Tanks in Telangana and names

   

TANKS AND NAMES IN TELANGANA

 

అన్నిజిల్లాలలో సముద్రమన్న పేరుతో ఉన్న చెరువులు అనేకంగా కనిపిస్తాయి.

1)గణప సముద్రం, ధర్మ సముద్రం, బాలసముద్రం, జగత్కేసరి సముద్రం, కాటసముద్రం, చౌడసముద్రం,విశ్వనాథ సముద్రము, సబ్బి సముద్రం, గౌరన సముద్రం, ఉదయసముద్రం, శ్రీవారి సముద్రం, శనిగరం చెరువు, శివసముద్రం, శంకర సముద్రం, అన్నాసాగర్‌వంటి చెరువులన్నీ కాకతీయుల కాలంలో, అటు తర్వాత నిర్మాణ మైనవి.

 

శాసనకర్తలు వాటిని సముద్రాలుగానే పేర్కొన్నారు.

 

1)మహాకవి పోతన తల్లిగారి పేరుమీద చరువే వెలిసింది.

2)పాల్కుర్కి సోమనసహా కాకతీయ యుగపు కవులు చెరువులన్నిటినీ సముద్రాలుగానే కీర్తించారు.

2)వారికాలంలో, తర్వాత నిర్మాణమైన చెరువులను సమద్రాలని, సాగరాలని కవులు కీర్తించారు.

 

3)మూడు వందల ఏళ్లపాటు కొనసాగిన వారి పాలనకు ప్రధాన భూమిక నీటి వనరులైన చెరువుల అభివృద్ధి, వ్యవసాయరంగ వికాసం, దానివల్ల పెరిగిన ఎగుమతులు, దిగుమతులు.అటు తర్వాత బహుమనీలు, కుతుబ్‌షాహీలు, గద్వాల,వనపర్తి,జటప్రోలు,నారాయణ్‌పూర్‌, గోపాల్‌పేట,దోమకొండ, సిర్నేపల్లి, మెతుకుసీమ సంస్థానాధీశులు కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించారు.

 

4)కుతుబ్‌షాహీలు హుస్సేన్‌సాగర్‌, మాసాహెబ్‌ ట్యాంకు, ఇబ్రహీంపట్నం చెరువులను పునర్నిర్మించి ఆనాటి అవసరాలకు తగినట్టుగా మలిచారు.

 

5)జల్‌పల్లి , హుస్సేన్‌సాగర్‌ చెరువులు 15వ శతాబ్దంలో హైదరాబాద్‌ మంచినీటి అవసరాలను తీర్చాయి

 

6)17వ శతాబ్దంలో చెరువునీటి వివాదం కారణంగా బల్మూరి కొండల్‌ రాయుడు కథ రూపు దిద్దుకోవడం తెలంగాణ నీటి వనరుల ప్రశస్తిని తెలియ చేస్తున్నది.

 

7)ఇందువల్లే కావచ్చు ఆకాశం నుంచి చూస్తే తెలంగాణ చెరువులు ఆకాశంలో చుక్కల వలే కనిపిస్తాయని ఓ విదేశీ పరిశోధకుడు వ్యాఖ్యానించారు.

 

 

 

 

8)శాతవాహన,రాష్ట్రకూటల కాలం నుంచి చెరువులు నిర్మాణంలో రాజవంశాలకు చెందిన మహిళల పాత్ర కనిపిస్తుంది.

 

9)అంతకు మునుపు 9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాణి అక్కా దేవిపాలన కాలంలో జమ్మికుంట చెరువు నిర్మాణం జరిగింది.

 

10)రాణి రుద్రమదేవి కూతురు బయ్యమ్మ, బయ్యారం చెరువును నిర్మించి శాసనం చేశారు.

 

11)రాణి రుద్రమ దేవి రక్త సంబంధికురాలు కుందమాంబ మూడు చెరువులను నిర్మించి శాసనాలను వేశారు.

 

12)కులీకుతుబ్‌షాకు కూతురు హయత్‌బక్షి బేగం మాసాహెబ్‌ టాంక్‌ చెరువును నిర్మించారు.

 

13)రాచకొండరాణి దేవీనాగాంబిక నాగారం గ్రామంలో చెరువును తవ్విస్తూ ఒక శాసనం వేయించారు. అది రాచకొండ చరిత్రకు విలువైన వనరుగా మిగిలింది.

 

14)18వ శతాబ్దంలోనే వనపపర్తికి చెందిన రాణి శంకరమ్మ సప్తసముద్రాలను నిర్మించడం అవి నేటికి వనపర్తి ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండడం తెలిసిందే.

 

15)మెతకుసీమ నేలిన రాణిశంకరమ్మ అనేక చెరువులను నిర్మించారు.

 

16)సిర్నేపల్లి రాణి జానకమ్మ కూడా నిజామాబాద్‌ జిల్లాలో గొప్ప చెరువులను నిర్మించారు.

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)