రం ప్రకటించుకొని రాచకొండ కేంద్రంగా తన పాలన కొనసాగించాడు. వరంగల్‌, ఖమ్మం కోటలను కూడా జయించిన శితాబ్‌ఖాన్‌ పాలనలో 1503 నుండి 1512 వరకు కోటలోని పలు ఆలయాలు ధ్వసం చేయబడ్డాయి. చారిత్రక వారసత్వంగా నిర్మించబడిన అనేక అద్భుతాలు నేల మట్టం చేయబడ్డాయి. అయినా నేటికీ కొన్ని గొప్ప ఆనవాళ్ళు మిగిలి ఉన్నాయంటే అవి నాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం.

 

 

22) 15వ శతాబ్ధానికి చెందిన వినుకొండ వల్ల భాచార్యుల వారి ‘క్రీఢాభిరామం’లో ఓరుగల్లు మరియు రాచకొండల వైభవాన్ని చక్కగా వర్ణించారు.

 

 

23) కోటలో భోలే సాహెబ్‌ అనే వీరయోధుడి సమాధి మనకు కనిపిస్తుంది. రాచకొండను శత్రువుల నుండి కాపాడేందుకు తన ప్రాణాలు తృణప్రాయంగా త్యజించిన వీరయోధుడి సమాధి ఇది. ఈ సమాధి ప్రాంగణ ప్రాంతంలో దీపం ఎప్పుడూ వెలుగుతూనే వుంటుంది

 

 

24)

ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలనలో తెలంగాణ అంతటా భూస్వామ్య విధానం వేళ్ళూనుకుపోయింది. ఓరుగల్లు మొదటినుండి ఒక చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ స్వాతంత్య్రకాంక్ష భావజాల విస్తరణలో భాగంగా 1929లో మొలుగు భూమయ్య ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా ఈ సంస్థ యువకులను చైతన్యవంతంచేసింది. అదొక ఉద్యమ వృక్షమై విరగ బూసింది. ఓరుగల్లు కోటలో 1940నుండి ఆచారి అనే దేశభక్తుడి ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌ కార్యక్రమాలు మొదలై కొనసాగుతూ వచ్చాయి. దేశభక్తులైన యువకులు అందులో భాగస్వా ములయ్యారు. ఆసనాలు, సాముగరడీలు, దేశభక్తితో కూడిన సాంస్కృతిక ప్రక్రియలలో ఆ యువకులు మమేకమయ్యారు. అందులో అగ్రభాగాన నిలిచిన ఆరడుగుల ఆజానుబాహుడు బత్తిని మొగిలయ్య. ఆర్యసమాజ్‌ కార్యకలాపాలలో వాటి నిర్వహణలో అగ్రభాగాన ఉండేవాడు. 1944 నుండి వరంగల్‌ కోటలో ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో రాత్రిబడులు మొదలయ్యాయి

 

25)

1946 ఫిబ్రవరి 5న మహాత్మాగాంధీ మద్రాసునుండి అహ్మదా బాద్‌ వెళ్తూ వరంగల్‌ స్టేషన్‌లో ఆగి ఇక్కడి ప్రజల నుద్దేశించి పది నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత ప్రజలలో స్వతంత్య్రకాంక్ష పెరిగి ఆర్యసమాజ్‌ కాంగ్రెస్‌ కార్యక లాపాలు ప్రజా బాహుళ్యంలోకి విస్తరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 1946 ఫిబ్రవరి 12న హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ఒక రహస్య సర్క్యులర్‌ జారీచేసింది. కాంగ్రెస్‌ సేవాదళ్‌ కార్యకర్తలంతా రహస్యంగానైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవే యాలని జాతీయగీతాన్ని ఆలపించాలని దాని సారాంశం.

బత్తిని మొగిలయ్య, బత్తిని రామస్వామి ఇద్దరు అన్నదమ్ములు. మొగిలయ్య తూర్పు కోటలో 1919లో చెన్నమ్మ మల్లయ్య దంపతుల ఐదవ సంతానంగా జన్మించాడు. కోటబడిలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తాళ్లెక్కే కులవృత్తిని చేపట్టి ఆర్యసమాజ్‌ కార్యకలాపాలలో భాగమయ్యాడు. ఇతని అన్న రామస్వామి గాంధేయవాది. అంకితభావం కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్త. వాళ్ళిద్దరి కారణంగా వరంగల్‌ కోటలో రాజకీయ చై తన్యం వెల్లివిరిసింది. పక్కపక్కనున్న మొగిలయ్య, రామస్వామిల ఇండ్లు ఆ ఇంటిముందుగల ఖాళీస్థలం ఉద్యమ వేదికలైనాయి. నిజాంరాజు అధికారికంగా త్రివర్ణపతాక ఆవిష్కరణను నిషేధించాడు.

26) 11 ఆగస్టు 1946 ఆదివారం ఉదయం 7.30 గంటలకు తూర్పుకోట ముఖద్వారం దగ్గర జెండా ఎగురవేయాల ని అందులో కోటలో ఉన్నవాళ్ళందరిని భాగస్వాములను చేయాలని కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించారు. అప్పుడు హయగ్రీవాచారి కాంగ్రెస్‌ పట్టణ అధ్య క్షులుగా, భూపతి కృష్ణమూర్తి కోశాధి కారిగా ఉన్నారు. కోటలోని ప్రజలు తూ ర్పుకోట ముఖద్వారం దగ్గర గుమిగూ డారు. నాయకులు జెండా ఎత్తారు. జై కొట్టారు. పిల్లలు దేశభక్తి గీతాలనాల పించారు. నీరెండలోని నింగిలో సగౌ రవంగా జాతీయజెండా రెపరెపలాడింది. కోటగోడల మీదనుంచి వీచిన అపురూపమైన గాలి అందరినీ ఆత్మీయంగా స్పృషించింది. అనంతరం మొగిలయ్య, రామస్వామిలతో కలిసి నాయకులంతా రామస్వామి ఇంటికి చేరుకున్నారు. మొగిలయ్య అనంతరం వృత్తిలో భాగంగా తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్ళాడు. రామస్వామి ఇంట్లో కాంగ్రెస్‌ నాయకులంతా కలిసి చాయ్‌ తాగుతూ భవిష్యత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాల గూర్చి చర్చించుకుంటున్నారు.

 

 

27) దక్కను సామ్రాజ్యంలో నిజాం పరిపాలనకు ముందు నుండి అంటే గోల్కొండ నవాబుల కాలం నుండి తెలంగాణలో దోమకొండ, బండలింగాపూర్‌, గద్వాల లాంటి తొమ్మిది సంస్థానాలు మనుగడలో వున్నాయి. ఈ సంస్థానాలన్నీ స్వాతంత్య్రంగానే ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిపాలనను కొనసాగించాయి.

 

 

28) వనపర్తి’ సంస్థానం నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల్లోకెల్లా అత్యంత కీలక సంస్థానం. మహబూబ్‌నగర్‌ జిల్లా మొత్తానికి కీర్తి కిరీటం. 500 సంవత్సరాల గొప్ప వైభవోపేతమైన చరిత్రను తనలో ఇముడ్చుకున్న వనపర్తి సంస్థానంలో పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం, పెద్దగూడెం, వెంకటాపురం, జంగమాయి సహా 178 గ్రామాలు వుండేవి. కొన్ని వందల సంవత్సరాల పాటు సంస్థానంగా వున్నా 1807వ సం||లోనే ‘వనపర్తి’ జిల్లాకు మూలకేంద్రంగా మారింది. అంత కంటే ముందు ఈ సంస్థానంలో పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం లాంటి గ్రామాలు మూలకేంద్రాలుగా వున్నాయి. ఈ సంస్థానాధీశులు ‘వనపర్తి’ని కేంద్రంగా మార్చుకున్న తరువాత ఇక్కడ పెద్ద గడి లాంటి కోటను వారి సామ్రాజ్య సంరక్షణకై నిర్మించుకున్నారు. అదే ‘వనపర్తి గడికోట’. 1948వ సం|| నాటికే వనపర్తి సంస్థానం 605 చ.మైళ్ళ విస్తీర్ణంలో వుండేదంటే ఆ సంస్థానం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. 178 గ్రామాలకు మూల కేంద్రమైన ఈ సంస్థానానికి ఉత్తరాన నిజాం పాలన కింద వున్న నాగర్‌కర్నూల్‌ ప్రాంతం, తూర్పున జటప్రోలు సంస్థానం, పడమట అమరచింత సంస్థానం, దక్షిణాన కృష్ణానది సరిహద్దులుగా వుండేవి.

వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి, ఆయనకి ముగ్గురు భార్యలు. వారి వల్ల కలిగిన సంతానం ఆరుగురు కుమారులు. ఆయన తరువాత ఆయన పెద్ద కుమారుడు వెంకట కుమార గోపాలరావు సంస్థాన ధీశుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కాలంలో ఈ సంస్థానం విజయనగర రాజుల క్రింద వుండేది. అదే కాలంలో విజయ నగర రాజుల సహాయంతో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా గోలకొండ రాజయ్యాడు. దీంతో వనపర్తి సంస్థానం కుతుబ్‌షాహీల క్రిందకి వచ్చింది. వనపర్తి సంస్థానం 15వ శతాబ్ధం నుంచి 1948వ సం|| వరకు కుతుబ్‌షాహీలు, విజయనగర రాజులు, మొగలులు, నిజాం రాజుల పరిపాలనలో కొనసాగిందని చరిత్రకారుల కథనం.

 

 

 

29) 1688వ సం||లో ఈ సంస్థానాన్ని పాలించిన మొదటి రాణి జొన్నమందళ సుగూరు నుండి కొత్తకోటకు తన సంస్థానాన్ని మార్చింది. తరువాత 1750వ సం|| నుండి 1807 వరకు శ్రీరంగపురం కేంద్రంగా ఈ సంస్థాన పాలన కొనసాగింది. 1807 సం||లో రామకృష్ణారావు శ్రీరంగపురం నుండి సంస్థానాన్ని వనపర్తికి మార్చాడు. అలా పాలన మారిన ప్రతి కేంద్రంలోనూ వారు గడిలను నిర్మించుకుంటూ వచ్చారు. అన్నింటిలోకి ‘వనపర్తి గడి’ అతి పెద్దది.

 

 

30) వనపర్తి గడి నిర్మాణాన్ని 1868లో జొన్నమందళ దొరసాని చేపట్టింది. 1807 వ సం||లో రాజధానిని వనపర్తికి మార్చిన తరువాత ఇక్కడ ఒక గడి వుండాలని ఆమె నిర్ణయించుకుంది. ఇలాంటి నిర్మాణాలు ఏవి చేపట్టాలన్నా ముందుగా డంగుతో సున్నం తయారు చేయాలి. డంగు సున్నాన్ని తయారు చేసే ప్రక్రియలో వారు ఎడ్లతో మట్టిని రోజుల తరబడి త్రొక్కించేవారు. ఈ ఆనవాళ్ళు మనకు ఇప్పటికీ వనపర్తి గడిలో కనిపిస్తాయి.

 

 

31) వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో వారసత్వాలపై కొన్ని వివాదాలున్నాయి.

వీటిని పరిష్కరించే దిశగా నిజాం రాజు ఆనాడే ఒక కమీషన్‌ ఏర్పాటు చేశారంటే వారి మధ్య గొడవలు ఏ స్థాయిలో వుండేవో మనం అర్థం చేసుకోవచ్చు. సంస్థానం పాలనా వ్యవహారాల్లో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. అసలు గడీల పునాదికి సంబంధించి మహిళలే తమ ఆలోచనల్ని అమలుపరిచేవారు. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సంస్థానాధీశుల్లో సగం మంది దత్తతగా వచ్చిన వారే. సవై వెంకటరెడ్డి, నాలుగో వెంకటరెడ్డి, గోపాలరావు, మొదటి రామకృష్ణారావు, మొదటి రామేశ్వర్‌ రావు, రెండవ రామేశ్వరరావు లాంటి వారంతా దత్తతగా వచ్చినవారే. రెండువందల సంవత్సరాలపాటు సాగిన సంస్థాన పాలనలో సగం మంది సంస్థానాధీశులు దత్తతగా వచ్చిన వారే. ఈ సంస్థానాధీశులు, కవులను, తెలుగు సాహిత్యాన్ని, బ్రాహ్మణులను బాగా ప్రోత్సహించి గౌరవించేవారు. బ్రాహ్మణులను గౌరవించటం అంటే సాక్షాత్తూ దేవుళ్ళను పూజించటం వంటిదని వారు భావించేవారు. దానికి తగ్గట్లే బ్రాహ్మణులు యజ్ఞ యాగాది కార్యాలను నిర్వహిస్తూ పాలనలో వారికి మంచి సూచనలు అంది స్తూ వుండేవారు. అలాగే ప్రతియేటా కవి సమ్మేళనాలను నిర్వహించడమేగాక, ఆ సందర్భంలోనే బ్రాహ్మణులను, కవులను సత్కరించేవారు. మరో విశేషమేమిటంటే ‘ఓరియెంట్‌ ఇంగ్లీష్‌ లాంగ్‌ మ్యాన్‌’ స్కూళ్ళను స్వయంగా సంస్థానాధీశులు నడిపేవా రంటే వారు ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించే వారని తెలుస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన మొదటి రోజుల్లో ‘ఓరియెంట్‌ లాంగ్‌ మ్యాన్‌ (లండన్‌) కంపెనీని రాజారామేశ్వ

రావు స్వయంగా నడిపారు.

 

 

 

32) 1959 అక్టోబర్‌ 11న జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలో వనపర్తి సంస్థానానికి చెందిన ఈ గడిని పాలిటెక్నిక్‌ కాలేజ్‌గా మార్చారు. వాటికి సంబంధించిన శిలాఫలకాలు నేటికీ లభ్యమవుతాయి. సంవత్సరానికి రెండు లక్షల కప్పం వనపర్తి సంస్థానాధీశులు నిజాం ప్రభుత్వానికి కట్టేవారు

 

 

 

 

33)  బి.ఎస్‌. వెంకటరావు ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్ళలో తెలంగాణ కేంద్రంగా అంబేద్కర్‌ భావజాల విస్తృతికోసం కృషి చేశారు. ఆయన హైదరాబాద్‌ అంబేద్కర్‌గా పేరెన్నికగన్నారు. ఆయన పూర్తి పేరు బత్తుల సాయన్న వెంకటరావు. 30.5.1936న బొంబాయిలో ప్రథమ మెహర్‌ సదస్సు జరిగింది. ఈ సభకు బి.ఎస్‌. వెంకటరావు అధ్యక్షత వహించారు. అంబేద్కర్‌ స్వయంగా బి.ఎస్‌. వెంకటరావుని ఏనుగు-అంబారీమీద సమావేశ స్థలానికి తీసుకొని పోయారు. సభికులు బి.ఎస్‌. వెంకటరావుని హైదరాబాద్‌ అంబేద్కర్‌గా ప్రశంసించారు

 

 

34) సంఘ సంస్కారం కోసం 1926లో ఆదిహిందూ మహాసభను ఏర్పాటు చేశాడు.

ఎ) బి.ఎస్‌. వెంకటరావు

 

35) మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో, వనపర్తి మండల కేంద్రానికి 6 కి.మీ. దూరంలో వున్న ఖిల్లా ఘన్‌పూర్‌.

 

 

36) ఖిల్లా ఘన్‌పూర్‌’ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గిరి దుర్గాలలో ఒకటి. ఇది వనపర్తికి సమీపంలో ఘనపురంలో క్రీ.శ. 1224లో 24 అడుగుల ఎత్తయిన మూడు ముఖ ద్వారాలతో పలు బురుజులతో శతృదుర్భేద్యంగా 18 అడుగుల ఎత్తయిన రాతి ప్రహరి గోడలతో రేచర్ల పద్మనాయకులు, గోన గన్నారెడ్డిల కాలంలో అద్భుతంగా నిర్మించబడింది. వారు కాకతీయ ప్రభువులకు సామంతరాజులు. వారు నిర్మించిన ఈ కోట ఎత్తయిన రెండు కొండల మధ్య నిర్మించబడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొత్తం తొమ్మిది కొండలు ఉన్న ఈ ప్రాంతం అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించి వారు ఈ కోట నిర్మాణం గావించారు. రాణి రుద్రమ దేవి మనుమడు చివరి కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు ఘనపురం రాజు గోనగన్నారెడ్డి కుమార్తెను ఈ కోటలోనే వివాహమాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

 

 

37) ఖిల్లా ఘన్‌పూర్‌గా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని రేచర్ల, మల్యాల, గోన వంశానికి చెందిన రాజులు నాలుగు శతాబ్దాల పాటు పాలించారు. వీరంతా కాకతీయ రాజులకు మంచి విధేయులు కాబట్టి వారి సామంతులుగా ఈ ప్రాంత రాజ్యాలను పాలించారు. ఖిల్లా ఘన్‌పూర్‌ చారిత్రక శిల్పకళకు నెలవవ్వడమేగాక ప్రకృతి అందాలకు కూడా ఎంతో సుప్రసిద్ధం. ఇక్కడ గణపతి సముద్రం పేరుతో ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన పెద్ద చెరువు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆనాడు కోటలోని ప్రజల నీటి అవసరాన్ని ఈ చెరువు తీర్చేది. నేటికీ ఈ చెరువులో సమృద్ధిగా నీరు లభిస్తుంది. ఈ గణపతి చెరువును అప్పటి కాకతీయ సామంత రాజైన మల్యాల గుండనగా ప్రసిద్ధుడయిన గుండ దండాధీశుడు రాణీరుద్రమదేవి కాలంలో నిర్మించాడు

 

 

38) గోన వంశ రాజులు, మల్యాల వంశ రాజులు మంచి విధేయులుగా కాకతీయ రాజుల దగ్గర మెలిగేవారు. ఈ సాన్నిహిత్యం వల్లనే గోన, మల్యాల రాజుల మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో మల్యాల గుండనాధీశుడు గోన బుద్ధారెడ్డి కూతురు కప్పాంబికను వివాహము చేసుకున్నాడు. వారి కాలంలో కోటలో కొత్త మందిరాలు, నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. సహస్ర గణపతేశ్వర ఆలయాన్ని కూడా అదే సమయంలో గోన బుద్ధారెడ్డి నిర్మించారు. అద్భుతమైన ఆ మందిరం శిథిలాలు నేటికీ కనిపిస్తాయి. ఆ మందిర ప్రారంభోత్సవానికి ఆయన గణపతిదేవ చక్రవర్తిని ఆహ్వానించి బంగారు ఆభరణాలతో తూకం వేయించి ఆయనకు ఘనసన్మానం చేయటమేగాక ఆయన పేరిట ‘ఘనపురం’ గ్రామాన్ని నిర్మాణం గావించి తన ప్రభు భక్తిని, విశ్వాసాన్ని చాటుకున్నాడు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో గణపతి దేవ చక్రవర్తి కాలంలో ఘన్‌పూర్‌, ఘనపురం లాంటి అనేక గ్రామాలు ఉండటంతో దీనిని ‘ఖిల్లా ఘన్‌పూర్‌’గా పిలవటం మొదలయింది.

 

 

39) గోన బుద్ధారెడ్డికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందులో మొదటి వాడే గోన గన్నారెడ్డి, రాణి రుద్రమదేవికి ఆయన అత్యంత విశ్వాస పాత్రుడు. రెండవ వాడు కచ్చరెడ్డి గోన. మూడవ వాడు గోన విఠలంత, కూతురు కప్పాంబిక. గోన కచ్చరెడ్డి, గోన విఠలంతలు ఇద్దరు మంచి రచయితలు. వారి తండ్రి గోన బుద్ధారెడ్డి ప్రారంభించిన రంగనాథ రామాయణాన్ని వారిద్దరూ కలిసి పూర్తి చేశారు. ఈ గ్రంథం ద్విపద ఛందస్సులో తెలుగులో వచ్చిన మొదటి రామాయణం.

 

 

40)

గోన బుద్ధారెడ్డి మరణం తరువాత అతని సోదరుడు గోన లక్కమరెడ్డి ఘన్‌పూర్‌ సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కానీ అతను మాత్రం తన అన్నలా కాకతీయులకు విధేయుడిగా వుండటానికి ఇష్టపడలేదు. ఒక రకంగా తిరుగుబాటుకు సిద్ధపడ్డాడు. ఇది గమనించిన బుద్ధారెడ్డి పెద్ద కుమారుడైన గోన గన్నారెడ్డి తన అధిపతులైన కాకతీయులకు అనేక యుద్ధాలలో ఉపయోగపడి వారి పట్ల తన విధేయతను, ప్రభు భక్తిని చాటాడు. ఆ సందర్భంలోనే గోన గన్నారెడ్డి వర్థమాన పురానికి రాజైనాడు. నిజానికి బుద్ధాపురం (ప్రస్తుతం బూత్‌పూర్‌) వర్థమానపురం (నంది వడ్డేమాన్‌) రాజ్యాలు మల్యాల రాజుల ఆధీనంలో పలు దశాబ్దాల పాటు కొనసాగాయి. మల్యాల గుండన అనంతరం అతని భార్య కప్పాంబిక పాలన కొంత కాలంపాటు కొనసాగించినా శత్రువుల బెడద తీవ్రం కావటంతో గన్నారెడ్డి ఆ రాజ్యాలని స్వాధీనం చేసుకున్నాడు. గుండన, కప్పాంబికలు పలు చెరువులను వారి పాలనలో తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.

 

 

41)

కొలనుపాక కొల్లిపాకగా తొలుత రాష్ట్రకూటుల నాటి ఒక శాసనంలో ప్రస్తావించబడింది. సంకర గడ్డారసురుడు అనే రాష్ట్ర కూట సామంత రాజుకు రాజధానిగా ఉన్న కొలనుపాక ఆనాడే జైన మతానుయాయులకు స్థావరమైందని పరిశోధకుల ఉవాచ.

క్రీ.శ. 973 తరువాత దక్కనును పాలించిన పశ్చిమ చాళుక్యుల కాలంలో కూడా కొలనుపాక ప్రాంతీయ రాజధానిగా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

 

 

42) హైద్రాబాద్‌ నగరానికి 60 కిలోమీటర్లు దూరంలో, వరంగల్‌ పట్టణానికి 50 కిలోమీటర్లు దూరంలోనూ ఉన్న ఈ క్షేత్రానికి పక్కగా ఆలేరు నది ప్రవహిస్తుంది. కల్యాణి చాళుక్యులకు రాజధాని కొలనుపాక. 11వ శతాబ్దానికి చెందిన ఈ రాజుల కాలంలోనే అనేక ఆలయాలు ఇక్కడ వెలిశాయి. కొలనుపాకలో దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి గాంచిన జైనాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏటా లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. క్రీ.శ. 1767లో మొగలు చక్రవర్తి ఔరంగజేబు కుమారుడైన బహద్దూర్‌షా దగ్గర సుబేదారుగా పని చేసిన యూసఫ్‌ఖాన్‌ జైనాలయ ముఖ ద్వారాలను నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది.

 

43) గణపతి దేవ చక్రవర్తి, అతని సోదరి మైలాంబ ఈ సోమేశ్వరాలయంలో సహస్రలింగేశ్వర ప్రతిష్ఠ చేసినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి

 

 

44) కొలనుపాకలోని సోమేశ్వర స్వామి వారి దేవాలయ ముఖమంటపంలో పురావస్తు శాఖవారి ప్రదర్శనశాల ఉంది. ఈ ప్రదర్శనశాలలో వందలాది విగ్రహాలు, శిల్పాలు, శాసనాలు దర్శనమిస్తాయి. ఆరవ విక్రమాదిత్యునికి కాలానికి చెందిన ఆరు శాసనాలు ఇక్కడ ఈ ప్రదర్శన శాలలో పర్యాటకులు దర్శించడానికి వీలుగా పొందుపరిచారు. కాకతీయ, చాళుక్య రాజుల శిల్ప శైలి గురించి అధ్యయనం చేసేవారికి ఈ ప్రాంగణం ఓ అద్భుతమైన వేదిక.

