Bogatha Waterfalls ( called as 'Telangana Nayagara' )

 


 తెలంగాణ నయాగరా : బోగత జలపాతం : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలో దట్టమైన కీకారణ్యంలో పచ్చని చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తూ గోదారి నదిలో మమేకం అవుతుంది తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న నల్లందేవి గుట్ట దగ్గర పుట్టింది బొగత. అక్కడి నుంచి గుట్టల మీదుగా దుర్గమ అరణ్యాలను చీల్చుకుంటూ వాజేడు మండలంలోని పెనుగోలు దగ్గర పాలవాగుగా మారుతుంది. అక్కడి అడవుల్లోని ఔషధ గుణాలను తనలో సంగమించుకొని పెనుగోలు ఊరు దాటాక ఆల్బర్ట్‌ వాగుగా రూపాంతరం చెందుతుంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని గుట్టలను ఒరుసుకుంటూ పారి.. చీకుపల్లికి అర కిలోమీటరు దూరంలోని బండరాళ్ల మీద నుంచి జాలు వారి.. బొగత జలపాతంగా మారుతుంది. గతంలో దీన్ని బంధాల వాగు అనే పిలిచేవారు. బంధాల వాగు బొగత జలపాతంగా మారే ప్రాంతంలో చాలా లోతుగా .. బండరాళ్లపై నుంచి జాలువారుతున్న తరుణంలో నురగలు కక్కుతూ కిందకు దుంకుతుంది … ఇక్కడి గిరిజనులకు ఇదో పవిత్రమైన చోటు …


Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)