 

 

45) కొలనుపాకలో చారిత్రకపరంగా ప్రాధాన్యం సంతరించుకున్న మరో ఆలయం వీరనారాయణ స్వామి ఆలయం. జగద్దేవుడి సేనాపతి అయిన నంది విగ్రహ సోమదండ నాయకుడు తన ప్రభువు రాజ్యాభివృద్ధినీ, క్షేమాన్ని కోరి కొలనుపాలో క్రీ.శ. 1105లో జదద్దేవ వీరనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి అష్టదిశల దిక్పాలకుల విగ్రహాలు ప్రతిష్ఠితమ య్యాయి. కొల్లూరు, పెంబర్తి, కొలనుపాక గ్రామాలను ఈ ఆలయానికి ఆనాటి పాలకులు అరణంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఆలయం కాకతీయులు, మొగలుల పాలనలో నిరాదరణకు గురై శిధిలావస్థకు చేరుకుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

35) నిజామాబాద్‌ జిల్లాలోని ‘కౌలాస్‌ కోట’ కూడా ఒకటి. రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, బరీద్‌ షాహీదులు, మొఘలాయిలు, రాజపుత్రులు, అసఫ్‌జాహీల పరిపాలనను చవిచూసి వారి కట్టడాల తీరును మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఈ కోట జిల్లా కేంద్రానికి 120 కి.మీ. దూరంలోని జుక్కల్‌ మండలంలో కౌలాస్‌ గ్రామానికి దక్షిణంగా బాలా ఘాట్‌ పర్వత శ్రేణులలో వుంటుంది.

 

36) ఈ కోట ఎన్నో పోరాటాలకు సాక్ష్యం, సుమారు 1100 సంవత్సరాల క్రితం 300 ఎకరాల వైశాల్యంలో అత్యంత పటిష్టంగా నిర్మించిన ఈ రాతి నిర్మాణం నేటికీ అలాగే వుంది. రాష్ట్ర కూట రాజైన 3వ ఇంద్రుడు (కీ.శ. 915 నుండి 917) బోధన్‌ రాజధానిగా ఇందూరు మండలాన్ని పాలించాడు. అతడే ఇందూరు కోటతో పాటు కౌలాస్‌ కోటను నిర్మించాడు. ఇతని కాలంలోనే బిచ్కుందలో నగరేశ్వరాలయం, బోర్గాంలో బసవేశ్వరాలయం నిర్మించబడ్డాయి

 

 

37) ఔరంగజేబ్‌ కౌలాస్‌ కోటను వశపరచుకుని తన పాలకునిగా రాజా పథం సింగ్‌ను నియమించాడు. 16వ శతాబ్ధంలో ఈ కోట రాజా గోపాల్‌సింగ్‌ గౌర్‌ అనే రాజపుత్ర రాజు ఆధీనంలోకి వెళ్ళి అనేక సంవత్సరాల పాటు అనగా దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకూ రాజపుత్రుల ఏలుబడిలోనే కొనసాగింది. రాజాగో పాల్‌సింగ్‌ అనంతర కాలంలో మహారాష్ట్రంలోని కాంధార్‌, మా హోర్‌ సంస్థానాలను ఆక్రమించి తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఆయన పాలనలో కోట మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. శిథిల కట్టడాల పునర్నిర్మాణం జరిగింది. ఈ కోటకు చివరి పాలకుడు రాజా దుర్జన్‌ సింగ్‌.

 

 

38) 1857వ సంవత్సరంలో ఈ కోటను ఏలుబడిలోకి తీసుకున్న రాజానీల్‌ సింగ్‌ కుమారుడైన రాజా రాజ్‌దీప్‌ సింగ్‌ ఇక్కడి నుండి భారతమాత సంకెళ్ళు విముక్తి కోసం, భారత స్వాతంత్య్రం కోసం బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా పోరాడాడని చరిత్ర కారుల కథనం. ఆయన ఇందు కోసం ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశాడు. దాంతో ఈ కోట భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాల్గొని భారత దేశం కోసం పోరాడిన మొదటి సంస్థానంగా చరిత్రలో పేరు సంపాదించుకుంది.

ఈ విషయం తెలిసిన ఆంగ్లేయులు రాజాదీప్‌ సింగ్‌తోపాటు ఆయనకు సహకరించిన సఫారుద్ధౌలా, శేఖ్‌మదార్‌, నార్ఖేడ్‌ గ్రామ పట్వారి శ్రీరంగారావు మొదలైన దేశ భక్తులను బంధించి వారిపై హైదరాబాద్‌ హైకోర్టులో విచారణ కొనసాగించారు. వారిని విప్లవకారులుగా, కుట్ర దారులుగా కోర్టులో నిరూపించి కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రకంగా ఈ కోట ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి అంకురార్పణ చేసింది.

39) తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్దంలో క్రమశిక్షణతో తీర్చిదిద్దిన మహనీయుడు ముద్దు రామకృష్ణయ్య. 1907 అక్టోబరు 18న కరీంనగర్‌ జిల్లాలోని పవిత్ర గోదావరీ తీరంలోని మంథనిలో పుట్టిన ఈ జాతిరత్నాన్ని గూర్చి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

1933లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆయన 1939లో కరీంనగర్‌లో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణా ధికారిగా పదోన్నతిని పొంది పాఠశాల విద్యా సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 1944లో యూరప్‌కు వెళ్లి పాఠశాలల ప్రమాణాలపై అధ్యయనం చేశారు. ఆ తరువాత మాతృదేశంలో అడుగుపెట్టి ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా కరీంనగర్‌, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాలలో పనిచేసి పాఠశాల విద్యానిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారు.

 

 

 

40)

ఓరుగల్లు తివాచీల తయారీకి ప్రసిద్ధి. ఓరుగల్లు రాజ్య విశేషం ఎంత ప్రసిద్ధిగాంచిందంటే మహారాణి రుద్రమదేవి కాలంలో జెనివాకు చెందిన ప్రపంచ పర్యాటకుడు మార్కోపోలో వరంగల్‌ కోటలోని విశేషాలను తెలియజేస్తూ ”కాకతీయుల రాజ్యంలో అద్భుతమైన, శ్రేష్ఠమైన వస్త్రాలు నేస్తారు. ప్రపంచంలో ఈ వస్త్రాలను ధరించని రాజ వంశస్తులు ఎక్కడాలేరు” అని అన్నాడు.

 

 

41) ఓరుగల్లు కోట ప్రణాళికాబద్ధ నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాకతిగణపతిదేవ చక్రవర్తి ప్రారంభించాడు. 1199వ సంవత్సరంలో ఆయన కోట నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమార్తె రాణీ రుద్రమదేవి అప్రతిహతంగా కోట నిర్మాణాన్ని కొనసాగించి పూర్తి చేశారు.

 

 

42) ఈ వరంగల్‌ కోట కోటకు మూడువైపులా మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ మనం చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసింది. దీనిని ‘ధరణి కోట’ అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండో ప్రాకారంలో వున్నది ‘రాతి కోట’ ఇది గ్రానైట్‌ రాళ్ళతో నిర్మించబడింది. ‘రాతి కోట’కు పెద్ద పెద్ద ఏక శిల రాతి ద్వారాలున్నాయి. ఈ ద్వారాల ఎత్తు సుమారు 30 అడుగులు వుండి పూర్తిగా ఏకశిలతో నిర్మితమయ్యాయి.

 

 

43) వరంగల్‌ కోట ప్రాంతానికి కూతవేటు దూరంలో 17 స్నానాల బావులున్నాయి. ప్రస్తుతం అందులో నాలుగు బావుల ఆనవాళ్ళు మాత్రమే మనకు దర్శనమిస్తాయి. అక్కాచెల్లెళ్ళ బావి, కోడిపుంజు బావి, భోగం బావి, గుర్రాల బావిగా పిలవబడే ఆ నాలుగు బావులు కోట పరిసర ప్రాంతాలలో వుండటం వలన మాత్రమే అవి మనకు కనిపిస్తాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన బావి 4 అంతస్తుల బావి. కోటకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బావికి ‘రాణీ రుద్రమ బావి’ అని పేరు. ఈ బావి నాలుగు అంతస్తులతో అనేక స్నానపు గదులతో నిర్మించబడింది. ఆ గదులు రాణిగారి స్నానపు గదులుగా చెప్పబడుతున్నాయి. గతంలో రాణీ వాసపు స్త్రీలు ఈ బావిలోనే స్నానం చేసేవారు. ఈ గదులను ఆనుకుని దుస్తులు మార్చుకోవడానికి బావి దిగువ భాగంలోనే అందమైన రాతి నిర్మితమైన మరికొన్ని రాతి గదులున్నాయి.

 

 

 

44)మంటి పనికైనా ఇంటివాడు ఉండాలె అనేది తెలంగాణ సామెత. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఈ సామెతను ఎట్లా చెబుతున్నారో తెలియదు. ఎంత చిన్నపనికైనా మన ఇంటివాడు ఉన్నప్పుడే అది చక్కగా నెరవేరుతుంది. ఏ రకమైన ఆటంకాలూ, అడ్డంకులూ లేకుండా ఎంచక్కా పని పూర్తయిపోతుంది. ఇంటివాడికీ, పరాయివాడికీ చాలా తేడా ఉంటుంది కదా!

మంట్లె,’ ‘మంటి పొయ్యి,’ ‘మంటి పని..’ ఈ పదాలు ఇతర ప్రాంతాల్లో మట్టిలో, మట్టిపొయ్యి, మట్టిపని అని వ్యవహ రించబడతాయి. ‘మన్ను’ నుండి వచ్చినవే ‘మంట్లె’ మొదలైన ఔపవిభక్తికాలు

45) తెలంగాణ కాశ్మీర్‌గా భావించే అడవుల జిల్లా ఆదిలాబాద్‌ మొదలుకొని, మహబూబ్‌నగర్‌ వరకు ఎంతో ఘనమైన చారిత్రక వారసత్వ సంపదలకు తెలంగాణ రాష్ట్రం నిలయం.

 

 

46)

ఆదిమ గిరిజన గోండుల సాంప్రదాయాలకు మూలంగా భావించే ఆదిలాబాద్ జిల్లాలోని ‘సిర్పూర్’ ప్రాంతం దేశంలోనే మొట్ట మొదటి ‘గోండు’ రాజ్య సామ్రాజ్య స్థాపనకు నెలవైంది.

సిర్పూర్‌’ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘సిర్పూర్‌ పేపర్‌ మిల్‌’. భారతదేశంలో అతి పెద్ద పేపరు కర్మాగారం. 1942లో కాగజ్‌నగర్‌లో స్థాపించబడింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కి సుమారు 308 కి.మీ. దూరంలో ఆదిలాబాద్‌ జిల్లాలో వున్న సిర్పూర్‌ కోట ‘సిర్పూర్‌’ పట్టణానికి తూర్పున వుంది. సిర్పూర్‌ని గతంలో ‘సూర్యాపురం’గా పిలిచేవారు. ఒకప్పుడు ఇదంతా దండకారణ్య ప్రాంతం కాబట్టి 1200 సంవత్సరాల క్రితం ఇక్కడి ఆదిమజాతి గిరిజనులు నాగరికతకు కొంత దూరంగా ఉండేవారు

 

 

47)

జనుగాం, సిర్పూర్‌ ప్రాంతంలో విడిపోయి బతుకుతున్న గిరిజనులను అందరినీ ఒక్కతాటి మీదికి తీసుకువచ్చిన రాజగోండు నాయకుడు ‘భల్లాల’. తమకంటూ ఒక రాజ్యం ఉండాలని భావించి సిర్పూర్‌ని మొట్ట మొదటగా తన గోండు సామ్రాజ్య స్థావరంగా ఎంచుకొని కోట నిర్మాణానికి నాంది పలికాడు. ఇతని పూర్తి పేరు ‘భీమ్ భాల్లల సింగ్’. దాదాపు 9వ శతకంలో ఈ కోటను ‘భీమ్ భాల్లల సింగ్’ నిర్మించినట్టు మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సిర్పూర్‌ కోటకు సంబంధించిన ముఖద్వారం నేటికీ శిథిలావస్థలో మనకు కనబడుతుంది.

 

 

48)

డెక్కన్‌ ప్రాంతం భారత దేశంలో విలీనం అవకముందు ఈ ‘సిర్పూర్‌ తాండూర్‌’ ప్రాంతమంతా ‘నోనార్‌తాండా’ సామ్రాజ్యంలో వుండేది. అనంతరం ప్రస్తుత ఆదిలాబాద్‌ (ఎదులపురం)లో విలీనం అయింది. గతంలో ఎదులాపురంగా ఉన్న ఆదిలాబాద్‌, బీజాపూర్‌ సుల్తాన్‌, అలి అదిల్‌షా పేరు మీదుగా ఆదిలాబాద్‌గా మార్పు చెందింది. ‘అలి అదిల్‌షా’ బీజాపూర్‌ ప్రాంత సామ్రాజ్యానికి సుల్తాన్‌గా వుండేవారు.

1724 ప్రాంతంలో నిజాం ఇ ముల్క్‌, ముబారిజ్‌ ఖాన్‌ని ఓడించి దక్కన్‌ ప్రాంతానికి చక్రవర్తిగా వ్యవహరించి దర్గాలు, మసీదుల నిర్మాణాలను మొదలుపెట్టాడు. అయితే 1773లో మల్సోజి భోంస్లే తన సామ్రాజ్యాన్ని (రాజూరా – చంద్రాపూర్‌) ఒప్పందాన్ని అనుసరించి నిజాం అలీ ఖాన్‌కి అప్పగించాడు. అయితే రాంగోజి భోంస్‌లేకి, బ్రిటీషు పాలకులకు మధ్య వచ్చిన యుద్ధం వాతావరణం కారణంగా, అతడు నిజాంల మద్దతు కోరగా, నిజాం అతనికి సాయపడ్డాడు. ఆ విధంగా డెక్కన్‌ ప్రాంతంలో వున్న గోండ్వానా ప్రాంతం నిజాంల చేతుల్లోకి వెళ్ళింది.

 

 

49)

జనుగాం, తిర్యాని, వాంకిడి, కేరామేరి, గాంధారి ఖిల్లా, తాండూరు, సిర్పూరు ప్రాంతాల్లో చెల్లా చెదురుగా ఉన్న గోండులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి వారిని ఒక జాతిగా నిలబెట్టింది మాత్రం గోండు సామ్రాజ్యపు మొదటి రాజు ‘కోల్‌బిల్‌’. అతని అద్భుత సామర్థ్య నైపుణ్యాలే గోండులను ఒక బలమైన శక్తిగా ఒక జాతిగా నిలబెట్టింది.

కోల్‌ బిల్‌’ గోండులను చైతన్యపరిచి, వారిని వికాసవంతుల్ని చేయటానికి నిరంతరం కృషి చేశారు. ఆ మార్గంలోనే మిశ్రమలోహాల నుండి ఇనుమును వెలికితీసే విద్యను వారికి నేర్పించాడు. ఇది వారి జాతి సాధించిన మొదటి విజయంగా గోండులు భావిస్తారు. కోల్‌బిల్‌ స్పూర్తితో గోండులు ఎంతో పరివర్తన చెంది వారి జీవితాల్ని వికాసవంతం చేసుకున్నారు. ఈ నూతన ప్రక్రియని వారిని సొంత ఆయుధాలను తయారు చేసేవరకు తీసుకెళ్ళి వారిలో సొంత సామ్రాజ్య కాంక్షను కలిగేలా చేసింది. ఆ కాలంలో వారి చుట్టూ నెలకొని వున్న వివిధ సామాజిక పరిస్థితులే వారి స్వరాజ్య కాంక్షకు కారణమయ్యేలా చేసి వారిని చైతన్యవంతుల్ని చేసింది. ఈ ఇనుము పరికరాల తయారీ మూలంగా వీరిని చూసి ఇతర సామ్రాజ్య రాజులు సైతం భయపడేలా చేసింది. గోండు సామ్రాజ్య విస్తరణలో ఎక్కువగా తోడ్పడింది. గోండు సామ్రాజ్య మొదటి ముగ్గురు రాజులు ‘భీమ్‌ భల్లాల్‌ సింగ్‌, కార్జా భల్లాల్‌ సింగ్‌, హీర్‌ సింగ్‌’. ఇందులో కార్జా భల్లాల్‌ సింగ్‌ కొంచెం మృదుస్వభావం గల వ్యక్తి. అయితే కార్జా కొడుకైన హీర్‌ మాత్రం వివేకవంతుడు, అతను ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోయాడు. మొట్టమొదటిసారి భూమి శిస్తు విధానాన్ని వారి సామ్రాజ్యంలో అమలు చేసిన నాయకుడు ఇతడే. ఇతడు ఆదియా భల్లాల్‌ సింగ్‌పై పోరాడి అతన్ని ఓడించాడు. ఆదియా భల్లాల్‌ సింగ్‌ ఒక క్రూర స్వభావం గల వ్యక్తి.

ఈ ఆదియా భల్లాల్‌ సింగ్‌ తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో తన సామ్రాజ్యపు రాజధానిని సిర్పూర్‌ నుండి ‘భల్లార్షా’కు మార్చాడు. ఇతని పేరుమీదుగానే ఆ ప్రాంతానికి ‘భల్లార్షా’గా పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి

50)

కోటని తన సైనిక, ఆర్ధిక స్థావరంగా ఏర్పరచుకున్నాడు. అయితే గోండు రాజుల సామ్రాజ్యాన్ని స్థాపించిన ‘కుల్‌ బిల్‌’ గోండు సామ్రాజ్యాన్ని ‘సిర్పూర్’ (తెలంగాణ ప్రాంతం) కేంద్రంగా రాజ్య స్థాపన చేశారు.

18 మంది గోండు రాజులు 870 నుండి 1751 వరకు అంటే సుమారు 880 సంవత్సరాల పాటు పాలించినట్టు చారిత్రక ఆధారాలు లభించాయి. ఈ రాజులు మొదటగా సిర్పూర్‌ అనంతరం బల్లార్షా ఆ తర్వాత చంద్రాపూర్‌ కేంద్రంగా తమ పాలన కొనసాగించినా మొదటి కోట సిర్పూర్‌పై మాత్రం వారికి ప్రత్యేక అభిమానం ఉండేది. గోండు రాజ్య స్థాపన అధికారికంగా క్రీ.శ. 870లో సిర్పూర్ రాజధాని కేంద్రంగా జరిగినా సిర్పూర్‌ కోటలో వారు క్రీ.శ. 1242 వరకే పాలించారు.

సిర్పూర్ సామ్రాజ్యం క్రింద తాండూర్, గాంధారి, జునగాం, దవేదుర్గం, వెల్లి మొదలైన ప్రాంతాలు ఉండేవి. ఆయా ప్రాంతాల్లో సామంతరాజులు సిర్పూర్‌ రాజులకు కప్పం కడుతూ పరిపాలనను కొనసాగించేవారు. ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కుకవగా గోండుల ఆధిపత్యమే ఉండేది. ఇతర రాజుల దండయాత్రలు గోండు రాజులపై మొదలైన తర్వాత వివిధ కులాలవారు, మతాలవారు ఈ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభమైంది. గోండు రాజులు తమ పాలన సజావుగా సాగటానికి పాలనలో మంత్రులుగా, సలహాదారులుగా నియమించుకోవడానికి, వార్ధా, నాగ్‌పూర్‌ ప్రాంతాల నుండి కొంతమంది బ్రాహ్మణులను, షావుకార్లను రప్పించుకున్నారు. బల్లాల్‌షా తన రాజదానిని బల్లార్షాకుమార్చటంతో సిర్పూర్‌ కోట కొంత కాలం పాటు రాజులు లేకుండా ఉండిపోయింది. పరిపాలనా సౌలభ్యం కోసం బల్లాల్‌ షా సిర్పూర్‌లో గోండు సామంత రాజులను కొనసాగించాడు. ఆ రాజులు కోటను పటిష్టపరచి సిర్పూర్‌ ప్రాంతంలో గోండు రాజ్య విస్తరణ జరిగేలా కృషి చేశారు.

 

 

51) చీరల తయారీలో గద్వాల మన రాష్ట్రానికే పేరు తెచ్చింది. జరీ అంచుతో తళుకులీనే నూలు చీరలకు గద్వాల చేనేత కార్మికులు పెట్టింది పేరు. ఆ కాలంలోనే చేనేత కార్మికులను సంస్థానాధీశులు ప్రోత్సహించేవారు

 

 

52)

రీ అంచుతో పట్టుచీరలను నేసిన నైపుణ్యం ఇక్కడి కళాకారుల స్వంతం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 6 వరకు సంస్థానాలున్నాయి. అందులో గద్వాల సంస్థానం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.

మహబూబ్‌నగర్ జిల్లా గుండా ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య విస్తరించి ఉన్న గొప్ప కోట గద్వాల. జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత కలిగిన సంస్థానం ఇది.

గద్వాల, సింగప్ప, సిద్ధావురం, అహోబిలం, బండి ఆత్మకూరు, సిరిసిల్ల ప్రాంతాలు సహా 100 గ్రామాలు గద్వాల సంస్థానంలో ఆనాడు వుండేవి. 1663వ సం||లో పెద్దసామ భూపాలుడు ఈ విశాలమైన శత్రు దుర్భేద్యమైన కోటను కట్టించాడు.

53) 17వ శతాబ్దంలో ‘పెద్దిరెడ్డి’ గద్వాల ప్రాంతానికి నాడేగౌడ్‌’గా ఉండేవాడు. ఈయన వూడూరి నాడేగౌడ్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పూడూరు సంస్థానాన్ని 49 సం||ల పాటు పాలించిన పెద్ద సామ భూపాలుడు. పెద్ద సామ భూపాలుడి పేరే చరిత్రలో సోమనాద్రిగా కనిపిస్తుంది. 1663 – 1712 సం||ల మధ్య కాలం వరకు అంటే 49 సం||ల పాటు గద్వాల సంస్థానాన్ని ఆయన పరిపాలించారు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు సంతానం కలగకపోతే. రెండవ భార్య కుమారులు రాజాతిరుమలరావు, రాజారామారావులు ఆయన వారసులుగా తరువాతి కాలంలో గద్వాల కోటను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. 

 

 

54) భద్రాద్రి రాముడికి గుడిగోపురాలు, ప్రాకారాలు, బంగారు నగలు చేయించిన రామభక్త శిఖామణి వాగ్గేయకారుడు కంచెర్ల గోపన్న (రామదాసు) క్రీ. శ. 1674 సంవత్సరంలో భద్రాచలంలో రామాలయం నిర్మించారు

 

 

55) గోదావరికి ఉప నది అయిన మంజీరా నది మెదక్‌ జిల్లాలో 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుండగా కొల్చారం మండల పరిధిలోని ఘనపూర్‌ ఆనకట్ట దిగువన, పాపన్నపేట మండ

లం నాగ్సానిపల్లి గ్రామ శివార్లలో ఏడుపాయలుగా చీలిప్రవహించి కొద్ది దూరం తరు వాత మళ్లీ పాయలన్నీ ఏకమై ముందుకు సాగి పోతు ంది. ఇలా ఓ నది ఏడు పాయలుగా చీలి మళ్లీ ఒకచోట కలిసి ప్రవహించ డం దేశంలో ఇక్కడ తప్ప మరె క్కడా లేదు. మహాభారత కాలంలో జనమేజయ మహా రాజు ఇక్కడ సర్పయాగం చేసినట్టు చారిత్రక ఆధారా లున్నాయి.  ఇలాంటి అరుదైన ప్రదేశంలోనే మంజీరా నదీ పాయ ఒడ్డున రాతి గుహలో వనదుర్గామాత కొలువైంది

 

56) దేవరకొండ కోట నల్గొండ జిల్లా చరిత్రాత్మక వైభవాన్ని గూర్చి సగర్వంగా సకల

జనులకు తెలియజెప్పే గొప్ప కోట

ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు

కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్ల పై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు

కొండల ప్రాంతాల నడుమ సుమారు 52? ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి వుంది.

కాకతీయ రాజుల

ఏలుబడిలో దేవరకొండ కోట చాలాకాలం పాటు ఉంది.

కాకతీయులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాచకొండ

కోటతో పాటు దేవర కొండ కోటను కూడా వారు తమ వశం

చేసుకున్నారు. సుమారు 1230 సంవత్సర ప్రాంతంలో

దేవరకొండను ఆధారంగా చేసుకొని కాకతీయులు తమ రాజ్య

పాలనను గావించారం ట ే ఈ కోట ప్రాదాó న్యత ఎంతట ది ో మనం

అరశీవం చేసుకోవచ్చు. దాదాపు 290 సంవత్సరాల పాటు

దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే వుండి అనేక

విధాలుగా తీర్చిదిద్దబడింది. 

నల్గొండ రాజ్యాన్ని 156 సంవత్సరాల పాటు, దేవరకొండ రాజ్యాన్ని

150 సంవత్సరాల పాటు వారు పాలించారు. దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొనిపాలించినవారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు.

పద్మనాయక రాజులలో 6వ తరంవారైన ఎర్రదాచమనేని

మాదనాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టు

చారిత్రక కథనం. ఈ తరం తరువాతి వారైన సింగమ

నాయకుడు, అనపోత నాయకుడు, వేదగిరి నాయకుడులతో

పాటు 3వ మాద నాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు

పంచుకున్నారు.

గోడలపై రాతి నిర్మాణాలలో సింహం,

అశోక చ కం , చపే , నాగస ర ా్పల్లాం ట ి పల ు గు రు ల్త ు, నిర్మాణాలు

మనకు కనిపిస్తాయి. వీటిలోని పూర్ణ కుంభం, సింహపు

నిర్మాణాలు రేచర్ల పద్మనాయకుల ధర్మనియమబద్ధమైన

రాజ్యపాలనకు వారి రాజ చిహా ్నలుగా మనకు కని పసి ార్త ుు. చపే

మరియు తాబేలు వారి ధర్మనిరతిని తెలియజేస్తాయి. 

 

 

57) జల్‌- జంగిల్‌ -జమీన్‌’ కోసం పోరాడిన ఆదివాసీ యోధుడు కొమురం భీం

 

 

58) కొండా వెంకటరంగారెడ్డి 1891 డిసెంబర్‌ 12న ఆనాటి అత్రాఫ్‌ బల్దా (ఈనాటి రంగారెడ్డి జిల్లా) మంగళారం గ్రామంలో జన్మించాడు. ప్లీడరీ చేసే రోజుల్లో రంగారెడ్డి వకీళ్ళను తయారు చేసేలా క్లాసులు నడిపాడు. కోత్వాల్‌ వెంకటరామారెడ్డి అంతటి వ్యక్తికి న్యాయ సలహాదారుగా ఉండేవాడు. ఆంధ్రపితామహా మాడపాటి వారిపై రంగారెడ్డిని గురుభావం ఉండేది. అందుకనే 1946లో ఆంధ్రపితామహుని షష్టిపూర్తిని హైదరాబాద్‌లో ఘనంగా జరిపించి ఆ విధంగా తన గురుదక్షిణ చెల్లించుకున్నాడు.

బూర్గుల మంత్రి వర్గంలో ఆయన రెవిన్యూ, ఎక్సయిజు శాఖలు నిర్వహించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఏ మాత్రం రాజీపడని రంగారెడ్డి చివరకు పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయవలసివచ్చింది. రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ పితగా పేరు తెచ్చుకున్న కొండా వెంకటరంగారెడ్డి 1970 జూలై 24వ తేదీన కన్నుమూసాడు.

 

 

59)

నల్గొండ జిల్లా నిండా ఎంతో చరిత్ర దాగి ఉంది. అలాంటి జిల్లాలో భువనగిరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. భువనగిరి ఖిల్లా నల్గొండ జిల్లా గుండెలమీద తలెత్తుకున్న ఆత్మగౌరవ కోట. హైదరాబాద్‌ – వరంగల్‌ వెళ్ళే మార్గమధ్యలో ఒక గ్రానైట్‌ కొండపై అద్భుత రాతి నిర్మాణం రాజదర్పంలా కనిపిస్తుంది అదే భువనగిరి ఖిల్లా. అనేక రాజవంశీయుల పాలన ఈ కోట కేంద్రంగా కొనసాగింది

 

పశ్చిమ చాళుక్యరాజైన 6వ త్రిపుర విక్రమాదిత్యుడు 12వ శతాబ్ధంలో ఈ కోట నిర్మాణానికి నాంది పలికాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అందువలనే త్రిభువనగిరిగా ఏర్పడిందని చరిత్ర విశ్వాసం. తదనంతరం నవాబుల పాలనలో భువనగిరిగా పరిణామం చెందింది. ఈ భువనగిరి కోట కళ్యాణచాళుక్యుల పరిపాలనలో వారి సామంతుల ఆధీనంలో ఎక్కువ కాలం ఉంది.

 

 

60)

 

చివరి వరకూ ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం పోరాటం చేసిన రాజులలో ‘రాజ్‌గోండ్‌’లు కూడా ముందు వరుసలో నిలుస్తారు. అలా వారు నిర్మించుకున్న కోటలలో ఆదిలాబాద్‌ జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని ‘గాంధారి ఖిల్లా’ ఒక్కటి. మంచిర్యాల నుండి ఆసిఫాబాద్‌కి వెళ్ళే దారిలో బొక్కలగుట్ట నుండి 5 కి.మీ. దూరంలో కనిపించే ఈ కోట బొక్కలగుట్టకు దగ్గరలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 3 కిలోమీటర్లు నడిచి వెళ్తే తప్ప ఈ ఖిల్లాను చేరుకోలేం. కోటకు వెళ్ళే మార్గం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల బృందంగా వెళ్తేనే మంచిది. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిన కోట అని తెలుస్తోంది. గోండు రాజులు ఈ గాంధారి ఖిల్లాను కేంద్రంగా చేసుకొని చుట్టుప్రక్కల ప్రాంతాలను చాలా సంవత్సరాలపాటు పాలించారు. కొంత కాలం పాటు వడ్డెరాజులు, రెడ్డిరాజులు కూడా ఈ ఖిల్లా కేంద్రంగా తమ పరిపాలనను కొనసాగించిన వారిలో నిలుస్తారు

కోటపై మరో ప్రధానాకర్షణ కొండను తొలచి నిర్మించిన నాగశేషుడి ఆలయం. సుమారు 8 అడుగుల ఎత్తులో 12 అడుగుల నాగశేషుని విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా, నయన మనోహరంగా ఉంటుంది. గిరిజనులు నాగశేషుడికి కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం పక్కనే మూడు బావులుంటాయి. స్థానికులు వీటిని ‘సవతుల బావుల’ని పిలుస్తారు. చాలా పురాతన బావులైనప్పటికీ అవి కొంచెం కూడా చెక్కుచెదరలేదు. వేసవిలో కూడా వీటిలో నీరు నిలువ వుంటుంది.

 

 

 

61)

ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ (ఒకనాడు జున్‌గావ్‌గా పిలిచే వారు) పట్టణానికి చెందిన పైకాజీ, దండనాయకుల వెంకటరావు శ్రీమతి పెద్దుబాయి దంపతులకు 1889 మార్చి 12వ తేదీన జన్మించాడు. ఆయన జన్మించిన రోజు తెలంగాణ ప్రాంతం అంతా సంబరాలు జరుపుకుంది.

కొమురం భీము’ తరఫున వకాల్తా చేసింది పైకాజీనే.

1948వ సం||లో నిజాం రాష్ట్రం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. 1948 సెప్టెంబర్‌ 14వ తేదీన ఇండియన్‌ ఆర్మీ చాందావైపు నుండి ఆసిఫాబాద్‌ వైపు రాసాగింది. రజాకార్లు ‘బుజ్జిర్‌ఘాట్‌’ బ్రిడ్జిని పేల్చివేసి భారతసేనలు ఇటువైపు రాకుండా తీవ్ర అడ్డంకులు కల్పించారు. పైకాజీ నాయకత్వంలో యువకులు, రజాకార్ల చర్యలను తిప్పికొట్టి ఇండియన్‌ ఆర్మీకి స్వాగతం పలికారు. రజాకార్లు తోక ముడిచి పారిపోయారు

1973 అక్టోబర్‌ 10వ తేదీన తన 87 సంవత్సరాల వయస్సులో ఈ ‘ఆదిలాబాద్‌ గాంధీ’ తుది శ్వాస తీసుకున్నాడు. జీవించినన్నాళ్ళూ పేద ప్రజల సేవే శ్వాసగా భావించి, గిరిజనుల ప్రగతే లక్ష్యంగా భావించి తెలంగాణ రాష్ట్రం కోసం కలలుగన్న రాంచందర్‌ రావు పైకాజీ నిజమైన తెలంగాణ త్యాగధనుడు.

 

 

62) మాడపాటి వారు 1885 సంవత్సరం జనవరి 2వ తేదీన జన్మించారు. ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోగా, సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్న మేనమామ దగ్గర పెరిగారు. హన్మకొండలోని ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసయ్యారు. అనంతరం వరంగల్‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు 40 రూపాయల వేతనంపై మీర్‌మున్షీ (హెడ్‌క్లర్క్‌) ఉద్యోగంలో చేశారు. ఎనిమిది సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉండి హైదరాబాద్‌కొచ్చి ‘లా’ పరీక్ష ప్యాసై ప్రాక్టీసు పెట్టారు. వకాలత్‌ విడిచి పెట్టేనాటికి ఆయనకు నెలకు ఆరువందల ఆదాయం వచ్చేది. పంతులుగారి సేవ రాజకీయ పార్టీల ద్వారా జరగలేదు. నిర్మాణాత్మకమైన సంస్థలద్వారా జరిగింది.

నిజాం రాష్ట్ర ఆంధ్రజనసంఘం అధ్యక్షుడు రావు బహదుర్‌ సామల వెంకటరెడ్డి, కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఒక దీపం వెలిగింది. ఒకానొక పరాభవాగ్నిలోంచి పుట్టింది నిజాం ఆంధ్రోద్యమం. అది 1921 సంవత్సరం నవంబరు 12వ తేది వివేక వర్ధనీ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్‌ హిందూ సంస్కార సభ జరుగుతున్నది.

రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1951లో హైదరాబాద్‌ నగర పాలక సంఘానికి పంతులుగారు తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఆయన వెంట ఈ పదవికి మూడు సార్లు ఎన్నికవుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ అధ్యక్షునిగా మాడపాటివారు ఆరేళ్ళు ఆ పదవిలో ఉండి, ఉన్న త ఆదర్శాలతో సభ్యులందరికి మన్ననలు పొందారు.

శాసన మండలి అధ్యక్ష పదవీ విరమణ అనంతరం పంతులుగారు విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ 1970 నవంబరు 11వ తేదీన తమ 86వ ఏటా కాల ధర్మం చెందారు.

 

 

 

 

64) పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో జన్మించిన మేధావులలో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి నవాబు అలీ నవాజ్‌ జంగ్‌. ‘ముల్కీ’ నిబంధనలు అడ్డురాకపోతే ఆయన మరో ఆర్థర్‌ కాటన్‌ అయ్యేవారు, మరో విశ్వేశ్వరయ్య అనిపించుకునేవారు. నిజాంసాగర్‌, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, పాలేరు, వైరా, తుంగభద్రా, రాజోలిబండ, కడెం, అలీసాగర్‌, మూసీ, మానేరు – అలీ నవాజ్‌ జంగ్‌ ప్రతిభకు నిలిచిన ప్రాజెక్టులు. ఇందులో ఏ రాయిని తట్టినా ఆయన రూపమే ప్రతిఫలిస్తుంది. అందుకే ఆయన ‘దక్కను భగీరథుడు’.

అలీ నవాజ్‌ జంగ్‌ అసలు పేరు మీర్‌ అహమద్‌ అలీ. ఆయన 1896 జులై 11వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన ప్రతిభను మెచ్చి నిజాం ప్రభుత్వం ఆయనకు ‘అలీ నవాజ్‌ జంగ్‌’ అనే బిరుదు ప్రసాదించింది. ఆ పేరే స్థిరపడిపోయింది.

 

 

65)

తెలంగాణ పోరాటంలో పాల్గొన్న దాశరథి కృష్ణమాచార్యులు ధైర్యంతో ‘‘మా నిజాం నవాబు జన్మజన్మాల బూజు’’ అని నిరసన గళమెత్తినందుకు చేతుకు బేడీలు వేయబడ్డాయి. మానుకోట బిడ్డగదా! పౌరుషానికేం తక్కువ? అవును! దాశరథి పుట్టింది తెలంగాణ మాగాణిలోనే! అదీ – వరంగల్‌ జిల్లా మానుకోట తాలుకాలోనే! ఆ ఊరే గూడూరు! 1927వ సంవత్సరం, జులై 22న. యువరక్తం ఉరకలెత్తుతుంటే అక్షరాల్ని కత్తులుగా దూసి ‘అగ్నిధార’గా ‘రుద్రవీణ’గా ఎలుగెత్తి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ఒరవడి తెచ్చారు

ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజుమాకెన్నడేని –
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ! కోటి రత్నాలవీణ’

అంటూ ప్రభుత్వాన్నెదిరించడానికి బొగ్గుతో జైలు గోడ మీద వ్రాసిన దాశరథి తన జీవితంలో ఎన్నో మజిలీలు చేసి, చివరికి 1987 నవంబర్‌ 5న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

 

 

అలీ నవాజ్‌  జంగ్ గుర్తుండి పోయేలా ఆయన పుట్టిన రోజు జులై 11ని తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెంగాణ ఇంజనీర్స్‌ డే’ గా జరుపుకుంటున్నది.

 

 

66) అంటరానివారుగా హిందువులు దూరంగా ఉంచిన వారిని ‘‘ఆది హిందువులు’’గా ఈ పవిత్ర భారతదేశంలో తొట్టతొలుత నివసించిన సంతతిగా భాగ్యరెడ్డి వర్మ నిరూపించారు. ఈ క్రమంలో తెలుగుదేశంలో యుగయుగాలుగా నివసిస్తున్న దళితులే ఆదివాసులని, అసలు సిసలు భూమిపుత్రులని చాటారు. స్వాతంత్య్రానికంటే పూర్వమే 1906లో ‘‘జగన్‌మిత్ర మండలి’’ అనే సంస్థను ఆయన నెలకొల్పారు. దాన్నే ఆ తర్వాత ఆయన 1911లో ‘‘మన సంఘం’’గా మార్చారు. చివరికి దాన్ని ‘‘ఆది హిందూ సాంఘిక సేవా సంస్థ’’గా 1922లో తీర్చిదిద్దారు. అంటరానితనంపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. మాదిరి వెంకయ్యగారి కుమారుడు భాగ్యరెడ్డి వర్మగా, ఎం.వి. భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధికెక్కాడు.

 

67) 1923లో ఆది హిందూ సామాజిక సంఘం సభకు అధ్యక్షత వహించిన శ్రీ గోస్వామి రాజాధర్‌ రాజ్‌గిరి జీ నరసింగ్‌జీ చేసిన వాగ్దానం మేరకు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ వంతెన సమీపంలో ఆది హిందూ భవనం నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఈ భవనంలో భాగ్యస్మారక బాలికోన్నత పాఠశాల పనిచేస్తున్నది.

 

68) శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ఉద్దండపిండం. ఉద్గ్రంథకర్త. సాహిత్య పరిశీలకుడేకాదు, చక్కని విమర్శకుడు. తెలుగు చదువే కరువైన దినాలలో నా సోదరులకు తెలుగు చదువుకునే హక్కున్నదని జబ్బచరిచి చెప్పిన గొప్పదనం. నిజాం నవాబు ఫర్మానాలకు నిలబడి యిదేమిటని తొలిసారి అడుగగలిగిన గుండె దిటవు ఆయనకే చెల్లింది. నిరంకుశ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ ‘గోలకొండ పత్రిక’ను నిర్వహించిన సాహసి ఆయన.’’ – సురవరం ప్రతాపరెడ్డి గురించి నార్ల వెంకటేశ్వరరావు

సురవరం ప్రతాపరెడ్డి అప్పటి గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉన్న బోరవెల్లి గ్రామంలో 1896వ సంవత్సరం మే 28 తేదీన తమ మాతామహుల యింట్లో జన్మించారు. కాని ఆయన స్వగ్రామం అలంపురం తాలూకాలోని ఇటిక్యాలపాడు. ‘మావూరు నీరులేని ఇటికాలపాడు’ అని చమత్కారంగా తమ వూరి గురించి ఆయన చెప్పుకునేవారు.

పత్రిక ప్రారంభోత్సవం జరపడానికి ఫలాన శుభసమయమని ప్రతాపరెడ్డి నిర్ణయించలేదు. రాజ బహదూర్‌కు ఏ రోజు విరామం దొరికితే అదే శుభ సమయమనుకున్నారు. 1926 మే 5వ తేదీన 10 గంటలకు పత్రికను ప్రారంభిద్దామని రాజా బహదూర్‌ హుకుం అయింది. అదే రోజు అదే సమయంలో పత్రిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ విధంగా పంచాంగంతో సంబంధంలేని శుభ ముహూర్తంలో గోలకొండ ద్వైవార పత్రిక ప్రారంభమైంది.

 

69) 1952 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. దానికి బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు. అందుకనే బూర్గులను తొలి ప్రజా ముఖ్యమంత్రి అన్నాము. డా॥ బూర్గుల రామకృష్ణారావు 1899 సంవత్సరం మార్చి 13వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి తాలూకా పడకల్‌ గ్రామంలో తమ మాతామహుల యింట్లో జన్మించారు. ఆయన స్వగ్రామం బూర్గుల. ఇంటిపేరు పుల్లమరాజువారు. పూణేలో చదువుకునే రోజుల్లో మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వూరిపేరే యింటిపేరైంది. అదే స్థిరపడిపోయింది

 

 

70)

 

మోటుపల్లి, బయ్యారం శాసనాలనను సరించి మొదటి ప్రోలరాజు అరిగజకేసరి అన్న తడ ప్రఖ్యాత బిరుదుమీదుగా ఒక తటాకాన్ని త్రవ్వించి దానికి కేసరితటాకమని పేరు పెట్టినాడు. వరంగల్లు జిల్లా మహబూబాద్‌ తాలూకాలోనికే సముద్రం (కేసరి సముద్రం) గ్రామ సమీపంలో దీనిని గుర్తించవచ్చు. మొదటి పోలరాజు కుమారుడు రెండవ బేతరాజు సెట్టికెరియ, కేసరి సముద్రం అనే రెండు చెరువులు వేయించినట్లు హనుమకొండ శాసనం తెలుపుతున్నది. రెండవ ప్రోలరాజు కూడా కొన్ని సాగునీటి చెరువులు త్రవ్వించి వాటిక్రింద భూములను దానం చేసినట్లు ఇదే శాసనంవల్ల తెలుస్తుంది. రుద్రదేవుడు ఉదయబోడుని పట్టణాన్ని జయించి అక్కడ ఒక పెద్ద చెరువును నిర్మించినట్లు హనుమకొండ శాసనం తెలుపుతున్నది. ఇపుడు హనుమకొండ బస్టాండు వద్ద కనిపించే చెరువును రుద్రదేవుని మంత్రి గంగాధరుడు నిర్మించినట్లు హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. తెలుగుచోడుల రాజధానిలైన నెల్లూరు, కృష్ణా జిల్లాలోని గణపురంవంటి ప్రాంతాలలో గణపతిదేవుడు అనేక తటాకాలు నిర్మించినట్లు ప్రతాపచరిత్ర తెలుపుతున్నది. ఈ కాలపు శాసనాలలో గణపతి సముద్రమనే పేరుతో గణపతిదేవుడు స్వయంగా నిర్మించినవి కాని, అతని సామంత, మాండలికులు నిర్మించినవి కాని అనేక తటాకాలు తెలుగు దేశమంతా కనిపిస్తవి.

పాలమూరు జిల్లాలోని బూదపురంలో మల్యాల గుండదండాధీశుడు తల్లిపేర బాచసముద్రాన్ని, భార్య కుప్పాంబపేర కుప్పసముద్రాన్ని, గణపతి దేవుని పేర గణప సముద్రాన్ని నిర్మించినట్లు, బూదపుర శాసనం తెలుపుతున్నది. నాగరకర్నూలులో కూడా కేసరి సముద్రంపేర కాకతీయులనాటి పెద్ద చెరువు పంటలు పండిస్తున్నది. ఆ కాలపు ఈ చెరువులన్నీ తెలంగాణలో ఇప్పటికి సాగునీటి వనరులుగా విశేషమైన పాత్రను నిర్వహిస్తూ భూమిని సస్యశ్యామలం చేస్తున్నవి.

71) పాకాల చెరువు:

ఈ చెరువు వరంగల్లు తూర్పున 50 కి.మీ. దూరంలో నర్సంపేట తాలూకాలో మానేరు పరీవాహక ప్రాంతంలో ఉన్నది. చెరువు నలువైపుల అడవి వ్యాపించి ఉన్నది. మొత్తం చెరువు కాలువలు 80 చదపు మైళ్ళు పరుచుకొని ఉన్నవి. చెరువు ఎండిపోయిన సందర్భాలు లేవు. ఇందులో మొసళ్ళు కూడా ఉన్నవట. ఈ చెరువు కట్టమీద శాసనం గణపతిదేవ మహారాజు కాలంలో ఆయన మంత్రి బయ్యన నాయకుడు, బాచమాంబల కుమారుడు అయిన జగదాలు ముమ్మడి నిర్మించినట్లు తెలుపుతున్నది.

  72) రామప్ప చెరువు:

వరంగల్లుకు 65 కి.మీ. దూరంలో, ములుగు తాలూకా పాలంపేట సమీపంలో ఈ చెరువున్నది. శా.శ. 1135లో (క్రీ.శ. 1213లో) దీనిని గణపతిదేవుని సేనాని రేచెర్ల రుద్రుడు నిర్మించినట్లు సమీపంలోని శివాలయంలోగల శాసనం తెలుపుతున్నది. ఈ చెరువు ప్రక్కనే ఉన్న సుప్రసిద్ధమైన రామప్ప దేవాలయాన్ని కూడా ఈ చెరువుతోపాటే నిర్మించారు.

73)

ఘనపురం చెరువు :

రామప్ప చెరువు నిర్మించిన కాలంలోనే దీని నిర్మాణం జరిగింది. దీని క్రింద సాగయ్యే భూమి 350 ఎకరాలు.

74) లక్ణవరం చెరువు :

కాకతీయుల కాలపు పెద్ద చెరువులలో ఇది ఒకటి. లక్ణవరం చెరువు, పాకాల చెరువు, ఖమ్మం జిల్లాలోని బయ్యారం చెరువులకు మూడు పెద్ద వాగులనుండి నీరు చేరుతుంది. ఒక పెద్ద పీఠభూమి ఆయకట్టుగా ఈ వాగులు మూడు దిక్కులకు ప్రవహిస్తున్నవి. గణపతిదేవుని సోదరి, నతవాడి రుద్రుని భార్య మైలాంబ బయ్యారం చెరువును వేయించింది. ఈ సందర్భంగా ఈమె వేయించిన శాసనం కాకతీయ వంశజుల తొలి చరిత్రను తెలుసుకొనే కొరకు ఎంతో ప్రామాణికమైంది.

75) కుందవరం గ్రామ సమీపంలో తన పేర గణపతి దేవుని మరొక సోదరి కుందమాంబకుంద సముద్రమనే చెరువును వేయించింది. గణపతిదేవుని సేనాని చౌండసేనాని వరంగల్లుకు 12 కి.మీ. దూరంలో కొండపర్తి గ్రామంలో చౌండ సముద్రమనే చెరువును నిర్మించినాడు. ఇతని భార్య మైలమ కరీంనగర్‌ జిల్లా కటుకూరులో ఒక చెరువును వేయించింది. రేచెర్ల వంశానికి చెందిన పిల్లలమర్రి సా మంతులు తమ మాన్యమైన నేటి నల్లగొండ జిల్లాలో ఎన్నో చెరువులను నిర్మించినారు. మాడపల్లికి చెందిన బొల్లయనాయకుడు వివిధ ప్రాంతాలలో ఏడు చెరువులను త్రవ్వించినట్లు తెలుస్తున్నది. వాస్తవంగా వరంగల్లు, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాదు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో చెరువులేని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు

 

 

76) పాలమూరుజిల్లా దుందుభీ నదీ తీరానగల సురభిలోని గండకాలువ క్రింది పొలాన్ని రుద్రమదేవి వద్ద భాంఢాగారికుడైన కరణం రామయ్య ఉమామహేశ్వరంలో కట్టించిన పంచమహాస్థానాలగుళ్ళకు అతని కుమారుడు దానం చేసినట్లు ఉమామహేశ్వర శాసనం తెలుపుతున్నది. మూసీనుండి మూసేటి కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండకాలువ, ఉటుం కాలువ, చింతలకాలువ మొదలైనవి శాసనాల్లో పేర్కొనబడినవి.

 

 

77)

మోట, రాట్నాలు, ఏతాములతో నీరు తోడి పంటలు పండిరచే పద్ధతి కాకతీయులకాలంలో ప్రచలితమై ఉండేది. లోతైన బావులనుండి నీరు చేదే కొరకు మోటకు, రాట్నాలకు ఎద్దులను వాడేవారు. దోసపాడు శాసనం ఒక రాట్నాన్ని అవసరమైన కలపతో, ఎద్దులతో దానం చేసిన విషయం ప్రస్తావించింది

 

78) యుద్ధమల్లజినాలయానికి, మధుపేశ్వరాల యానికి కాకతీయ ప్రథమ బేతరాజు, మొదటి ప్రోలరాజు రాట్నాలను దానం చేసిన సన్నివేశాన్ని శనిగరం శాసనాలు తెలుపుతున్నవి. అక్కడనే భీమేశ్వరునికి దండనాయకుడైన కొండమయ్య రాట్నాలను దానం చేసినట్లు మరొక శాసనంలో ఉన్నది. 

 

79) క్రీ.శ. 1108 నాటి వేములవాడ శాసనంలో మహామండలేశ్వర జగద్దేవరసు ఇల్లెందుకుంటను దానం చేసినట్టున్నది. ఒద్దిరాజు చెరువును స్వయంభూమల్లినాథ దేవునికి దానం చేసిన విషయం మగతల శాసనం తెలుపుతున్నది

 

 

80) చెరువులు, కాలువలు నిర్వహించేకొరకు ప్రభుత్వం శ్రద్ధ చూపేది చెరువుకట్టలు, తూములు, కాలువలకు మరమ్మతుల నిమిత్తమై వ్యక్తులను నియమించి, పుట్టికి కుంచం చొప్పున వారికి చెల్లించే విషయం శాసనాల్లో ప్రస్తావితమైంది.

 

 

 

81) బోడ వంశపురాజైన నన్నెచోడుడు ‘‘కుమార సంభవము’’ అనే గ్రంథాన్ని రచించాడని

 

 

82)

ఆబుల్‌ హసన్‌ తానీషా… వాళ్ళ నృత్యాన్ని చూసి ఇంకా అభివృద్ధి పరచండి అంటూ ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న  కుటుంబాల వారికి కూచిపూడి అగ్రహారాన్ని దానమిచ్చాడు. తానీషా ఇనాముగా ప్రకటిస్తూ ఫర్మానా జారీచేసిన కూచిపూడి అగ్రహారం భూములు కేవలం ఆరు కుటుంబాలకు మాత్రమే కాదు. అక్కడ వర్థిల్లిన వేదాంతం, వెంపటి, హరి, భాగవతుల, పసుమర్తి, జోశ్యుల, మహంకాళి, ఏలేశ్వరపు, చింతా, తాడేపల్లి, బొక్కా వారికి చెందిన పదకొండు వంశాలవారికి ఆ భూపంపిణీ జరిగింది.

 

 

83) మొదటి నిజాం ఢల్లీినుంచి దక్కను వస్తున్నప్పుడు ఆకలి దప్పులతో ఖుల్దాబాద్‌ సమీపంలో ఒక ఫకీరు కుటీరంలోకి వెళ్ళాడట. అప్పుడు ఆ ఫకీరు కొన్ని రొట్టెలు తెచ్చి నిజాం ముందు పెట్టాడట. ఏడు రొట్టెలు తినగానే నిజాం కడుపు నిండిపోయిందట. మరొకటి తినమని ఫకీరు ఎంతచెప్పినా నిజాం ఒక్క ముక్కయినా తినలేకపోయాడట. అప్పుడు ఆ ఫకీరు`నీ వంశం ఏడో తరంతో అంతరించి పోతుందని జోస్యం చెప్పి, తన భుజంమీద ఉన్న పసుపుపచ్చబట్ట నిజాం తలకు చుట్టి ఆశీర్వదించి పంపాడట. ఆనాటి పసుపు పచ్చబట్ట, దాని మధ్య గుండ్రటి రొట్టెముక్క నిజాం ప్రభుత్వ పతాకమైంది.

 

 

84) ఏడవ నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911లో రాజ్యాధికారం చేపట్టాడు. 1918లో రాష్ట్రంలో అభివృద్ధి శకం ప్రారంభమైంది. ఆ సంవత్సరమే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడిరది. మూసీనది వరదలను అరికట్టడానికి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లు కట్టారు. నిజాంసాగర్‌ నిర్మాణంతో ఏటా మూడు లక్షల ఎకరాలకు నీటిపారుదల వసతి కలిగింది. పాలేరు, వైరా, తుంగభద్ర, రాజోలిబండ, కడెం, మూసీ, మానేరు ప్రాజక్టులు ఉస్మాన్‌ అలీఖాన్‌ నిర్మించినవే. ఆ ప్రాజెక్టులు నిర్మించిన ఇంజినీరు అలీ నవాజ్‌జంగ్‌. బోధన్‌లో నిర్మించిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే పెద్దది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిజాం కట్టించినవే. ఈ భవనాల నిర్మాణంలో ఏడవ నిజాం, మొగల్‌ చక్రవర్తులకు ధీటు అనిపించాడు. 1944లో నిజాం ఆస్తుల విలువ రూ.800 కోట్లు ఉంటుందని రీడర్స్‌ డైజెస్ట్‌ అంచనా వేసింది. సాలుసరి రాబడి రూ. 360 లక్షలని ఆ పత్రిక తెలిపింది. తాను నెలకు రూ. 70లోపునే తన ఖర్చులకు వాడుకుంటానని నిజాం ఆ పత్రికా విలేకరితో చెప్పుకున్నాడు.

 

 

85)

విజ్ఞాన చంద్రికా గ్రంథమాల (1906)
నిజాం రాష్ట్రంలో గ్రంథమాలల స్థాపనకు మార్గదర్శకమైన ప్రాతఃస్మరణీయ సంస్థ, 1906లో ఏర్పడిన విజ్ఞాన చంద్రికా గ్రంథమాల. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపనకు దోహదం చేసిన వారే ఈ గ్రంథమాలను నెలకొల్పటం గమనించవలసిన అంశం.
కొమర్రాజు లక్ష్మణరావుతో పాటు, మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు, అయ్యదేవర కాళేశ్వరరావు , ఆదిరాజు వీరభద్రరావు ఈ గ్రంథమాల నిర్వహణలో పాల్గొన్నారు. ఈ సంస్థ ప్రచురించిన ప్రసిద్ధ పరిశోధకులైన కొమర్రాజు వారి, హిందూ మహాయుగము, తెలుగులో మొట్టమొదటి ప్రామాణిక చారిత్రక గ్రంథంగా పేర్కొనదగింది. రెండవ భాగమైన ‘మహ్మదీయ మహాయుగం’లో గోలకొండ మంత్రులైన అక్కన్న, మాదన్నల చరిత్ర సవిస్తరంగా ఉంది.
అయితే 1908 లో ఈ గ్రంథమాల కార్యక్షేత్రం మద్రాసుకు మారటంతో దీనికి హైదరాబాదుతో సంబంధం తెగిపోయింది. కాని తెలంగాణ పరిశోధకులకు ఆద్యుడైన ఆదిరాజు వీరభద్రరావు, లక్ష్మణరావు వెంట మద్రాసు వెళ్లి 1908 నుంచి 1914 వరకూ ఆయనకు సహాయకుడుగా ఉన్నాడు

 

 

86)

విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల (1918)
వరంగల్‌ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుండి తొలి తరం వారపత్రిక ‘తెనుగు’ (1922) ను నడిపిన ఒద్దిరాజు సోదర కవులు (సీతారామచంద్రరావు, రాఘవరంగారావు) అంతకుముందే ‘విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల’ను (బహుశా కొమర్రాజు లక్ష్మణరావు స్ఫూర్తితో) నెలకొల్పారు. 1918లో ఆ గ్రంథమాల పక్షాన సీతారామచంద్రరావు నవల ‘రుద్రమదేవి’ బెజవాడలో అచ్చయిన సందర్భంలో ముద్రణకు సంబంధించిన పనులన్నీ నేర్చుకొని మరుసటి సంవత్సరమే మద్రాసు నుండి ముద్రణా యంత్రాన్ని కొనుగోలు చేసి ‘విజ్ఞాన ప్రచారణీ ముద్రణాలయం’ (1919) ప్రారంభించారు.
వివిధ వృత్తి కళల్లో ఆరితేరిన ఒద్దిరాజు సోదరులు తాము ఆర్జించిన విజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనయే ఈ గ్రంథమాల స్థాపనకు ప్రేరకమైంది. అక్కినేపల్లి జానకి రామారావు గ్రంథమాల సంపాదకులుగా వ్యవహరించారు. విజ్ఞాన దాయకమూ, దేశభక్త ప్రబోధకమూ అయిన గ్రంథాలను నెలకొకటైనా ప్రచురించాలన్న ఆశయంతో నెలకొన్న ఈ సంస్థ 1932 వరకూ సుమారు ఇరవైకిపైగా గ్రంథాలు ప్రచురించింది. వీనిలో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ సోదరకవుల వివిధ ప్రక్రియా రచనలు కావటం ప్రశంసార్హం. చివరిదశలో ఈ గ్రంథా లయాలను రాజవైద్య పింగళి లింబాద్రిరెడ్డి నెమలికొండకు (కరీంనగర్‌ జిల్లా) తరలిం చినట్లు తెలుస్తున్నది

 

87) అణా గ్రంథమాల (1938)
ప్రజల్లో మాతృభాషాభిమానం కలిగించి భాషా ప్రచారం కావించటం, నిత్యజీవితంలోని వివిధ సమస్యలపై అవగాహన కలిగించటం, మహానీయుల జీవిత చరిత్రల ద్వారా ఉద్యమ స్ఫూర్తికి దోహదం చేయటం మున్నగు ఆశయాలతో కె.సి. గుప్త, వెల్దుర్తి మాణిక్యరావు, గుండవరపు హనుమంతరావుల ఆధ్వర్యంలో 1938లో ‘అణా గ్రంథమాల’ నెలకొల్పబడిరది.4 సంవత్సరాలలో సుమారు 40 పుటల పరిమితిలో 100 గ్రంథాలను ప్రచురించాలన్న నియమాలు పెట్టుకొన్నారు. వ్యాస రూపంలో ఉన్న ఈ చిన్న గ్రంథాలను ఒక అణాకే అందించటం వల్ల దీనికి ‘అణా గ్రంథామాల’ అని పేరు పెట్టారు. ఈ గ్రంథమాల పక్షాన 40 గ్రంథాలు, కథలు, నవలలు, జీవితచరిత్రలు, ప్రజాసమస్యలు మొదలైనవి వెలువడినాయని తెలుస్తున్నది.

 

 

88) నిజాం ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ సంస్కరణల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో తొలి ప్రచురణగా వాటిని తెలుగులోకి అనువదించి ‘రాజ్యాంగ సంస్కరణలు’ పేరుతో ప్రకటించారు. పన్నుల భారంతో రుణగ్రస్తులైన రైతుల దీనస్థితిని చిత్రిస్తూ, వెల్దుర్తి మాణిక్యరావు ‘రైతు’ అన్న పొత్తాన్ని వెలువరించారు. మాడపాటి హనుమంతరావు ‘మాలతీగుచ్ఛము’, సురవరం ప్రతాపరెడ్డి ‘మొఘలాయీ కథలు’ 2 భాగాలు (1940), ‘కాళోజీ కథలు’ అణా గ్రంథమాల ప్రచురణలుగా వెలవడినై ఈ గ్రంథమాల ప్రకటించిన మరికొన్ని గ్రంథాలు`
ఆంధ్రవీరులు, స్వామి దయానంద సరస్వతి, సావర్కర్‌ జీవితం (కె. రంగదాసు), సుభాష్‌ చంద్రబోస్‌, పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, (కె. రంగాదాసు), యం.యన్‌.రాయ్‌ (గుండవరము హనుమంతరావు), బమ్మెర పోతన (పంతం ఆంజనేయులు), జాగీర్లు (ఉమ్మెత్తల కేశవరావు, సురవరం ప్రతాపరెడ్డి) సోషలిజం (గొబ్బూరి రామచంద్రరావు).

 

 

89) కాంగ్రెస్‌ 2 భాగాలు (జానపాటి సత్యనారాయణ) అనువంశికము వాహకులు (బి.వి.రమణారావు) ఖాది వ్యాసములు, రాజకీయ పరిజ్ఞానం, అణాకథలు (1940) ఎల్లోరా అజంతా (అడవిబాపిరాజు) నా కొడుకు (ధనికొండ హనుమంతరావు నవల), ప్రతిఫలం (నందగిరి వెంకటరావు నవల) మణిరేఖల (పులపర్తి కమలాదేవి నవల)
పై గ్రంథ రచయితల్లో కొందరు తెలంగాణేతరులు కూడా ఉన్నారు. హైద్రాబాద్‌ డిఫెన్స్‌ రూల్స్‌ (33`7) క్రింద దేశభక్తి ప్రబోధాత్మకమైన సుభాష్‌ చంద్రబోస్‌, (అణా గ్రంథమాల 20వ ప్రచురణం) ను నిజాం ప్రభుత్వం నిషేధించటమే కాక, కె.సి. గుప్త గారిని అరెస్ట్‌ చేసి జుర్మానాను వసూలు చేయడం జరిగిందంటే అణా గ్రంథమాల ఉద్యమ చైతన్యం అవగతమవుతుంది.

 

 

90)

దేశోద్ధారక గ్రంథమాల (1938)
ప్రసిద్ధ పత్రికా సంపాదకులు గ్రంథ ప్రకాశకులు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట 1938 లో సికింద్రాబాదులో ‘దేశోద్ధారక గ్రంథమాల’ను నెలకొల్పిన వట్టికోట ఆళ్వారుస్వామి (1915`16) తెలంగాణా రచయితల పెక్కు అమూల్య గ్రంథాలను ప్రకటించి సాహిత్య చైతన్య వ్యాప్తికి నిర్విరామ కృషి సల్పారు. నిజాం నిరంకుశ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం మూలంగా మధ్యలో జైలు జీవితం గడపటం వల్ల కొంత అవాంతరం ఏర్పడినప్పటికీ 1951 నుంచి 1961లో తుది శ్వాస వదిలే వరకూ ఎందరో రచయితల గ్రంథాలను వెలుగులోకి తెచ్చాడు. ఏ ఊరికి వెళ్ళినా అముద్రిత ప్రతులను సేకరించి వెంటనే వాటి ప్రచురణకు పూనుకొనేవారు. అలా 1938`61 మధ్య విలువైన 33 గ్రంథాలు ముద్రితమైనాయి. కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు మున్నగు ప్రక్రియలకు చెందిన మరో 25 గ్రంథాల ముద్రణ ప్రణాళిక కూడా సిద్ధం చేశారు.
గ్రంథ ప్రచురణలో దేశోద్ధారక గ్రంథమాల విశిష్టతను నిరూపించటా నికి కింద పేర్కొనబడిన రచనలే సాక్ష్యం.
సురవరం ప్రతాపరెడ్డి ‘హైందవవీరులు’ ఈ గ్రంథమాల తొలి ప్రచురణ కాగా, ఆయన ‘ప్రాథమిక స్వత్త్వములు’ (1938) గ్రంథాల యోద్యమము (1940) కూడా తర్వాత అచ్చయినాయి.

 

 

91)

శ్రీ కాళోజీ ‘నా గొడవ’ (1953) ` ఆలంపూరులో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవ సభలలో విడుదలయింది.
శ్రీ జైలులో సహవాసిగా ఉండి మైత్రీ బంధంపెనవేసుకు పోయిన దాశరథి గేయసంపుటి ‘పునర్నవం’ (1956).
శ్రీ వట్టికోట స్వీయరచనలైన ‘ప్రజల మనిషి’ నవల, ‘జైలులోపల’ కథల సంపుటి.
శ్రీ 34 మంది రచయితల కథల సంపుటి ‘పరిసరాలు’ రెండు భాగాలు (1956)
శ్రీ ‘తెలంగాణ’ వ్యాససంపుటి మొదటిభాగం (1956) ` ఇందులో ఆదిరాజు వీరభద్రరావు, వానమామలై వరదాచార్యులు, కొండపల్లి శేషగిరి రావు మొదలైన వారి 19 వ్యాసాలు చోటుచేసుకున్నాయి.
శ్రీ ‘తెలంగాణ’ రెండోభాగం (రావినారాయణరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు మున్నగు వారి 13 వ్యాసాల సంపుటి).
శ్రీ ‘జీవన రంగం’ రెండుభాగాలు (15 గురు రచయితల 15 ఏకాంక నాటికల సంకలనాలు).
శ్రీ నేదునూరు గంగాధరం సంకలనం చేసిన జానపద గేయాల సంపుటి ‘సెలయేరు’
శ్రీ ఆదిరాజు వీరభద్రరావు ‘తెలంగాణం’ (3వ భాగం) వ్యాస సంపుటి
శ్రీ కె.ఎల్‌. నరసింహారావు నాటికలు ( కళా సౌధము)
శ్రీ వానమామలై వరదాచార్యుల ‘ఆహ్వానము’ (గేయాలు)
శ్రీ హీరాలాల్‌ మోరియా కథా సంపుటి ‘బ్రతుకుబాటలు’
శ్రీ పొట్లపల్లి రామారావు గేయాలు (ఆత్మవేదన)
శ్రీ ఖండవల్లి బాలేందు శేఖరం `
కమాల్‌ పాషా జీవితం (2 భాగాలు)
శ్రీ విష్ణు చక్రం గారి ‘గాంధీ మహాత్ముడు (2 భాగాలు)
శ్రీ సంస్థాన ప్రజల సమస్యలు (డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య)
శ్రీ కాంగ్రెసు `సంస్థానాలు
శ్రీ ఔంధు సంస్థానము (పులిగడ్డ వెంకట సుబ్బారావు)
శ్రీ ప్రజలు ` ప్రభుత్వం (లియోటాల్‌స్టాయ్‌ రచనకు అనువాదం)
శ్రీ నా భారతదేశమాత (హెచ్‌.ఎన్‌. బ్రెయిల్స్‌ ఫర్డ్‌ గ్రంథానికి కాళోజీ అనువాదం)
శ్రీ ప్రభాస ( 3 ఉపన్యాసాల సంపుటి) ` 1958

 

92)

ఆంధ్ర చంద్రికా గ్రంథమాల (1945)
1945లో ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు పష్టిపూర్తి ఉత్సవ సందర్భంలో ప్రజలు బహూకరించిన 6400 రూపాయలతో ఆయన ఈ గ్రంథమాలను నెలకొల్పడం జరిగింది. గ్రంథాల అమ్మకంపై వచ్చిన ధనాన్ని బ్యాంకులో జమచేయగా అది రూ. 20,000లకు పెరిగినపుడు మాడపాటివారు ఆ మొత్తాన్ని రాజా బహదూర్‌ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల స్థాపనకోసం విరాళంగా ఇచ్చి గ్రంథమాలను ఆపివేశారు. ఈ గ్రంథమాల పక్షాన ప్రకటితమైన కొన్ని గ్రంథాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. మాడపాటి వారి స్వీయ రచన ‘ఆంధ్రోద్యమము’ రెండు భాగాలు.
2. ఖండవల్లి లక్ష్మీరంజనం ‘ఆంధ్రసాహిత్యచరిత్ర సంగ్రహము’
3. ఖండవల్లి బాలేందుశేఖరం ‘విస్మృత సామ్రాజ్యములు’
4. ఆదిరాజు వీరభద్రరావు ‘ప్రాచీనాంధ్ర నగరములు’
5. బి.వి. రమణారావు ‘వైజ్ఞానికుల జీవితములు’
6. రాంపల్లి విశ్వేశ్వరరావు ‘పౌర ధర్మములు’

 

 

 

93) కాకతీయ గ్రంథమాల
ఓరుగల్లులో తూము వరదరాజులు గారు దీనిని స్థాపించి ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు శేషాద్రి రమణ కవుల సంపాదకత్వంలో కింది గ్రంథాలను ముద్రింపజేశారు.
` ఆంధ్రమంత్రుల చరిత్ర, ఆంధ్ర పద నిదనము, దాసభోద, విక్రమోర్వశీయము, వసుంధర మొదలగునవి.

 

 

94)

విశ్వేశ్వర గ్రంథమాల
వరంగల్‌లో విశ్వేశ్వరాలయాన్ని నిర్మించిన సంపన్నులు ఆకారపు నరసింగం గుప్త విశ్వేశ్వర గ్రంథమాలను స్థాపించి సుమారు 20 శైవ మత సంబంధ గ్రంథాలను ప్రకటించారు

 

 

95) సప్తసముద్రాలు దాటి… గోల్కొండ ఓడలో వచ్చి
విఖ్యాత మెదక్‌ కెథడ్రల్‌ చర్చి నిర్మాత చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌. 1870లో ఇంగ్లాండ్‌ దేశంలోని షఫిల్డ్‌ అనే నగరంలో జన్మించిన ఆయన అక్క ఎమ్లీ ఫాస్నెట్‌ ప్రోత్సాహంతో మెథడిస్ట్‌ సంఘంలో పాస్టర్‌గా అభిషేకం పొందారు. ఏసుప్రభువు అపర భక్తుడుగా మారిన ఫాస్నెట్‌ సువార్త సేవలందించేందుకు సప్తసముద్రాలు దాటి 1895లో ఇండియాకు వచ్చారు. అప్పట్లో లండన్‌`మద్రాసు మధ్య రాకపోకలు సాగించే ‘గోల్కొండ’ ఓడలో ఆరు నెలలు ప్రయాణించి మద్రాసు చేరుకున్నారు. అక్కడ కొంత కాలం ఉన్నాక క్రైస్తవ మత ప్రచారం ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్ల తర్వాత గ్రామీణ ప్రాంతంలో సువార్త సేవలందించాలన్న తన అకాంక్ష మేరకు 1897లో ఫాస్నెట్‌ను హైద్రాబాద్‌ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్‌ పట్టణంలోని చిన్నదైన చాపెల్‌ చర్చికి బదిలీ చేశారు.

 

 

 

పనికి ఆహారం ప్రాతిపదికన
అది 1908 సంవత్సరం. అప్పట్లో మెదక్‌ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేవు… పంటలు సాగుచేసే పరిస్థితి లేదు… పనులు లేక ఉపాధి కరువైంది. చేసేందుకు పనులు లేక, తినేందుకు తిండి కరువై వేలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఈ పరిస్థితి చూసి ఫాస్నెట్‌ చలిం చారు. అన్నార్తులను ఆదుకోవాలని తలంచారు. ఏసుప్రభువుకు పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న ఫాస్నెట్‌ ఇటు కరుణామయుడికి ఆలయం నిర్మించడం… అటు కరువు పీడితుల ఆకలి తీర్చడం లక్ష్యంగా చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. బర్మా నుంచి బియ్యం, ఆహార పదార్థాలు తెప్పించి పనికి ఆహారం ప్రాతిపదికన చర్చి నిర్మాణ పనులు జరిపించారు. 1910లో మొదలైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగగా అంతకాలం ఎంతో మందికి చేతినిండా పని దొరికింది.

 

 

 

96) 173 అడుగుల ఎత్తు
చర్చిని 180 అడుగుల ఎత్తుతో నిర్మించాలని ఫాస్నెట్‌ తలంచారు. ఈ మేరకు చర్చి నిర్మాణ అనుమతి కొరకు నిజాంకు దరఖాస్తు సమర్పించారు. కాగా నిజాం రాజ చిహ్నంగా ఉన్న హైద్రాబాద్‌లోని చార్మినార్‌ ఎత్తు 175 అడుగులు కాగా అంతకంటే ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేం దుకు అనుమతించలేదు. దీంతో 173 అడుగుల ఎత్తుతో చర్చి నిర్మించేందుకు ఫాస్నెట్‌ నిర్ణయించారు. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు ఉంది. చర్చి పూర్తిగా రాతితో డంగుసున్నం వినియోగించి ఎంతో పటిష్టంగా నిర్మితమైంది.
గోతిక్‌ శైలి: చర్చి అంతర్భాగం ప్రాచీన రోమ్‌ నిర్మాణ శైలి అయిన గోతిక్‌ శైలిని పోలి ఉంటుంది. విశాలమైన ప్రధాన ప్రార్థనా మందిరం పైకప్పు, ప్రాకారాలు, ప్రధాన వేదిక, ఎత్తైన స్తంభాలు, ప్రవేశ ద్వారాలు వాస్తు శిల్పి థామస్‌ ఎడ్వర్డ్‌ , దేశ, విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో కళాత్మకంగా నిర్మితమయ్యాయి. చర్చిలోపల నేలపై ఆకర్షణీయమైన ఫ్లొరింగ్‌ కోసం ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ, నలుపు రంగు రాళ్లను వేశారు. ఏ కాలంలో అయినా చల్లగా ఉండటం, అడుగుల శబ్దం కూడా రాకపోవడం ఈ బండరాళ్ల ప్రత్యేకత. మహాదేవాలయంలో ప్రధాన వేదికపై పరిశుద్ధ బల్ల వెనుక గోడకు అమర్చిన పాలీష్‌ స్టోన్‌ను ఇటలీ నుంచి తెప్పించారు. చర్చిలో ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అటంకం కలుగకుండా ఉండేందుకుగాను రీసౌండ్‌ రాకుండా రబ్బరు, పత్తి, పలు రకాల రసాయనాలు వినియోగించి చర్చి కప్పును ఎకో ప్రూఫ్‌ చేయించడం విశేషం.
అద్దాల కిటికీల్లో క్రీస్తు జన్మవృత్తాంతం చర్చి నిర్మాణంలో నేటి ఇంజనీర్ల ఊహకందని నిర్మాణ నైపుణ్యాలు ఒక ప్రత్యేకత అయితే, అద్దాల కిటికీలు మరో ప్రత్యేకత. క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా కళ్లకు కట్టేలా అద్దాల కిటికీల్లో పొందుపరచడం విశేషం. ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఓ. సాలిస్‌ బరి స్టేయిన్‌ గ్లాస్‌ ముక్కలతో ఈ కిటికీలకు రూపకల్పన చేశారు. మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేశారు. ముందుగా 1927లో చర్చిలో ఎదురుగా ఉన్న వేదికపై ఉన్న కిటికీ అద్దాల్లో క్రీస్తు ఆరోహణకు సంబంధించిన దృశ్యాలు పొందుపర్చారు. ఆ తరువాత 1947లో చర్చిలో కుడివైపున ఉన్న కిటికీ అద్దాల్లో ఏసుప్రభువు జననానికి సంబందించిన దృశ్యాలు, 1958లో క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యాలు పొందుపరిచారు.బయటి నుంచి సూర్యకాంతి ప్రసరించినపుడు మాత్రమే చర్చిలోపల నుంచి చూస్తే కిటికీ అద్దాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు అగుపించడం ప్రత్యేకత.

కలప పనితనం… కళాత్మకం
కరుణామయుడి మందిరంలో ఆర్చీలు, పైకప్పు, ఫ్లోరింగ్‌ మాత్రమే కాదు… వేదికపై బల్లలు, కుర్చీలు సైతం ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ప్రధాన వేదికపై ఉండే ప్రభు భోజనపు బల్ల రంగూన్‌ టేకుతో కళాత్మకంగా తయారుచేయబడిరది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ పఠన వేదిక దేవదారు కర్రతో పక్షిరాజు రూపంలో ఎంతో అద్బుతంగా మలచారు. జెకొస్లొవేకియా దేశానికి చెందిన కలప పనివారు చాలా రోజుల పాటు శ్రమించి దీనిని అసలైన పక్షిని తలపించేలా రూపొందించడం వారి పనితనానికి నిదర్శనం. గురువులు ఆసీనులయ్యే బల్లలు, కుర్చీలు గులాబీ కర్రతో తయారు చేశారు.

1924 సంవత్సరం డిసెంబరు 25వ తేదీన క్రిస్మస్‌ పర్వదినం రోజున మెదక్‌ చర్చి ప్రారంభమైంది. 

 

 

97) పదహారవ శతాబ్ది నుంచి పదిహేడవ శతాబ్ది చివరి వరకు గోలకొండ రాజధానిగా దక్కనును పాలించిన వారు కుతుబ్‌షాహీ నవాబులు. సుల్తాన్‌ కులీ ఈ వంశ స్థాపకుడు. బహమనీల కాలంలో వరంగల్‌ వరకే పరిమితమైన రాజ్యాన్ని ఇతడు రాజమహేంద్రవరం వరకు విస్తరించాడు. గోలకొండ నవాబులందరిలో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ప్రసిద్ధుడు. హైదరాబాద్‌ నగరంలో హుస్సేన్‌ సాగర్‌ చెరువు ఇతడే నిర్మించాడు. ఇతడు తెలుగు కవులను ఆదరించాడు. అద్దంకి గంగాధర కవి తన తపతీ సంవరణోపాఖ్యానాన్ని ఇబ్రహీంకు అంకితం చేశాడు. 1556లో విజయనగర సామ్రాజ్యం పతనమైనది. దీనికి ఇబ్రహీం కుతుబ్‌షాయే ప్రధాన కారకుడు.

 

98) గోలకొండ నవాబులందరిలో ప్రజాభిమానం పొందినవాడు అబుల్‌ హసన్‌ తానీషా. అతని కాలంలోనే గోలకొండ రాజ్యం పతనం కావడం విధి వైపరీత్యం. అబుల్‌ హసన్‌ మాదన్నను ప్రధానమంత్రిగా నియమించాడు. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ దండ యాత్రల అనంతరం 300 సంవత్సరాల కాలంలో ఒక ముస్లిం రాజ్యంలో హిందువును ప్రధానమంత్రిగా నియమించడం ఇదే మొదటిసారి.
1686 మార్చి 21వ తేదీన అక్కన్న, మాదన్నల హత్య జరిగింది. మొగలుల ముట్టడి 1687 ఫిబ్రవరి 7న ప్రారంభమై ఏడు నెలల పదిహేను రోజులు సాగింది. తానీషా పట్టుబడ్డాడు. 1696లో దౌలతాబాద్‌ కోటలో బందీగా అతడు చనిపోయాడు.

 

99) పొన్నగంటి తెలగనార్యుడు ‘యయాతి చరిత్ర’ అనే అచ్చ తెనుగు కావ్యం రచించి ఇబ్రహీం సేనాని అవిూన్‌ఖాన్‌కి అంకితమిచ్చాడు. కవితలకు పుట్టిల్లు మరింగంటి వారి యిల్లు, మరింగంటి సోదరులలో అగ్రేసరుడు సింగరాచార్యుడు.

 

100) కవితలకు పుట్టిల్లు మరింగంటి వారి యిల్లు, మరింగంటి సోదరులలో అగ్రేసరుడు సింగరాచార్యుడు. ఇతడు రామకృష్ణ విజయమనే ద్వ్యర్థికావ్యాన్నీ, నలయాదవ రాఘవ పాండవీయం అనే నాలుగర్ధాల కావ్యాన్ని, పెక్కు శతకాలను రచించి ఇబ్రహీం పాదుషా సత్కారాలను పొందాడు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన క్షేత్రయ్య అబ్దుల్లా కుతుబ్‌షా ఆస్థానంలో గౌరవాదరాలు పొందాడు.దక్కను సుల్తానులు స్వతంత్ర శిల్పశైలిని సృష్టించారు. వీరి సమాధులు వీరి శైలి చిహ్నాలు. చార్మినార్‌, మక్కామసీదు ` ఈ రెండు కట్టడాలు వీరి కాలం నాటి శిల్పకళా వైభవాన్ని వేనోళ్ళ చాటుతున్నాయి.

 

 

101)

అసఫ్‌ జాహీ (నిజాం)ల పాలన
అఖిలాంధ్రదేశాన్ని పాలించిన చివరి రాజ వంశం ఆసఫ్‌జాహీ నిజాం నవాబులది. దక్కునుకు సుబేదారుగా ఉన్న నిజాం ఉల్‌ముల్క్‌ 1724 అక్టోబర్‌ 11న స్వతంత్రించి ఆసఫ్‌జాహీరాజ్యాన్ని స్థాపించాడు. ఔరంగాబాద్‌ దక్కను రాజధాని. ఆ నాటికి నిజాం రాజ్యం ఉత్తరాన నర్మదానది వరకు, దక్షిణాన కర్నాటక వరకు తూర్పు ` పడమర సముద్రాల వరకు వ్యాపించి ఉంది. మొదటి నిజాం తరువాత రాష్ట్రంలో 14 సంవత్సరాలు అరాచకమే రాజ్యమేలింది. నాసిర్‌జంగ్‌, ముజఫర్‌జంగ్‌, సలాబత్‌ జంగ్‌ల పరిపాలన అంటే బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ వారి పోరాటాలే అన్నమాట. నిజాం నాల్గవ కుమారుడు నిజాం అలీఖాన్‌ 1761లో రాజ్యానికొచ్చి సుస్థిరపాలనకు దారి వేశాడు. ఇతని కాలంలో సర్కార్లు, సీడెడ్‌ జిల్లాలు చేజారి పోయాయి.

 

102) పోలీసు చర్య తర్వాత 1951`52లో హైదరాబాద్‌ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామ కృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే హైదరాబాద్‌ రాష్ట్రపు తొలి, తుది ప్రజా ముఖ్యమంత్రి. అంతకు ముందు ముఖ్యమంత్రులను నిజాం ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో నియమించేది. రామకృష్ణ్ణారావు గారి హయాంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో సంపూర్ణమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొన్నది. భారతదేశంలో అభ్యుదయకరమైన కౌలుదారీ శాసనం చేయబడిరది. జాగీర్దారీ రద్దు సమస్యతో మొదలైన ఫ్యూడల్‌ ప్రతికూల సమాజ స్థాపన కౌల్దారీ శాసనంతో ముందుకు పోయింది. నాగార్జున సాగర్‌ నిర్మాణానికి రామకృష్ణారావు చాలా పట్టుదల వహించి సానుకూలం కావడానికి తోడ్పడ్డారు.

 

 

 

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

ఇక్ష్వాకులు

1)శాతవాహనుల పతనo అనంతరం, తెలంగాణ ప్రాంతం ఇక్ష్వాకుల అధీనం లోకి  వచ్చింది .

2)  పశ్చిమ డక్కన్ ప్రాంతం లో :  ఛుటు, శాతకర్ణీలు , అభీరులు ,

డక్కన్ లో  :  ఇక్ష్వాకులు

శాతహవానుల ను అనుసరించి చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు

3) ఇక్ష్వాకులను శ్రీ పర్వత  ఆంధ్రులు అన్నారు

4) శ్రీ పర్వతం ప్రాచీన నామం :  నల్ల మల్లురు’.   దీనినే నాగార్జున కొండ అంటున్నారు ఇప్పుడు

 

వశీష్టీపుత్ర శ్రీ శాoతముల (చాంతముల ) I  (క్రీ . శ. 180 – క్రీ. శ. 193 )

రాజధాని : విజయపురి

1)చెల్లెలు : పూకియ వంశానికి చెందిన మహాసేనాపతి తళవారన కు ఇచ్చి పెళ్లి చేశాడు

2) కుమార్తె : అటవి శాంతిశ్రీ ని ధనిక కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖనాగ కు ఇచ్చి పెండ్లి చేశాడు

 

 


మాధరి పుత్ర వీర పురుష దత్త (20 సంవత్సరాలు పాలించాడు )

1)ఉజ్జయిని శాక రాజైన రుద్ర సేన కుమార్తె రుద్ర ధర భట్టారికను వివాహ మాడాడు

2)కుమార్తె : కొడబలి సిరిని  ఛుటు రాజు  కిచ్చి పెండ్లి చేశాడు

3)బౌధ్ధ మతాన్ని స్వీకరించాడు

4  )ఇతని కాలం లో విజయపురి ప్రపంచ లోనే అతి పెద్ద  బౌద్ధ క్షేత్రం గా పేరొందిoది

5 )ఇతని కాలం లో వివిధ దేశాల నుండి ఎందరో భిక్కులు , భిక్కిని లు సందర్శనానికి వచ్చే వారు

6)రాజ మహిళలు విజయపురి లో ఉన్న మహా మఠాలకు దానాలు చేశారు

 


ఎహువుల ఛాంతముల II (క్రీ.శ.213 – క్రీ. శ. 237 )

1)వైదిక ధర్మాన్నే పాటించాడు

2)శాసనాలు నాగార్జున కొండలో లభించాయి

3) ఇతని 10 వ పాలనా కాలం లో పల్లవ రాజుల దండ యాత్ర ఎదుర్కొన్నాడు

4)ఇక్ష్వాకుల సైన్యాధిపతి : ఎలిశ్రీ

5) శివునికి , పురాణ దేవుళ్ళకు ఎన్నో గుడులు కట్టించాడు

6) బౌధ్ధ మతాన్ని ప్రోత్సహించాడు

 

 


రుద్ర పురుష దత్త  (క్రీ.శ.237  – క్రీ. శ. 248  )

1)తల్లి స్మారకార్ధం ఛాయ స్తంభం కట్టించినట్లు నాగార్జున కొండలో శాసనం లభించింది

 

ఎహువుల ((క్రీ.శ.248 లో రాజ్యాధికారం చేపట్టాడు )

 

 

 


ముగ్గురు ఇక్ష్వాకు రాజులు పాలించారు

 

పల్లవులు దండయాత్ర చేసి కృష్ణా – గుంటూరు ప్రాంతాన్ని ఆక్రమించారు

 

క్రీ.శ. 3వ శతాబ్దం లో అభిర రాజైన వసుసేన విజయపురి ని ఆక్రమించాడు దీనితో తెలంగాణ లో ఇక్ష్వాకుల పాలన అంతమైనది . కానీ కుటుంబం స్థానిక శక్తి గా మిగిలి పోయింది

 


క్రీ.శ .5వ శతాబ్దం లో ఉత్తర మైసూరు ని పాలించిన కెకాయ కుటుంబం తో ఇక్ష్వాకులు వైవాహిక సంబంధాలు కలుపు కొన్నట్లు ఒక శాసనం లో పేర్కొన బడింది 

 

 

Model questions (Ikshwakulu   Rule Period)

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

ఇక్ష్వాకులు   (క్రీ. శ.180   – క్రీ. శ. 248 )

1)ఎవరి పతనo అనంతరం , తెలంగాణ ప్రాంతం  ఇక్ష్వాకుల అధీనం లోకి వచ్చింది ?

ఎ)శాతవాహనులు

2)ఇక్ష్వాకులు ఎవరిని అనుసరించి మధ్య దక్కన్ లో చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు ?

ఎ )శాతవాహనులను

3)ఇదే సమయం లో పశ్చిమ దక్కన్ ప్రాంతం లో ఎవరు పరిపాలించేవారు ?

ఎ ) ఛుటు , శాతకర్ణీ లు , అభీరులు

4)ఎవరిని శ్రీ పర్వత ఆంధ్రులు అన్నారు ?

ఎ ) ఇక్ష్వాకులు

5) శ్రీ పర్వతం ప్రాచీన నామం ఏది ?

ఎ ) నల్ల మల్లురు

6) శ్రీ పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ?

ఎ ) నాగార్జున కొండ

7) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I పరిపాలన కాలం  ఏది ?

ఎ ) క్రీ. శ. 180  - క్రీ. శ. 193

8)  వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I రాజధాని ఏది ?

ఎ ) విజయపురి

9) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I కుమార్తె పేరు ఏది ?

ఎ ) అటవి శాంతి శ్రీ

10) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తన కుమార్తె అటవి  శాంతిశ్రీ ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?

ఎ ) ధనిక కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖ నాగ

11) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తన చెల్లెల్ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?

ఎ ) పూకియ వంశానికి చెందిన మహా సేనాపతి తళవారన కు ఇచ్చి పెండ్లి చేశాడు

12 ) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తర్వాత రాజైన మాధరి పుత్ర వీర పురుష దత్త ఎన్ని సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు ?

ఎ ) 20 సంవత్సరాలు

13 )మాధరి పుత్ర వీర పురుష దత్త ఎవరిని వివాహం చేసుకున్నాడు ?

ఎ ) ఉజ్జయిని శాక రాజైన రుద్ర సేన కుమార్తె రుద్ర ధర భట్టరిక ను

14) మాధరి పుత్ర వీర పురుష దత్త కూతురు పేరు ఏమిటి ?

ఎ ) కొడబలి సిరి

14) మాధరి పుత్ర వీర పురుష దత్త కూతురు కొడబలి సిరి ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?

ఎ ) ఛు టు రాజ కుమారుడికి ఇచ్చి

15) మాధరి పుత్ర వీర పురుష దత్త ఏ మతాన్ని స్వీకరించాడు ?

ఎ) బౌధ్ధ మతాన్ని

16) ఎవరి కాలం లో విజయ పురి ప్రపంచం లోనే అతి పెద్ద బౌధ్ధ క్షేత్రం గా పేరు పొందింది ?

ఎ ) మాధరి పుత్ర వీర పురుష దత్త

17)ఎవరి కాలం లో విజయ పురి కి / ఆయా చుట్టుపక్కల కి వివిధ దేశాల నుండి ఎందరో భిక్కులు , భిక్కినులు సందర్శనానికి వచ్చేవారు ?

ఎ ) మాధరి పుత్ర వీర పురుష దత్త

18) ఎవరి రాజ మహిళలు విజయ పురి లో ఉన్న మహా మఠాలకు దానాలు చేశారు ?

ఎ ) మాధరి పుత్ర వీర పురుష దత్త

19) ఎహువుల ఛాంతముల II పరిపాలనా కాలం ఏది ?

ఎ ) క్రీ.శ . 213 – క్రీ . శ. 237

20 ) ఎహువుల ఛాంతముల II ఏ ధర్మాన్ని పాటించాడు ?

ఎ ) వైదిక ధర్మాన్ని

21 ) ఎహువుల ఛాంతముల II పరిపాలనా కాలం నాటి శాసనాలు ఎక్కడ లభించాయి ?

ఎ ) నాగార్జున కొండ లో

22) ఎహువుల ఛాంతముల II , తన 10 వ పరిపాలనా కాలం లో ఎవరి దండ యాత్ర ను ఎదుర్కొన్నాడు ?

ఎ ) పల్లవ రాజుల

23)బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తూనే ,  శివునికి , పురాణ దేవుళ్ళకి ఎన్నో గుడులు కట్టించిన రాజు ఎవరు ?

ఎ ) ఎహువుల ఛాంతముల II

24) ఎహువుల ఛాంతముల II కాలం లో , ఇక్ష్వాకుల సైన్యాధి పతి ఎవరు ?

ఎ ) ఎలిశ్రీ

25 ) రుద్ర పురుష దత్త పరిపాలన కాలం ఏది ?

ఎ ) క్రీ. శ. 237 – క్రీ. శ. 248

26) రుద్ర పురుష దత్త  , ఎందుకోసం  ఛాయ స్తంభం కట్టించినట్లు  నాగార్జున కొండలో శాసనం లభించింది ?

ఎ ) తల్లి స్మారకార్ధం

27) ఎహువుల క్రీ. శ. 248 లో రాజ్యాధికారం చేపట్టాడు . ఇతని తర్వాత ముగ్గురు ఇక్ష్వాకు రాజులు పాలించారు . వీరి కాలం లో ఎవరు దండయాత్ర చేసి కృష్ణ – గుంటూరు  ప్రాంతాన్ని ఆక్రమించారు ?

ఎ ) పల్లవులు

28) 3వ శతాబ్దం లో అభిర రాజైన వసుసేన , విజయ పురి ని ఆక్రమించాడు . దీనితో తెలంగాణ లో ఎవరి పాలన అంతమైనది ?

ఎ ) ఇక్ష్వాకుల   ( కానీ వీరి కుటుంబం స్థానిక శక్తి గా మిగిలి పోయింది )

29) ఒక శాసనం లో పేర్కొన్నట్లుగా 5వ శతాబ్దం లో , ఇక్ష్వాకులు ఎవరితో  వైవాహిక సంబంధాలు కలుపుకున్నారు ?

ఎ) ఉత్తర మైసూరు ని పాలించిన కెకాయ కుటుంబం తో

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

విష్ణు కుండినులు

ఇంద్ర వర్మన్ I

 


మాధవ వర్మన్ I

రాజధాని : ఇంద్రపుర (ఇంద్రపాల గుట్ట , మూసి నది ఒడ్డున,

హైదరాబాద్ కు సుమారు  76 కి.మీ. దూరం లో ఉంది  )

 


గోవింద వర్మన్ I (క్రీ. శ.420 – క్రీ. శ. 462 )

ఇతని పట్టపు రాణి , తన

కుమార్తె  అయిన ప్రీత్విముల తో కలిసి

ఇద్దరూ ఇంద్రపురం లో బౌద్ధ సంఘానికి విహారం కట్టించారు

 


మాధవ వర్మన్ II (క్రీ. శ.462  – క్రీ. శ. 502  )

1 )గోదావరి తీరాన గల శాలంకాయనులను ఓడించి వేంగి ని  ఆక్రమించాడు

2) దక్షిణా న కృష్ణ నుండి తన రాజ్యాన్ని గుండ్ల కమ్మ నదీ తీరం వరకు రాజ్య విస్తరణ చేశాడు

3) ఉత్తరాన పిష్ఠ పుర ప్రాంతం నుండి శ్రీకాకుళం వరకు తన ఆధిపత్యాన్ని వ్యాపింపచేశాడు

4) ఇతని  బిరుదు : జనాశరణ్య

 

 


విక్రమేంద్ర వర్మన్ I (క్రీ. శ.502  లో రాజయ్యాడు  )

 

 


ఇంద్రభట్టారక వర్మన్ (క్రీ. శ.526  – క్రీ. శ. 556  )

1 )ఇదే సమయం లో గుంటూరు ప్రాంతానికి రాజైన మాధవ వర్మన్ III స్వతంత్రత ప్రకటించుకున్నాడు

2)ఇతని కాలం లో వాకాటక  రాజ్యం అంతరించింది

3) ఇంద్ర భట్టారక వర్మన్ నిర్విరామo గా యుద్ధాలు చేస్తున్న సమయం లో మొఖారి రాజైన ఈశన వర్మ చేతిలో పరాజయం పాలై యుద్ధ భూమిలో క్రీ. శ. 556 లో మరణించాడు

 

 


విక్రమేంద్ర వర్మన్ II (16 ఏళ్ల వయసులో రాజైనాడు )

1)   తుమ్మల గూడెం శాసనం ప్రకారం ఇతను పల్లవ రాజైన సింహ వర్మన్ ను ఓడించి , తరిమి గొట్టాడు

2)  ఇంద్ర పుర లో బౌధ్ధ విహారాన్ని ప్రోత్సహించాడు

3)  తన 30 ఏట మరణించాడు (సంతానం లేదు )

4)   

 


మాధవ వర్మన్ IV (విష్ణు కుండినులలో  సమానాంతర శాఖ కి చెందినవాడు )

1)జనాశ్రయ ఛందో విచితి అనే ఛoద శ్శాస్త్రాన్ని రాశాడు

2)క్రీ.శ. 612 లో కళింగను జయించి , తర్వాత , తన సైన్యాన్ని జైపూర్ (నేటి ఒడిష లో ఉన్నది )వరకు  నడిపించి   నాయకత్వం వహించాడు

 

3) దూర్జయ కుటుంబానికి చెందిన యుద్ధ వీరుడు అధికారం ప్రకటించుకున్నాడు

4)దూర్జయ రాజుని , చాళుక్య రాజైన రెండవ పులకేశి  ఓడించి  తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో చాళుక్యాధికారానికి పునాది వేశాడు    

 

Model questions (Vishnukundinulu  Rule Period)

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

విష్ణు కుండినులు  (క్రీ. శ.420  – క్రీ. శ. 612   )

1 )విష్ణుకుండినుల రాజైన మాధవ వర్మన్ I  మూసి నదీ తీరాన ఉన్న దేన్ని  రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ?

ఎ)ఇంద్రపుర (ఇంద్రపాల గుట్ట )

2)గోవింద వర్మన్ (క్రీ. శ.420  – క్రీ. శ. 462  ) భార్య మరియు అతని కుమార్తె ప్రీత్విముల కలిసి ఎక్కడ బౌద్ధ సంఘానికి విహారం కట్టించారు ?

ఎ ) ఇంద్ర పుర లో

3)మాధవ వర్మన్ II (క్రీ. శ.462   – క్రీ. శ. 502   ) గోదావరి తీరాన గల వేంగి ని ఎవరిని ఓడించి ఆక్రమించాడు ?

ఎ )శాలంకాయనులు

4)దక్షిణాన కృష్ణ నుండి గుండ్ల కమ్మ నదీ తీరం వరకు తన రాజ్యాన్ని విస్తరణ చేసిన విష్ణుకుండిన రాజు  ఎవరు ?

ఎ ) మాధవ వర్మన్ II

5) ఉత్తరాన  పిష్ట పుర ప్రాంతం నుండి శ్రీకాకుళం  వరకు తన  ఆధిపత్యాన్ని వ్యాపింపచేసిన  విష్ణుకుండిన రాజు  ఎవరు ?

ఎ )మాధవ వర్మన్ II

6)మాధవ వర్మన్ II బిరుదు ఏది ?

ఎ )జనాశరణ్య

7)విక్రమేంద్ర వర్మన్ I ఎప్పుడు రాజయ్యాడు ?

ఎ ) క్రీ. శ. 502 లో

8) ఇంద్ర భట్టారక వర్మన్ (క్రీ. శ . 526 – క్రీ. శ. 556 ) పరిపాలనా కాలం లో ఎవరు స్వతంత్ర త ప్రకటించుకున్నారు ?

ఎ ) గుంటూరు ప్రాంతానికి రాజైన మాధవ వర్మన్ III

9) ఇంద్ర భట్టారక వర్మన్ (క్రీ. శ . 526 – క్రీ. శ. 556 ) పరిపాలనా కాలం లో ఏ రాజ్యం అంతరించింది  ?

ఎ) వాకాటక రాజ్యం

10 ) ఇంద్ర భట్టారక వర్మన్ (క్రీ. శ . 526 – క్రీ. శ. 556 ) నిర్విరామం గా యుద్ధాలు  చేస్తున్న సమయం లో ఎవరి చేతిలో యుద్ధ భూమిలో క్రీ. శ. 556 లో పరాజయం పాలై మరణించాడు ?

ఎ )మొఖారి రాజైన ఈశన వర్మ చేతిలో

11 )16 ఏళ్ల వయస్సులో రాజుగా సింహాసనం ఎక్కిన  విష్ణు కుండిన రాజు ఎవరు ?

ఎ )విక్రమేంద్ర వర్మన్ II

12 )తుమ్మల గూడెం శాసనం ప్రకారం విక్రమేంద్ర వర్మన్ II ఏ పల్లవ రాజుని ఓడించి , తరిమి గొట్టాడు ?

ఎ)సింహ వర్మన్

13 ) ఇంద్ర పుర లో  బౌధ్ధ విహారాన్ని ప్రోత్సహించిన విక్రమేంద్ర వర్మన్ II ఎన్నవ ఏట మరణించాడు ? (ఇతనికి సంతానం లేదు )

ఎ ) 30 వ ఏట 

14) విష్ణు కుండినులలో సమానాంతర శాఖకి చెందిన ఎవరు , విక్రమేంద్ర వర్మన్ II తర్వాత సింహాసనం అధిష్ఠిoచారు ?

ఎ )మాధవ వర్మన్ IV

15)మాధవ వర్మన్ IV రచించిన ఛoదశ్శాస్త్రం ఏది ?

ఎ ) జనాశ్రయ ఛందో విచితి

16) క్రీ. శ. 612 లో కళింగ ను జయించిన తర్వాత , తన సైన్యాన్ని జైపూర్ (ఒదిషా లో ఉన్నది ) వరకు నడిపించి , నాయకత్వం వహించిన విష్ణుకుండిన రాజు  ఎవరు ?

ఎ ) మాధవ వర్మన్ II

17) మాధవ వర్మన్ IV కాలం లో ఏ కుటుంబానికి చెందిన యుద్ధ వీరుడు , రాజ్యాధికారం ప్రకటించాడు ?

ఎ) దూర్జయ కుటుంబానికి చెందిన

18) దూర్జయ రాజుని ఓడించి , తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో చాళుక్యధికారానికి పునాది వేసిన చాళుక్య రాజు ఎవరు ?

ఎ ) రెండవ పులకేశి

 

 

 

 

వేములవాడ(లేములవాడ ) చాళుక్యులు

(క్రీ. శ. 750 – క్రీ . శ . 973)

Study Material prepared by : Praturi Potayya Sarma

1)వేములవాడ  చాళుక్యుల  తొలి కుటుంబ సభ్యులు  బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దగ్గర పనిచేశారని ప్రముఖ చరిత్ర కారులైన బి. ఎన్. శాస్త్రి గారు అభిప్రాయ పడ్డారు. . వారి పరాక్రమనికి మెచ్చుకొని బాదామి చాళుక్య రాజులు,     సత్యాశ్రయ రణ విక్రమునకు సపద లక్ష ప్రాంతాన్ని (నేటి తెలంగాణ లో ని కరీం నగర్ , నిజామాబాద్ జిల్లాలు ) , బోధన్ రాజధాని గా చేసుకొని పాలించటానికి ఇచ్చారుట. సత్యాశ్రయ రణ విక్రముని వారసులైన పృత్వీ పతి , రాజాధిత్య పృత విక్రముడు చాళుక్య రాజుల యుధ్ధాలలో సహాయం చేశారు .  

2) బాదామి చాళుక్యుల పతనం అనంతరం , వేములవాడ చాళుక్యులు , రాష్ట్రకూటుల కింద రాజులు గా , అర్ధ – స్వతంత్ర హోదాలో రెండు సంవత్సరముల పాటు పరిపాలన చేశారు.

3)ఈ కుటుంబ చరిత్ర మనకు  ( i ) కొల్లిపర, (  ii )కురవ గట్ట, ( iii ) పరభని ( iv  ) వేములవాడ శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతే  కాకుండా పంప కవి రాసిన విక్రమార్జున విజయం లోనూ ఈ కుటుంబ వంశా వళి వివరాలు ఉన్నాయి.  

 

వినయాదిత్య యుద్ధ మల్ల I  (క్రీ. శ. 750  – క్రీ . శ . 775 )

(రాజధాని : బోధన్ ) ((కరీంనగర్ & నిజామాబాద్ జిల్లాలు ) (ఇక్కడ చోటుకు  సపద లక్ష పేరు  ఉంది )

 

అరికేసరి I (క్రీ. శ. 775   – క్రీ . శ . 800  )

 


నరసింహ I

 

 


యుద్ధ మల్ల II

 


(నోట్: ఈ మధ్యకాలపు వివరాలు తెలియటం లేదు )

 

బద్దెగ (క్రీ. శ. 850    – క్రీ . శ . 895   )

ఇతని బిరుదులు : “సొలద గండ “, 42 యుద్ధా లలో వీరుడు , ఓడింప బడని వీరుడు

ఇతను బద్దెగే శ్వరాలయము నిర్మించాడు. దీన్నే వేములవాడలోని  భీమేశ్వరాలయం అంటున్నారు .

 


యుద్ధ మల్ల III (క్రీ. శ. 895    – క్రీ . శ . 915   )

 


నరసింహ II ( క్రీ. శ. 915     – క్రీ . శ . 930    )

(కళా ప్రియ అనే ప్రదేశం లో విజయ స్థూపాన్ని స్థాపించాడు . )

(జకన్వి అనే  రాజకుమారిని వివాహమాడాడు)

 

 


ఆరి కేసరి  III (క్రీ. శ. 930     – క్రీ . శ . 941    )

ఇతని కాలం లో కన్నడ కవి పంప విక్రమార్జున విజయం అనే కన్నడ కావ్యం రాశాడు .

ఇతని కాలం లో వేములవాడలో ఆదిత్య గృహము నిర్మించ బడింది

ఇతను రేవకణి ర్మడి’,        లోకాంబిక అనే ఇద్దరు రాజ కన్యలను వివాహమాడాడు

ఇతనికి రేవకణి ర్మడి భార్య ద్వారా వగరాజు అనే కొడుకు  ; మరియు  లోకాంబిక భార్య ద్వారా భద్ర దేవ అనే కొడుకు జన్మించారు

అందువల్ల రాజ్యాన్ని రెండు భాగాలు చేశారు . 

 

 

 


వగరాజు                                                                                       భద్ర దేవ

ఇతని రాజధాని : గంగాధర                                       ఇతని రాజధాని : వేములవాడ

వగరాజు , యశస్తిలక చంపు అనే  గ్రంధం

రాసిన సోమ దేవ సూరి  ని

ప్రోత్సహించాడు .

సోమదేవ సూరి , వగ రాజుని

పాద పద్మోప జీవి అని  వర్ణించాడు

                                      భద్ర దేవు ని కుమారుడైన                                                              

                                                          అరికేసరి IV(క్రీ. శ. 946 – క్రీ . శ . 968  )

                                                       కాలం లో రాష్ట్ర కూటు రాజుల ప్రభావం అంతమైనది

 

తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర కూటుల ప్రభావం పోయి , కల్యాణి చాళుక్యుల ప్రభావం వచ్చినట్లు మెదక్ జిల్లాలో కొర ప్రోలు వద్ద లభ్యమైన తైల రాజు (క్రీ. శ . 973 ) శాసనం ద్వారా మనకు తెలుస్తోంది                             

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Model questions on  Vemulavada Chalukyulu ( 750 AD to 973 AD )

 

Prepared by : Praturi Potayya Sarma

 

 

1)వేములవాడ పూర్వము, శాసనములలో  ఏమని పిలువబడినది?

ఎ) లేంబులవాడ

 

2)వేములవాడ చాళుక్యుల పాలనా కాలము ఏ భాషకు స్వర్ణ యుగము వంటిది ?

ఎ) కన్నడ భాషకు .    రెండవ అరికేసరి పంప మహాకవి ని గౌరవించెను.

 

3) వేములవాడ చాళుక్యులకు సంబంధించిన రెండు తామ్ర శాసనాలు ఏవి ?

ఎ )  మొదటి అరికేసరి కొల్లిపర తామ్ర శాసనము   ;   మరియు  మూడవ అరికేసరి పర్భణీ తామ్ర శాసనము .

 

4)వేములవాడ చాళుక్యుల కు చెందిన 6 శాసనాలు ఏవి ?

ఎ ) కురవగట్టు శాసనము ; రెండవ అరికేసరి కరీంనగర్ శాసనము ; రెండవ అరికేసరి వేములవాడ శిలాశాసనము ;

  బి ) జీనవల్లభుని కుర్క్యాల శాసనము

సి ) క్రీ.శ. 946 నాటి కరీంనగర్ శాసనము; రెండవ అరికేసరి క్రీ. శ . 941 నటి చెన్నూరు శిలా శాసనము

డి ) పైవన్నీ

జవాబు : డి

 

5) వేములవాడ చాళుక్యుల వంశ మూల పురుషుడు ఎవరు అంటున్నారు ?

ఎ ) సత్యాశ్రయ రణ విక్రముడు .  ( ఈయన కుమారుడు  పృథ్వీపతి )

 

6) సపాద లక్ష భూమి అంటే ఏమిటి ?

ఎ ) లక్ష పాతిక వేల సువర్ణములు ఆదాయము వచ్చు భూమి. అని అర్ధము. 

 

7)పూర్వము బోధను  , అస్మక రాష్ట్రమునకు రాజధానిగా వర్ధిల్లి ఉండేను. 1,25,000 బంగారు నాణెములు ఆదాయము గా గల రాజ్యభాగము సపడ లక్ష దేశ మనబడినది.    గోదావరి నదికి దక్షిణ మున మంజీర నది నుండి మహా కాళేశ్వరము పర్యంతము వ్యాపించి ఉన్న భూభాగము పోధన నాడు అని వ్యవహరించారు. ఇదియే సపాద  లక్ష దేశము.  తర్వాతి కాలములో కరీంనగర్ మండల మును ఏమని పిలిచారు ?

ఎ: సబ్బినాడు   ( సబ్బిసాయిర మండలము )

 

8)తురుష్క , యవన ,కాంభోజ , కాశ్మీర , నేపాళ , మాళవ , మగధ , కళింగాధి దేశములను వినయాదిత్య యుద్ధమల్లుడు  జయించినట్లు   ఏ శాసనం లో ఉన్నది ?

ఎ) కొల్లిపర తామ్ర శాసనము

 

 

9)జిన విల్లభుడు వేయించిన బొమ్మల గుట్ట శాసనమున్న ప్రదేశమునుండి గంగాధర నాలుగు కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఎవరు గంగాధర రాజధానిగా వేములవాడ చాళుక్య రాజ్యమును క్రీ. శ. 955 నుండి క్రీ. శ . 960 వరకు పాలించారు ?

ఎ) వగరాజు ( లేక ) వాగ రాజు

 

10) జిన విల్లభుడు వేయించిన బొమ్మల గుట్ట శాసనములో ఎన్ని తెలుగు పద్యములు ఉన్నాయి ?

ఎ ) మూడు కంద పద్యాలున్నాయి. (ఇవి తెలుగు లో ఉన్నాయి )

11) జిన విల్లభుడు , ఎవరి సోదరుడు ?

ఎ ) పంప కవి

12) పంప కవి కన్నడ భాషలో రాసిన పుస్తకాలు ఏవి ?

ఎ) (I ) మహా భారతమును విక్రమార్జున విజయము అనే పేరు తో జైన మత పరముగా కన్నడ భాషలో రచించి అరికేసరి మహారాజుకి అంకిత మిచ్చాడు .

(ii ) ఇతని రెండవ కావ్యము పేరు : ఆది పురాణము. ఇందులో జైన తీర్ధంకరుల చరిత్రలు వర్ణించ బడ్డాయి.

 

13) గంగాధర పట్టణమున నివసించిన సోమదేవ సూరి ఏ గ్రంధము రాశాడు ?

ఎ) యశ స్తిలక

 

14)పంప మహాకవి రెండవ అరికేసరి ఆస్థాన కవి. అతడు వేములవాడ రాజ్యమున ఏ పదవిని నిర్వహించేను ?

ఎ ) దండ నాయక

 

15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (పాత  పేరు : నేటి పేరు )

ఎ )బూద పురము :   భూత్పూర్

బి ) వర్ధమాన పురము : వడ్డెమాను

సి ) పోదన : బోధన్

డి ) పైవన్ని

జవాబు : డి 

 

 

14) ప్రణీతా నది , ఎక్కడ గోదావరి నదిలో కలుస్తుంది ?

ఎ) కాళేశ్వరం దగ్గర 

 

15) బద్దెగ కి  (క్రీ. శ. 850 – క్రీ. శ . 895 ) గల బిరుదులు ఏవి ?

ఎ ) సోలద గండ , 42 యుధ్ధాలాలో ఓడింపబడని వీరుడు’, ఓడింప బడని వీరుడు 

 

16) బద్దెగేశ్వరాలయము , లేక నేటి      భీమేశ్వరాలయము ను వేములవాడ లో ఎవరు నిర్మించారు ?

ఎ ) బద్దెగ  (క్రీ. శ. 850 – క్రీ. శ . 895 )

 

 

17) యమునా  నదీ తీరం లో కళా ప్రియ అనే ప్రదేశం లో విజయ స్థూపాన్ని స్థాపించినది ఎవరు ?

ఎ ) నరసింహ II    (క్రీ. శ. 915  – క్రీ. శ . 930  )

 

18) జకన్వి అనే ఆమెను ఎవరు వివాహము చేసుకున్నారు ?

ఎ ) నరసింహ II    (క్రీ. శ. 915  – క్రీ. శ . 930  )

 

 

19)  కన్నడ కవి పంప ఎవరి కాలం లో  విక్రమార్జున విజయం అనే కన్నడ కావ్యం రాశారు ?

ఎ )  అరికేసరి III     (క్రీ. శ. 930   – క్రీ. శ . 941   )

 

20) ఎవరి కాలం లో వేముల వాడలో  ఆదిత్య గృహము నిర్మించబడింది ?

ఎ )    అరికేసరి III     (క్రీ. శ. 930   – క్రీ. శ . 941   )

 

 

21)   అరికేసరి III     (క్రీ. శ. 930   – క్రీ. శ . 941   ) ఏ రాజకన్యను వివాహమాడి , ఆమె ద్వారా వగ రాజు అనే కొడుకుని కన్నాడు ?

ఎ) రేవక ణిర్మడి 

22) )  అరికేసరి III     (క్రీ. శ. 930   – క్రీ. శ . 941   )  లోకాంబిక అనే మరో రాజకన్య ను వివాహమాడి , ఆమె ద్వారా కన్న కొడుకు ఎవరు ?

ఎ ) భద్రా దేవ

 

23) వగ రాజు రాజధాని ఏది ?

ఎ ) గంగాధర

 

24) యశ స్తి లక అనే చంపూ గ్రంధం రాసిన సోమ దేవ సూరి ని ప్రోత్సహించింది ఎవరు ?

ఎ ) వగ రాజు

 

25) పాద పద్మోప జీవి  అని సోమదేవ సూరి ఎవర్ని వర్ణించాడు ?

ఎ ) వగ రాజు

 

26)   అరికేసరి III     (క్రీ. శ. 930   – క్రీ. శ . 941   ), కొడుకు  భద్రదేవ  రాజధాని ఏది ?

ఎ ) వేములవాడ

 

27)భద్ర దేవ తర్వాత  రాజైన      అరికేసరి IV     (క్రీ. శ. 946    – క్రీ. శ . 968    ) కాలం లో  వచ్చిన మార్పు ఏది ?

ఎ ) వేముల వాడ చాళుక్యుల ప్రభావం అంతం ప్రారంభ మైనది .

 

28) తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర కూటుల ప్రభావం పోయి , కల్యాణి చాళుక్యుల ప్రభావం వచ్చి నట్లు , మనకి  ఎలా తెలుస్తోంది ?

ఎ ) మెదక్ జిల్లాలో కోర ప్రోలు వద్ద లభ్యమైన  తైల రాజు (క్రీ. శ . 973 ) శాసనం ద్వారా    

 

29) వేములవాడ చాళుక్యులు తొలుత  ఏ మతావలంబికులు ?

ఎ ) జైన మతము

 

30) కొల్లిపర శాసనాలలో ఎవరు తనను వ్యాకరణం లో దిట్ట గాను , గణ తంత్ర విద్యలో ను , తర్క శాస్త్రం , విలు విద్య లో ప్రావీణ్యుడు అని అభివర్ణించు కున్నాడు ?

ఎ ) అరికేసరి I      (క్రీ. శ. 775    – క్రీ. శ . 800    )

 

 

 

 

 

 

 

 

 

ముదిగొండ చాళుక్యులు  (క్రీ. శ. 960 – క్రీ. శ .1125  )

Notes prepared by : Praturi Potayya Sarma

1 )10వ శతాబ్ది ప్రారంభం లో వరంగల్ , ఖమ్మం ప్రాంతాలలో గల ముదిగొండ , కొరవి ప్రాంతాలను వీరు పాలించారు.

2) ఈ వంశస్థుల చరిత్ర గురించి కుసుమాయుధ IV యొక్క  దానం  శాసనాల వల్ల , కూకునూరు (క్రివ్వక దానం)  తామ్రపత్రాలు , కుసుమాదిత్య నట్టరమేశ్వరాల లేఖా ప్రమాణాల వల్ల తెలుస్తోంది.

3)ముడి గొండూరు ను రాజధానిగా చేసుకుని పరిపాలించటం వల్ల వీరికి ముదిగొండ చాళుక్యులని పేరు వచ్చింది .

4)వీరి రాజ్యానికి  ….   వేంగి , మాల్ఖేడ్ ప్రాంతాలు సరిహద్దులుగా ఉండేవి.

5)వేంగి రాజ్యం ఆగ్నేయ ప్రాంతానికి రక్షణ  బాధ్యతలు వీరు  నిర్వహించారు

6)వీరు వేంగి చాళుక్యుల రాజముద్రను ఆచరణ లోనికి దత్తత తీసుకున్నారు.

7) ఆ రాజముద్ర వరాహ లాంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , రెండు వింజామరాలు , ఖాళీ రాజ సింహాసనం , గొడుగుల కలయిక తో కూ డి ఉంది.

8) మొగలి చెరువు శాసనాలలో తెలిపినట్లుగా   కొక్కిరాజ, రణమర్ధ అనే సోదరులు ఈ ప్రాంతాన్నిఅనగా  ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో గల ముదుగొందూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు తెలుస్తోంది.   

కొక్కిరాజు 

(ఇతని సోదరుడు : రణమర్ధ )

i)మొగిలిచెరువు శాసనం వీరి గురించి తెలుపుతుంది.

Ii)రణమర్ధ  తమ రాజ్యాన్ని మంచి కొండ విషయ మరియు కొండపల్లి ప్రాంతాల వరకు విస్తరించాడు

iii)రణమర్ధక కంఠిక అనే గౌరవ ప్రదమైన చిహ్నం గా   కంఠాభరణా న్ని ధరించి ., దానికి రణమర్ధ కంఠీయము అనే పేరు పెట్టాడు

iv) రణమర్ధక కంఠీయాన్ని , కులధనముగా భావించి , తర్వాత తరాల వారు కుల దేవత గా భావించి పూజించారు

 

 


కుసుమాయుధ I

(ఇతను రణమర్ధ కొడుకు )

ఇతను రణమర్ధీయ కులతిలక అని పిల్వబడ్డాడు

ఇతను వేంగి చాళుక్య వంశస్థుడైన చాళుక్య భీమ I కి నమ్మకమైన సేవలు అందించాడు . 

 


విజయాదిత్య గొణగ

I ) కొరవి శాసనాలలో చెప్పినట్లుగా విజయాదిత్య గొణగ , సోదరుడైన నిరవాద్య తో బలవంతం గా రాజ్యం పోగొట్టుకున్నాడు . నిరవాద్య తనను తాను రాజ్యశ్రీ అనే బిరుదు తో సంబోధించుకున్నాడు

 

 


కుసుమాయుధ II

(ఇతను విజయాదిత్య గొణగ కుమారుడు )

                       I )ఇతను వినిత జనాశ్రయ అనే పేరు పొందాడు .

                      ii)నిరవా ద్య నుండి వచ్చిన కొరవి రాజ్యాన్ని పొందాడు .

                      iv)వీరి పాలన మంచి కొండ , కొరవి , కొండపల్లి వరకు వ్యాపించింది  

 

 


విజయాదిత్య (క్రీ. శ. 960 – క్రీ. శ .980 )

 

 


కుసుమాయుధ III (క్రీ . శ. 980  – క్రీ. శ . 1000 ) 

Down Arrow:   


                                                                                                                      

 గొణగ                      నిజ్జయరాజ                          మల్లప                               లోభచాలక

         

                        కుసుమాయుధ IV

 

                             బేతరాజు I   (క్రీ. శ. 1075 – క్రీ. శ .1100 )

i)ఇతని కాలం లో కొరవి నుండి గుండ్యన వరకు గల కాకతీయ కుటుంబానికి  చెందిన ప్రాంతాలు పోగొట్టుకున్నాడు

ii)బేతరాజుని బలవంతం గా బొత్తు అనే గోదావరి పరీవాహక ప్రాంతానికి పంపారు . అయినా ఆయన కొరవి ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశారు . అప్పటి నుండి కొరవి రాజ్య బొత్తు నాయకులు గా పేరు పొందారు

iii)విరియాల మల్ల గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎర్ర రాజు , బొట్టు బేతరాజు శత్రువులను సంహరించి కొరవి రాజ్యాన్ని అతనికి అప్పగించినట్లు పేర్కొనబడినది .

 

 


                   కుసుమాయుధ V   (క్రీ. శ. 1100  – క్రీ. శ .1125  )

i)             ముత్త నెగేళ్ల ఇతని బిరుదు

    Ii ) ఇతని కుమారుడు : బొత్తు బేత  (లేక ) బొట్టు బేత

 


                                          

                                                బొత్తు బేత

i)ఇతనికి వినిత జనాశ్రయ అనే బిరుదు ఉంది .

ii ) ఈయనకి ఇద్దరు కుమారులు   :   a ) కుసుమాదిత్య VI             b )నాగతి రాజ

 

                                    

Down Arrow:     

                                                                                                                  

      కుసుమాదిత్య VI                                                                  నాగతి రాజ

i)ఇతనికి మార్బల కేసరి అనే బిరుదు ఉంది                      I )ఇతనికి వివేక నారాయణ   అనే బిరుదు ఉంది  

                                                                   ii)ఇతను ఈ వంశం లో ఆఖరి వాడు

                                                                         iii)ఇతను కాకతీయ గణపతి దేవుని సైన్యం చేతిలో

                                                                   ఓడిపోయి , తన విసురు నాడు ప్రాంతాన్ని వదలి

                                                                   పోయాడు .

 

 

 

 

 

Model questions on Mudigonda Chalukyulu

ముదిగొండ చాళుక్యులు  (క్రీ. శ. 960 – క్రీ. శ .1125  )

Prepared by : Praturi Potayya Sarma

 

 

1 )10వ శతాబ్ది ప్రారంభం లో వరంగల్ , ఖమ్మం ప్రాంతాలలో గల ఏ ప్రాంతాలను ముదిగొండ చాళుక్యులు  పాలించారు ?

ఎ) ముదిగొండ , కొరవి ప్రాంతాలను

2) ముదిగొండ  వంశస్థుల చరిత్ర గురించి  వేటి వల్ల తెలుస్తుంది ?

ఎ )కుసుమాయుధ IV యొక్క  దానం  శాసనాల వల్ల ,

బి )కూకునూరు (క్రివ్వక దానం)  తామ్రపత్రాలు ,

సి )కుసుమాదిత్య నట్టరమేశ్వరాల లేఖా ప్రమాణాల వల్ల

డి ) పైవన్ని

జవాబు : డి 

 

4 ) దేన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించటం వల్ల వీరికి ముదిగొండ చాళుక్యులని పేరు వచ్చింది ?

ఎ ) ముడి గొండూరు ను  

4)ముదిగొండ చాళుక్య  రాజ్యానికి  ఏ ప్రాంతాలు సరిహద్దులుగా ఉండేవి ?

ఎ ) వేంగి , మాల్ఖేడ్ ప్రాంతాలు

 

5) ముదిగొండ చాళుక్య రాజులు ఏ ప్రాంతానికి రక్షణ బాధ్యతలు నిర్వహించారు ?

ఎ) వేంగి రాజ్యం ఆగ్నేయ ప్రాంతానికి రక్షణ  బాధ్యతలు వీరు  నిర్వహించారు

6)ముదిగొండ చాళుక్యులు ఎవరి  రాజముద్రను ఆచరణ లోనికి దత్తత తీసుకున్నారు ?

ఎ )  వేంగి చాళుక్యుల రాజముద్రను

7) వేంగి చాళుక్యుల రాజముద్ర లో ఏవేవీ ఉన్నాయి ?

ఎ ) ఆ రాజముద్ర వరాహ లాంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , రెండు వింజామరాలు , ఖాళీ రాజ సింహాసనం , గొడుగుల కలయిక తో కూ డి ఉంది.

8)     శాసనాలలో తెలిపినట్లుగా   కొక్కిరాజ, రణమర్ధ అనే సోదరులు ఈ ప్రాంతాన్నిఅనగా  ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో గల ముదుగొందూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు తెలుస్తోంది ?

ఎ) మొగలి చెరువు శాసనాలలో

 

9)ఎవరి కాలం లో ముదిగొండ చాళుక్యులు  తమ తమ రాజ్యాన్ని మంచి కొండ విషయ , కొండపల్లి ప్రాంతాల వరకు విస్తరించారు ?

ఎ ) రణమర్ధ

 

10 ) రణమర్ధ ఎవరి సోదరుడు ?

ఎ ) కొక్కి రాజు

 

11)   ఎవరు రణమర్ధక కంఠిక అనే గౌరవ ప్రదమైన చిహ్నం గా   కంఠాభరణా న్ని ధరించి ., దానికి రణమర్ధ కంఠీయము అనే పేరు పెట్టాడు ?

ఎ )రణమర్ధ  (రణమర్ధక కంఠీయాన్ని , కులధనము గా భావించి , తర్వాత తరాల వారు కుల దేవత గా భావించి పూజించారు).

 

12)ఎవరి అభ్యర్ధన మేరకు కీపర్రు అనే గ్రామాన్ని దానం చేశారు ?

ఎ )కుసుమా యుధ అభ్యర్ధమేరకు, చాళుక్య భీమ I  ఇచ్చాడు

 

13) ముదిగొండ చాళుక్యులలో ఎవరికి రాజ్యశ్రీ అనే బిరుదు ఉంది ?

ఎ )విజయాదిత్య గొణగ  సోదరుడైన నిరవాద్య కు 

14) ముదిగొండ చాళుక్యులలో ఎవరికి వినిత జనాశ్రయ అనే బిరుదు ఉంది ?

ఎ )  కుసుమాయుధ II

 

15) కుసుమాయుధ II కాలం లో పరిపాలన రాజ్యం ఎక్కడెక్కడివరకు వ్యాపించి ఉంది ?

ఎ ) మంచి కొండ , కొరవి , కొండపల్లి వరకు వ్యాపించింది

16)కుసుమాయుధ II  కి ఏది నిరావాద్య నుండి అనువంశికంగా వచ్చింది ?

ఎ ) కొరవి

17) కుసుమాయుధ III కి ఎంత మంది కుమారులు ?

ఎ ) నలుగురు    వారు : 1)గొణగ   2)నిజ్జయరాజ    3)మల్లప  4)లోభచాలక 

 

18) ఎవరి  కాలం లో కొరవి నుండి గుండ్యన వరకు గల కాకతీయ కుటుంబానికి  చెందిన ప్రాంతాలు ముదిగొండ చాళుక్యులు పోగొట్టుకున్నారు ?

ఎ) బేతరాజు I  ( క్రీ.శ 1075 – క్రీ. శ. 1100 )

 

19) బేతరాజు I  ( క్రీ.శ 1075 – క్రీ. శ. 1100 ) ను బలవంతం గా ఎక్కడికి పంపించారు ?

ఎ ) బొత్తు అనే గోదావరి పరీవాహక ప్రాంతానికి పంపారు

 

20) ఎందువల్ల కొరవి రాజ్య బొత్తు నాయకులు గా ముదిగొండ చాళుక్యులు  పేరు పొందారు ?

ఎ ) బేతరాజుని బలవంతం గా బొత్తు అనే గోదావరి పరీవాహక ప్రాంతానికి పంపారు . అయినా ఆయన కొరవి ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశారు . అప్పటి నుండి కొరవి రాజ్య బొత్తు నాయకులు గా పేరు పొందారు

 

21) ఏ శాసనం వల్ల  క్రీ.శ . 1124  లో ఎర్ర రాజు , బొట్టు బేతరాజు శత్రువులను సంహరించి కొరవి రాజ్యాన్ని అతనికి అప్పగించినట్లు పేర్కొనబడినది ?

ఎ ) విరియాల మల్ల గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎర్ర రాజు , బొట్టు బేతరాజు శత్రువులను సంహరించి కొరవి రాజ్యాన్ని అతనికి అప్పగించినట్లు పేర్కొనబడినది

 

 

22) కుసుమయుధ V కి గల బిరుదు ఏది ?

ఎ) ముత్త నేగేళ్ల

 

23 ) ఎవరికి వినిత జనాశ్రయ అనే బిరుదు ఉంది ?

ఎ ) బొత్తు బేత

24) బొత్తు బేత కి ఇరువురు కుమారులు . వారి పేర్లు ఏవి ?

ఎ ) కుసుమాదిత్య VI  మరియు నాగతిరాజ

 

 

25 ) నాగతి రాజ బిరుదు ఏది ?

ఎ) వివేక నారాయణ

 

26)కాకతీయ గణపతి దేవుని అధిక బల సంపన్నమైన సైన్యం చేతిలో ఓడిపోయి , తన విసురు నాడు ప్రాంతాన్ని వదలి పోయిన ముదిగొండ చాళుక్య  వంశం లో ఆఖరి రాజు  ఎవరు ?

ఎ ) నాగతి రాజ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

Notes prepared by : Praturi Potayya Sarma

 

కల్యాణి చాళుక్యులు (క్రీ. శ.973 – క్రీ. శ. 1180 )

(వీరు తమని  పశ్చిమ చాళుక్యులు అని చెప్పుకున్నారు .

వీరు బాదామి చాళుక్య వంశస్థుల మని చెప్పుకున్నారు )

 

తైల I

 

 


విక్రమాదిత్య IV

 

తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  )

ఇతను రాష్ట్ర కూటులను పడ  దోసి స్వతంత్ర రాజ్యం ను స్థాపించాడు

ఇతని రాజధాని : మాన్యఖేట

ఇతని కాలం నుండి తెలంగాణ లో పశ్చిమ చాళుక్యుల ప్రభావం ఉంది

 

 


సత్యాశ్రయ (క్రీ. శ.997  – క్రీ. శ. 1008  )

ఇతని మరో పేరు : “ఇర్వి బెడంగ సత్యాశ్రయ”

ఇతని పట్టపు రాణి పేరు : దేవ కబ్బె

దేవ కబ్బె కరీంనగర్ జిల్లాలో గల చొప్ప దండి లో నివసించి

అక్కడ దివ కేశ్వరాలయాన్ని నిర్మించింది

 

 

విక్రమాదిత్య (క్రీ. శ.1008  – క్రీ. శ. 1015  )

 

 


జగదేక మల్ల జయ సింహా II (క్రీ. శ.1015  – క్రీ. శ. 1042  )

వీరి కాలం నాటి శాసనాలు  తెలంగాణ లో అనేక శాసనాలు లభ్యమయ్యాయి

 

 

 


త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  )

1)ఇతను రాజధానిని మాన్య ఖేట (మాల్కెడ) నుండి కల్యాణి కి మార్చాడు

2)ఇతని సమయం లోనే కాకతీయులు కూడా వెలుగు లోకి వచ్చారు

3) సోమేశ్వరుడు,   అనుమకొండ  విషయ  ని ప్రోల రాజు I చేసిన సేవలను గుర్తించి కానుకగా ఇచ్చాడు

 

 

విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  )

1)ఇతని కాలం లో పొట్లకేరె (హైదరాబాద్ దగ్గర గల పటాన్ చెరువు ) , కొల్లి పాకె (కుల పాక్ లేదా కొలను పాక ) లను సైనిక శిబిరాలుగా ఉపయోగించారు

2)హైదరాబాద్ నుండి శనిగరం వెళ్ళే రహదారి సైనిక దళాలకు ప్రధాన మార్గం గా ఉపయోగ పడింది

3)శనిగరం (వరంగల్ జిల్లా / కరీం నగర్ జిల్లా ) పశ్చిమ చాళుక్య సైన్యానికి సైనిక శిబిరంగా ఉపయోగ పడింది

4)ఇతని కాలం లోనే కరీం నగర్ జిల్లాలోని పొలాస్ ప్రాంతాన్ని పాలించిన పోలవాస నాయకులు రాజకీయ ప్రాధాన్యం పొందారు 

5)పొలావాస నాయకుల  వంశానికి చెందిన మేడ రాజు I , జగ్గదేవుడు I,

 మేడ రాజు II , మంత్ర కూట గుండరాజు

అనే నలుగురు ముఖ్యమైన రాజులు ఈ ప్రాంతాన్ని 60 సంవత్సరాలు పాలించారు . వీరి పాలన లోనే పొలాస్ లోని పౌలస్తేశ్వరాలయం , విక్రమాల జీనాలయం నిర్మించి వాటికి విరాళాలను ఇచ్చారు

 

6)తెలంగాణ లో తైలా III , సోమేశ్వర IV  పాలనా సమయం లో పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యం అంతరించింది .

ఈ సమయం లో దక్కను ప్రాంతం లో మూడు ప్రధాన రాజ్య వంశాలైన

(i)కాకతీయ ( వరంగల్ ), (ii)యాదవులు లేదా సౌనులు (దేవగిరి ) ,

(iii) హొయసాలలు (ద్వార సముద్రం ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి  

 

Model questions on Kalyani  Chalukyulu

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

కల్యాణి చాళుక్యులు (క్రీ. శ.973 – క్రీ. శ. 1180 )

1)ఎవరు  తమని  పశ్చిమ చాళుక్యులమని  అని చెప్పుకున్నారు  మరియు  బాదామి చాళుక్య వంశస్థుల మని చెప్పుకున్నారు ?

ఎ)కల్యాణి చాళుక్యులు

2)కల్యాణి చాళుక్యులలో ప్రసిద్ధి పొందిన  మొదటి  రాజులు ఎవరు ?

ఎ ) తైల I మరియు  విక్రమాదిత్య IV

3) ఎవరు రాష్ట్ర కూటులను పడ  దోసి స్వతంత్ర రాజ్యం స్థాపించాడు ?

ఎ ) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  )

4) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  ) రాజధాని ఏది ?

ఎ ) మాన్యఖేట

5) ఎవరి  కాలం నుండి తెలంగాణ లో పశ్చిమ చాళుక్యుల ప్రభావం ఉంది ?

ఎ ) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  )

6) “ఇర్వి బెడంగ సత్యాశ్రయ” అనే మరో పేరు ఎవరికి ఉంది ?

ఎ ) సత్యాశ్రయ (క్రీ. శ.997  – క్రీ. శ. 1008  )

7) సత్యాశ్రయ (క్రీ. శ.997  – క్రీ. శ. 1008  ) పట్టపు రాణి ఎవరు ?

ఎ ) దేవ కబ్బె

8)కరీంనగర్ జిల్లాలో గల చొప్ప దండి లో నివసించి దివ కేశ్వరాలయాన్ని నిర్మించిన  పట్టపు రాణి ఎవరు ?

ఎ ) దేవ కబ్బె

9) విక్రమాదిత్య ఏ కాలం లో పరి  పాలన చేశాడు ?

ఎ) క్రీ. శ.1008  – క్రీ. శ. 1015 

10 ) ఎవరి  కాలం లో   తెలంగాణ లో  కల్యాణి చాళుక్యుల అనేక శాసనాలు లభ్యమయ్యాయి ?

ఎ )జగదేక మల్ల జయ సింహా II (క్రీ. శ.1015  – క్రీ. శ. 1042  )

11) ఎవరు రాజధానిని మాన్య ఖేట (మాల్కెడ) నుండి కల్యాణి కి మార్చాడు ?

ఎ )త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  )

12) త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  ) కాలం లో వెలుగు లోకి వచ్చింది ఎవరు ?

ఎ ) కాకతీయులు

13) ఎవరు అనుమకొండ  విషయ  ని ప్రోల రాజు I చేసిన సేవలను గుర్తించి కానుకగా ఇచ్చాడు ?

ఎ )త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  )

14) ఎవరి  కాలం లో పొట్లకేరె (హైదరాబాద్ దగ్గర గల పటాన్ చెరువు ) , కొల్లి పాకె (కుల పాక్ లేదా కొలను పాక ) లను సైనిక శిబిరాలుగా ఉపయోగించారు ?

ఎ ) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  )

15) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  ) కాలం లో  హైదరాబాద్ నుండి శనిగరం వెళ్ళే రహదారి  ఎవరికి ప్రధాన మార్గం గా ఉపయోగ పడింది ?

ఎ )సైనిక దళాలకు

16) ఏది  పశ్చిమ చాళుక్య సైన్యానికి సైనిక శిబిరంగా ఉపయోగ పడింది ?

ఎ ) శనిగరం (వరంగల్ జిల్లా లోది గాని / కరీం నగర్ జిల్లా లోది గాని  )

17) ఎవరి పాలనా కాలం లోనే కరీం నగర్ జిల్లాలోని పొలాస్ ప్రాంతాన్ని పాలించిన పొలవాస నాయకులు రాజకీయ ప్రాధాన్యం పొందారు ?

ఎ ) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  )

18)  60 ఏళ్ళు పాలించిన  పొలావాస నాయకుల  వంశానికి చెందిన నాలుగు ముఖ్య రాజులు ఎవరు ?

ఎ )మేడ రాజు I , జగ్గదేవుడు I,  మేడ రాజు II , మంత్ర కూట గుండరాజు

19) ఎవరు పొలాస (కరీంనగర్ జిల్లా ) లోని పౌలస్తేశ్వరాలయం , విక్రమాల జీనాలయం నిర్మించి వాటికి విరాళాలను ఇచ్చారు ? 

ఎ ) 60 ఏళ్ళు పాలించిన  పొలావాస నాయకుల  వంశానికి చెందిన నాలుగు ముఖ్య రాజులు మేడ రాజు I , జగ్గదేవుడు I,  మేడ రాజు II , మంత్ర కూట గుండరాజు

20) తెలంగాణ లో ఎవరి  పాలనా సమయం లో పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యం అంతరించింది  ?

ఎ ) తైలా III , సోమేశ్వర IV  

21)   తైలా III , సోమేశ్వర IV  సమయం లో దక్కను ప్రాంతం లో  ఏ మూడు ప్రధాన రాజ్య వంశాలు  ప్రాధాన్యం సంతరించుకున్నాయి   ?

ఎ )(i)కాకతీయ ( వరంగల్ ), (ii)యాదవులు లేదా సౌనులు (దేవగిరి ) ,

(iii) హొయసాలలు (ద్వార సముద్రం )

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I / GROUP IV  EXAMS.

TSLPRS SUB-INSPECTOR /CONSTABLE EXAMS.

 Prepared by : Praturi Potayya Sarma

 

శాతవాహనుల అనంతర కాలం (క్రీ. శ.3 వ శతాబ్దం – క్రీ. శ. 12 వ శతాబ్దం ) -  పరిపాలన

 

1)శాతవాహనుల అనంతర కాలం   లో అతి పెద్ద విభాగం పరిపాలనా పరం గా రాష్ట్రం ఉండేది. దీనికి ఎవరు ఆధిపత్యం వహించేవారు ?

జవాబు : మహాసేనాధిపతి

2)రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించారు . అవి ఏవి ?

జవాబు : దేశ మరియు విషయ

3)రాజ్యం లో అతి చిన్న పరిపాలనా విభాగం ఏది ?

జవాబు : గ్రామం / పల్లెలు

4)గ్రామ పెద్దను ఏమనేవారు ?

జవాబు : మహా తల్వార

5) న్యాయాధికారిని ఏమనేవారు ?

జవాబు : మహా దండనాయక

6)చాళుక్యుల కాలం నుండి తెలంగాణా ప్రాంతం లో పరిపాలనా పద్ధతులు అన్నీ ఏ వ్యవస్థను పోలి ఉండేవి ?

జవాబు : కన్నడ రాజ్య

7) తెలంగాణా ప్రాంతం 50 – 70 గ్రామా ల సమూహంతో కూడిన రాష్ట్రాలు , వేటిగా విభజించబడ్డాయి ?

జవాబు : విషయలు మరియు భుక్తి లు గా

8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ)రాష్ట్రపతి : సైన్యానికి పౌర సంబంధమైన పరిపాలనకు ఆధిపత్యం , కొన్ని సందర్భాలలో సామంత రాజు లాగా భోగాలను అనుభవించేవాడు

బి )విషయపతి ‘: వ్యవహార విషయాలలో    రాష్ట్రపతి కి సరిసమానంగా ఉండేవాడు  

సి) భోగపతి : పన్ను వసూలు , రాబడి మొదలైన విషయాలకు అధిపతిగా ఉంటూ గ్రామాధికారియైన నల్గా వుండా / గవుండా ల సహకారంతో పరిపాలన సాగించేవాడు

డి ) పైవన్ని

జవాబు : డి

9)శాసనాల ద్వారా ఎవరెవరున్నారని తెలుస్తోంది ?

ఎ )పెర్ గడ్డె

బి )సేన బోవ /గ్రామ గణకుడు (Village Accountant)

సి ) సేనాధిపతి (Commander of Army); ఎక్కటే (Warrior Class) లేదా సైనిక కుటుంబం

డి ) పైవన్ని

జవాబు : డి

 

10)ఇక్ష్వాకుల రాజధాని ఏది ?

జవాబు : విజయపురి

11) ఇక్ష్వాకుల తర్వాత , నాటి వర్తక వ్యాపారాలలో పేరు పొందిన దానాలు చేసిన వారు ఎవరు / కట్టడాలు కట్టిన వారు ఎవరు ?

జవాబు : నిగమ ; శ్రేణి ; వనిజ ; లేదా శెట్టి

12)ఇక్ష్వాకుల కాలం నాటి నాణాలు ఎలాంటివి ?

జవాబు : చిన్నవి                          

13) విష్ణుకుండినులు ఎలాంటి నాణాలు ఇచ్చేవారు ?

జవాబు : రాగి పూత పూసిన ఇనుప నాణాలను

14) మరట్లు , మత్తర్ , నివర్తన , ఖండుగ, రాజమాన ‘, రాచమాన అనే పదాలు దేనికి సంబంధించినవి ?

జవాబు : భూముల  చిన్న కొలత ప్రమాణాలు

15) శాసనాలలో తెలిపిన  వివిధ రకాల నేలల గురించి   తెలుపండి ?

 ఎ )నీరు నేల / పానీయ క్షేత్రం

బి )పన్నస / చిత్తడినేల

సి ) రాజ్య భూమి ;   మరియు పూదొంట/పూవిన తొంట

జవాబు : పైవన్నీ

16)కృత్రిమ మైన జలాశయాలను  ఏమని పిలిచేవారు ?

జవాబు : కేరె , సముద్రం , కుంటలు , తటకాలు అని పిలిచేవారు

17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (కృత్రిమ జలాశయం : ఉన్న ప్రాంతం )

ఎ ) మది వోజన కెరె  : మెదక్

బి ) భీమ సముద్రము : మహబూబ్ నగర్

సి ) బృహత్ తటాక : నల్గొండ

డి ) పైవన్నీ

జవాబు : డి

18) అచ్చెబ్బె సముద్ర ఎక్కడుంది ?

జవాబు : చొప్పదండి

19) డ్రమ్మాలు , అరువణాలు ఏవి ?

జవాబు : నాణాలు

20) అయ్యవోళి 500 , ఉభయ నానాదేశి , నకరము ఏమిటి ?

జవాబు : వ్యాపార సంస్థలు

21)మహామండేలేశ్వర , మహా సామంతాధిపతి, మహాజన , గవుండ , పెర్ గడె నల్ గవుండ , సేన బోవ , ఎక్క టె  ఏమిటి ?

జవాబు : పరిపాలన సంఘాలు

22) ఇక్ష్వాకు వంశం లో ఎవరి వల్ల బౌధ్ధ మతం మిక్కిలి పోషించ బడింది ?

జవాబు : రాణులు

23) నాగార్జున కొండ, నేల కొండపల్లి , అనుపు , నంది కొండ (నల్గొండ ) లలో బౌధ్ధ మతం లో గల ఏ శాఖలకు ముఖ్యప్రాంతాలు అయ్యాయి ?

జవాబు : తెరవాద మరియు మహాయాన   

24) వేములవాడ చాళుక్య రాజు  , అరికేసరి II కాలం లో ఏది నిర్మించ బడింది ?

జవాబు : త్రిభువన తిలక బా(వా )సడి  అనే జైన ఆలయం

25) శుభ దమ్మ జినాలయం ఎవరు నిర్మించారు ? (దీనిలో జైన కవి సోమదేవుడు ప్రధాన గురువుగా నియమించబడ్డాడు )

జవాబు : బద్దెగ

26)పటాన్ చెరువు , బోధన్ , ఉజ్జిలి , కొలను పాక , పెద కొడుమూరు , తొగర కుంట  దేనికి సాక్షి గా నిలిచాయి ?

జవాబు : ప్రముఖ జైన ప్రాంతాలు గా 

27) విజయ పురి లో ఏవి నిర్మించ బడ్డాయి ?

జవాబు : యాగ శాల , పుష్ప భద్ర (శివ ) , మహా సేన , అష్ట భుజ (విష్ణు ) , హారతి ( శక్తి )

28) విజయ పురి దగ్గర లో గల మంచికల్లు ప్రాంతం లో ఏవి నిర్మించబడ్డాయి ?

జవాబు : నాగేశ్వర స్వామి , హాలమ్ ప్రస్వామి , జీవ శివ స్వామి  వార్ల  దేవాలయాలు

29) శ్రీశైల క్షేత్ర మతానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఏవి ?

జవాబు : త్రిపురాంతకం (తూర్పు ) , సిధ్ధవటము (దక్షిణ ) , ఉమామహేశ్వరం (ఉత్తర ) , అలంపూర్(పడమర )

30)ప్రముఖ వైష్ణవ మాట ప్రాంతాలు ఏవి ?

జవాబు : బూరుగు గడ్డ , మక్తల , లింగగిరి

31) ఇక్ష్వాకుల కాలం లో శ్రీ పర్వతం దేనిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది ?

జవాబు : బౌధ్ధ మత అధ్యయనానికి

32)ఉద్యోతన (8వ శతాబ్దం ) ప్రాకృత భాషలో దేన్ని రచించాడు ?

జవాబు : కువలయమాన (దీనిలో విజయపురి గురించి ఉంది )

33)నాగార్జున కొండలో ఉండి నాగార్జునుడు దేన్ని బోధించాడు ?

జవాబు : మాధ్యమిక తత్వ శాస్త్రాన్ని

34)  విష్ణు కుండినుల కాలం లో వైదిక మత వ్యాప్తి వల్ల వేటి నిర్మాణం జరిగింది ?

జవాబు: ఘటికలు

35) ఏ శతాబ్ది చివరి భాగం లో తెలుగు భాష నెమ్మదిగా ప్రాచుర్యం లోకి వచ్చినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది ?

జవాబు : 9వ శతాబ్దపు చివరి భాగం లో

36 ) ఇక్ష్వాకులు నిర్మించిన స్థూపాలు , విహారాలు , చైతన్య నిర్మాణాలలో వేటిని బాగా అనుకరించారు ?

జవాబు : మధుర , అమరావతి , కుషాణుల శిల్ప శైలిని

37) ఎప్పటి నుండి విజయ పురి ప్రాంతాలలో చాలా వైదిక సంప్రదాయ కట్టడాలు నిర్మించబడ్డాయి ?

జవాబు : ఎహువల చాంతమూలు ని పాలన లో 10వ సంవత్సరం నుండి

38) ఏది ఆలయ నిర్మాణాలకు నాంది గా నిలిచింది ?

జవాబు : పుష్ప భద్రాలయం

39 ) 7వ శతాబ్దం నుండి బాదామి చాళుక్యులు ఆలయ నిర్మాణం లో నూతన శైలిని ప్రవేశ పెట్టారు . దాని పేరు ఏమి ?

జవాబు : వేసర

40) వేసర దేని సమ్మిళితం ?

జవాబు : ఉత్తర భారతం లో గల నగర , దక్షిణ భారతం లో గల ద్రవిడ శైలి ల సమ్మిళితం

41) వేముల వాడ చాళుక్యులు దేన్ని విరివిగా ఉపయోగించారు ?

జవాబు : వేసర

42) ఎక్కడి శివాలయాలలో వేసర శైలిని చూడగలము ?

జవాబు : అలంపూర్‌ (గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది )

43) ఏ జైన దేవాలయాలలో వేసర శైలిని చూడగలము ?

జవాబు : వేములవాడ , శనిగరం , కోరుట్ల , కొలనుపాక 

 

 

 

 

 

 

 

 

 

TELANGANA HISTORY -   QUESTION AND ONE WORD ANSWERS

1. భారతదేశంలో అతిపెద్ద 2వ జైన మత క్షేత్రం?

కొలనుపాక

2. నిజాం స్థాపించిన అరబ్బీ పరిశోధన అధ్యయన సంస్థ?

దాయరత్‌ – ఉల్మ్‌-మారిఫ్‌

3. భక్త రామదాసు వ్రాసిన మొత్తం కీర్తనలు 198, కాగా అందులో సంస్కృత భాషలో వ్రాసినవి ఎన్ని?16

4. హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ పోరాటం-నా అనుభవాలు జ్ఞాపకాలు – రచయిత?

 – స్వామి రామానందతీర్థ

5. ఇటీవల విడుదలైన రజినీకాంత్‌ సినిమా ‘కబాలి’లో, రజినీకాంత్‌ జైలులో ఉన్నప్పుడు చదివిన పుస్తకం – My Father Balaiah రచయిత ఎవరు?

వై. సత్యనారాయణ

6. ”సాగిపోవుటే – జీవితం – ఆగిపోవుటే మరణం” అన్న గొప్ప తెలంగాణ కవి?

కాళోజీ నారాయణరావు

7. ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తెలంగాణ సారస్వత పరిషత్‌గా మార్చిన సంవత్సరం?

 2015 ఆగస్టు

8. భవన నిర్మాణ కూలీగా హైదరాబాద్‌వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యపరిచే కవితలు వ్రాసినవారు?

 – డా|| అందెశ్రీ

9. తొలి ప్రపంచ తెలుగు మహాసభలు ఏ సంవత్సరంలో జరిగినవి?

 1975

10. ”కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం” ఎక్కడ స్థాపించబోతున్నారు?

 – వరంగల్‌

11. నిజాం ఉర్దూ భాషను బోధనా భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?

 1920

12. 1952లో నెహ్రూ పిలుపుమేరకు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన తెలంగాణ మహాకవి?

 – కాళోజీ (వరంగల్‌)

13. అంపశయ్య నవీన్‌ అసలు పేరు?

 – దొంగరి మల్లయ్య

14. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట ఏ ఋషి పేరుతో వచ్చింది?

ఋష్యశృంగుని కుమారుడు యాదవరుషి

15. మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన కవి?

గడియారం రామకృష్ణశర్మ

16. నాగార్జునకొండలో ఎన్ని బౌద్ధ ఆరామాలు కలవు?

 – సుమారు 30

17. ”సర్దార్‌ సర్వాయి పాపడు” – పుస్తక రచయిత?

 – ముక్కామల

18. ”దత్తాత్రేయ స్వామి” ఆలయం తెలంగాణలో ఎక్కడ వుంది?

మహబూబ్‌నగర్‌జిల్లాలోని ‘మక్తల్‌’

19. దాశరథి కృష్ణమాచార్య తన ‘తిమిరంలో సమరం’ ఎవరికి అంకితం ఇచ్చారు?

తన ‘అమ్మ’గారికి

20. ‘ప్రథమాంధ్ర దేశీయ’ పురాణాన్ని (వ్రాసింది ఎవరు?) – ”బసవపురాణం” అంటారు.

పాల్కురికి సోమనాథుడు

21. తొలియోగ శాస్త్రరచన చేసిన తెలంగాణ కవి?

 – పరశురామ పంతులు లింగమూర్తి – ”శివయోగసారం”

22. మున్సబ్‌దార్‌ పదవిని వదిలేసి – సంఘ సంస్కర్తగా మారినది?

రావిచెట్టు రంగారావు

23. మొహరం ఫోక్‌ సాంగ్స్‌ ఇన్‌ తెలుగు – (1964)?

 బిరుదురాజు రామరాజు

24. తెలుగులో లలితగీతాలపై తొలి పరిశోధనచేసిన తెలంగాణ వ్యక్తి?

డా. వడ్డేపల్లి కృష్ణ

25. తెలుగులో తొలిసారిగా ఉర్దూ ప్రక్రియలైన ”గజల్స్‌” ”రుబాయీ”లను ప్రవేశపెట్టిన కవి?

దాశరధి కృష్ణమాచార్య

26. ఘంటసాల పాడిన పాటలలో ఏ కవి వ్రాసినవి ఎక్కువ?

డా|| సి. నారాయణరెడ్డి

27. ‘పేరిణి’ నృత్యాన్ని ప్రచారంలోకి తెచ్చిన నృత్యకారుడు?

డా|| నటరాజ రామకృష్ణ

28. ‘హైదరాబాద్‌ సంస్థానోద్యమ చరిత్ర’ వ్రాసింది?

కాటం లక్ష్మీనారాయణ

29. తెలంగాణలో (హైద్రాబాద్‌లో) ప్రప్రథమ సంస్కృత గ్రంధాలయాన్ని స్థాపించింది?

 – రావిచెట్టు రంగారావు

30. రామాయణాన్ని 108సార్లు లిఖించిన కవి?

నరహరి గోపాలాచార్యులు

31. ‘లలిత కళా సమితి’ సంస్థను స్థాపించిన సిద్ధిపేట చిత్రకారుడు?

 – కాపు రాజయ్య

32. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రచురణ సంస్థ?

విజ్ఞాన చంద్రికాగ్రంథ మండలి

33. హైద్రాబాద్‌లో ‘ఎర్రగడ్డ’ పిచ్చి ఆసుపత్రి ఏ సంవత్సరంలో నిర్మించబడింది ?

  1897

34. దేవరకొండ ‘గాంధీ’ అని ఎవరిని అంటారు?

మునగాల కొండల్‌రావు

35. తెలంగాణలో తొలి రైతు కావ్యం వ్రాసింది?

గంగుల శాయిరెడ్డి

సిలివేరు లింగమూర్తి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తెలంగాణాలో సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )(Part – 1 )

                                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ

                                                                                                                8143189271

1)హైదరాబాద్ సంస్థానం లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతలేవి ?

a) తెలంగాణా  b)మరాఠ్వాడ c) కర్ణాటక

జవాబు : పై మూడు

2) గతం లో ఎవరి అధీనం స్వాధీనం లో వేల ఎకరాల భూము లుండేవి ?

జవాబులు : జగిర్దారులు ,జమిందారులు, సంస్థానాధి పతులు , దేశ్ ముఖ్ లు, దేశ్ పాండే లు  

3) 19 వ శతాబ్దం రెండవ భాగం లో హైదరాబాద్ వచ్చిన సాహితీ వేత్తలు ఎవరు ?

జవాబు : మీర్జా ఖాన్ ధాఘ్ , హఫీజ్ జలీల్ హసన్ జలీల్ , మౌన్షి అమీర్ , అహ్మద్ మి నై

4) ఏ ప్రముఖ ఉర్దూ కవి  హైదరాబాద్ కు వలస వచ్చారు ?

జవాబు : అమీర్ రాంపూర్

5) ఉర్దూ భోధన భాషగా ప్రారంభమైన విశ్వ విద్యాలయం ఏది ?

జవాబు : ఉస్మానియా విశ్వవిద్యాలయం

6) ఉర్దూ భాషాభి వృద్ది కోసం మౌల్వి అబ్దుల్ హక్ దేన్నీ ప్రారం భించారు ?

జవాబు : అంజుమన్ తారక్ – ఇ – ఉర్దూ

7) తెలంగాణా లో ఒద్దిరాజు సోదరులు గా పేరొందిన సీతారాం చందర్ రావు , రాఘవ రంగా రావు లు 1920 లో దేన్నీ ప్రారంభిం చారు ? ఇది వరంగల్ జిల్లా లోని ఇనుగుర్తి గ్రామం నుండి వెలువడేది .

జవాబు: ‘తెలుగు ‘ వార పత్రిక

8) నల్గొండ నుండి ‘నీల గిరి ‘ వార పత్రిక ఎవరి సంపాదకత్వం లో వెలువడేది ?

జవాబు : షబ్నవీసు రామ నర్సింహా రావు

9) ఎవరి సంపాదకత్వం లో డెక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పత్రిక వెలువడింది ?

జవాబు : బుక్క పట్నం రామాచార్యులు

 

10) సురవరం ప్రతాప రెడ్డి రాసిన ముఖ్య గ్రంధం ఏది ?

జవాబు : ఆంధ్రుల సాంఘిక చరిత్ర .  

చంపకి భ్రమర విషాదం , ప్రేమార్పణం , హిందువుల పండుగలు , హైందవ ధర్మ వీరులు , రామాయణ విశేషములు ఆయన రాసిన ఇతర  గ్రంధాలు .

11     )1925 గోల్కొండ పక్ష పత్రిక స్థాపించి , సంపాద కత్వం నిర్వహించింది ఎవరు ?

జవాబు : సురవరం ప్రతాప రెడ్డి

12) బూర్గుల రామకృష్ణ రావు రాసిన పుస్తకాలేవీ ?

జవాబు : పండిత రాజ పంచామృతం , కృష్ణ శతకం

13)ఎవరిని అభినవ పోతన అంటారు ?

జవాబు : వానమామలై వరదాచార్యులు

14)వానమామలై వరదాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?

జవాబు : పోతన చరిత్ర , విప్ర లబ్ధ

15)మాడపాటి హన్మంత రావు రాసిన గ్రంధం ఏది ?

జవాబు : తెలంగాణా లో ఆంధ్రోద్యమం

16)1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం లోని వివిధ ఘట్టాలను ఎవరు తన పుస్తకం ‘వీర తెలంగాణా ‘ గ్రంధం లో రాసారు ?

జవాబు : రావి నారాయణ రెడ్డి 

17)1943 లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థా పించారు . దీని మొదటి అధ్యక్షుడు ఎవరు ?

జవాబు : లోకనంది శంకర నారాయణరావు

18)దాశరధి కృష్ణ మాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?

జవాబు : అగ్ని ధార , రుద్ర వీణ

19)‘నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘ అనే మకుటం తో గేయాలు రాసిన దేవరు ?

జవాబు : దాశరధి కృష్ణమా చార్యులు

20)దాశరధి రంగా  చార్యులు రాసిన నవలలు / పుస్తకాలేవి ?

జవాబు : చిల్లర దేవుళ్ళు , జానపదం 

21)‘ప్రజల మనిషి ‘ , ‘ గంగు ‘ , రామప్ప రభస అనే సాంఘిక , ఆర్ధిక నేపధ్య నవలలు రాసిన దేవరు ?

జవాబు : వట్టికోట ఆళ్వారు స్వామి

22)హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అనే గ్రంధాలయం ఎప్పుడు స్థాపించారు ? ఇది తెలంగాణా లో తొలి తెలుగు గ్రంధాలయం .

జవాబు : 1901

23)ఎవరి కృషి వల్ల హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అనే గ్రంధాలయం 1901 స్థాపించారు?

జవాబు:కొమర్రాజు లక్ష్మణ రావు , రావి చెట్టు రంగా రావు , మునగాల రాజా  , నాయని వెంకట రంగారావు

24)1905 లో దేన్నీ స్థాపించారు ?

జవాబు : శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం

25)సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం ఎప్పు డు స్థాపించారు ?

జవాబు: 1905

26)1906 లో ఎవరు విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ని స్థాపించారు ?

జవాబు : కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు  (దీన్ని 1908 లో మద్రాస్ కు తరలించారు )

27)గ్రంధాలయో ద్యమానికి కృషి చేసిన దేవరు ?

జవాబు: కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు , వట్టికోట ఆళ్వారు స్వామి

28)190 6 లో వివేక వర్ధని పాఠ శాల స్థాపించిన దేవరు ? తర్వాత ఇది వివేక వర్ధని విద్య సంస్థ గా అభి వృద్ది చెందింది  

జవాబు : కేశవ రావు కోరట్ కర్ , వామన్ రామచంద్ర నాయక్ , గణపతి రావు హర్దికర్ 

Notes on Kakateeyulu

కాకతీయులు   (క్రీ. శ.956   – క్రీ. శ .1323  )

Prepared by : Praturi Potayya Sarma

                                                    కాకతీయులు

 

సామంత కాకతీయ రాజులు                                               స్వతంత్ర పాలకులు

నృప వెన్న          (దుర్జయ వంశం లో జన్మించాడు )(సుమారు క్రీ. శ.800 - క్రీ. శ .815)                                                                                                                                                                                 

                      మొదటి గుండన ( s/o.వెన్న ) (సుమారు క్రీ. శ.815 ____?)                                                                         

                                         

                  రెండవ గుండన (grand son of వెన్న )  (సుమారు క్రీ. శ. __ ?___   క్రీ.శ.865)            

                                                                                                               

                  మూడవ గుండన  (వెన్న యొక్క మునిమనుమడు )  (క్రీ.శ. 900 కు ముందే మరణించాడు  )                                                                          

                               

ఎరియ రాష్ట్రకూట  s/o.మూడవ గుండరాజు                                              

                    (కొరవి పాలకుడిగా నియమించబడ్డాడు )                                  

బేతియ                                                               

                                                                                                      

నాలుగవ గుండరాజు s/o.బేతియ  (క్రీ. శ.956 శాసనం )       

(కాకర్త్య గుండన, ఇతనికి మరోపేరు )                                                          

           (కొరవి ప్రాంతం లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు )

మొదటి బేత రాజు s/o.నాలుగవ గుండరాజు                                                  

            (క్రీ. శ.1000  - క్రీ. శ.1052 )  (అనుమకొండ నుండి పరిపాలన చేశాడు )

మొదటి ప్రోల రాజు s/o.మొదటి బేత రాజు      

                         (క్రీ. శ.1052  - క్రీ. శ.1076 )

రెండవ బేత రాజు s/o.మొదటి ప్రోల రాజు (క్రీ. శ.1076  - క్రీ. శ.1108 )

      

దుర్గ రాజు s/o.రెండవ బేత రాజు (క్రీ. శ.1108 - క్రీ. శ.1116 )

      

రెండవ ప్రోల రాజు  (దుర్గ రాజు యొక్క జ్యేష్ట సోదరుడు ) (క్రీ. శ.1116  - క్రీ. శ.1157 )

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Notes on Kakateeyulu

కాకతీయులు   (క్రీ. శ.895   – క్రీ. శ .1323  )

Prepared by : Praturi Potayya Sarma

రాజ్య స్థాపకుడు : వెన్న

రాజధానులు : అనుమకొండ  , వరంగల్

భాష  : తెలుగు

మతము : జైన  ,    హిందూ (శైవ )

రాజ చిహ్నాలు : గరుడ  , వరాహ

విదేశీ వర్తకనికి ఓడ రేవు :  మోటుపల్లి

 

                                                    కాకతీయులు

 

                                                                                 

  సామంత కాకతీయ రాజులు                                    స్వతంత్ర పాలకులు

                                                                  రుద్ర దేవుడు (క్రీ. శ.1158 - క్రీ. శ.1195)

                                                                                                                                        s/o. రెండవ ప్రోల రాజు

                                                                                         

                                                                        క్రీ. శ .1163 లో సార్వభౌముడు అయ్యాడు .    

                                         

                                                                       మహాదేవుడు (క్రీ. శ.1196  - క్రీ. శ.1199)

                                                                   (రుద్ర దేవుడి  తమ్ముడు ) (రెండవ ప్రోల రాజు కొడుకు )

                                                                         భార్య : బయ్యమ

                                                                        పిల్లలు : గణపతి దేవ , మైలాంబ , కుందాంబ                    

                               

                                                                             గణపతి దేవుడు (క్రీ. శ.1199  - క్రీ. శ.1262)                          

                                                                                                    (s/o. మహా దేవుడు )

                               భార్య : సోమల దేవి (కూతుళ్ళు : గణపాంబ ; రుద్రమ దేవి

                                 (గణపాంబ ను కోట బేత కి ఇచ్చి పెండ్లి చేశాడు )     

                                                        భార్యలు:నారంబ ;పేరాంబ

                                                                                                      

                                                                      

                                                                                    రుద్రమ దేవి (క్రీ. శ.1262  - క్రీ. శ.1289 )

                                                                                                 (d/o. గణపతి దేవుడు )

                                                                  (భర్త పేరు : చాళుక్య వీరభద్ర ). వీరికి ముగ్గురు పిల్లలు

                                                      1)ముమ్మడాంబ 2)రుద్రమ  3) రుయ్యమ

                                  (1)ముమ్మడాంబ , భర్త పేరు : కాకతి మహాదేవ 

                                  (2)రుద్రమ , భర్త పేరు : యాదవ రాజు  ఎల్లన దేవ

                                  (3) రుయ్యమ , భర్త పేరు : ఇందులూరి అన్నయ మంత్రి

 

                                                              

             

                                                                   రెండవ ప్రతాప రుద్రుడు (క్రీ. శ.1289 - క్రీ. శ.1323

                                                                                     (ఇతను ముమ్మడాంబ పుత్రుడు )

 

 

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)