Questions for Group II Examination : సముద్రపు నీరు చాలా రోజులు వేడెక్కటం చేత బ్లీచింగ్ కి గురౌతున్న ‘గ్రేట్ బారియర్ రీఫ్ ‘ ఏ దేశానికి దగ్గర ఉంది ?

 

విజ్ఞాన విపంచి

మే , 2020

ప్రాతూరి పోతయ్య శర్మ


1)సముద్రపు నీరు చాలా రోజులు వేడెక్కటం చేత బ్లీచింగ్ కి గురౌతున్న ‘గ్రేట్ బారియర్ రీఫ్ ‘ ఏ దేశానికి  దగ్గర ఉంది ?

ఎ )కెనడా

బి)ఆస్ట్రేలియా

సి) USA

డి ) బ్రిటన్

జవాబు :   బి

2) 1987 లో పలు దేశాలు మాoట్రి యల్ ప్రోటో కాల్ పై సంతకం చేయటం వలన ఏ పదార్ధాల వినియోగం తగ్గింది ?

ఎ ) పట్టు  వస్త్రాలు

బి) ఓజోన్ పొర కి హాని కల్గించే రసాయనిక పదార్ధాలు

సి) ఉన్ని వస్త్రాలు

డి )పాదరక్షలు

జవాబు :   బి

3 ) ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఎప్పుడు ఆమోదించారు ?

ఎ )2005

బి)1897

 

సి)1958

డి )1978

జవాబు :బి    

4)రీ యూనియన్ దీవి నుండి ఇండియా , ఫ్రాన్స్ లు తోలి సారిగా జాయింట్ పాట్రోల్ ఎక్సర్ సైజు లు ఎక్కడ చేసాయి ?  

ఎ ) హిందూ మహాసముద్రo  

బి)అట్లాంటిక్ మహాసముద్రం 

సి) పసిఫిక్ మహాసముద్రం

డి ) ఇవేవి కావు

జవాబు :   

5)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ )PLI :ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్

బి) API :యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రేడియంట్స్

సి)ILI : ఇంఫ్లుజా లైక్ ఇల్ నెస్

డి )పైవన్నీ

జవాబు :   డి

6) కేంద్ర కాబినెట్ ఎలక్ట్రానిక్స్ మాన్యు ఫాక్చరింగ్ కోసం సుమారు రు.48,000 కోట్ల ప్లాన్ ఆమోదించింది . దీని వివరాలు ఏవి ?  

ఎ )ఈ రంగం లోకి కొత్తగా రు.50,000 పెట్టుబడులు ఆకర్షించ బడతాయని ఆశిస్తున్నారు

బి)దీనిలో 3 స్కీం లు ఉన్నాయి

సి)ప్రత్యక్షం గా 5 లక్షల మందికి , పరోక్షం గా 15 లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి 

డి )పైవన్నీ

జవాబు :   డి

7)ఏ వ్యాధుల్ని నిరోధించటానికి టీకా మందులు ఉన్నాయి ?

ఎ ) పోలియో

బి) టెటానస్ , డిప్తిరియా , స్మాల్ పాక్స్

సి) టైఫాయిడ్

డి )పైవన్నీ

జవాబు :    డి

8)USA లో mRNA-1273 ని ఉపయోగించి COVID-19  కి టీకా మందు తయారు చేస్తున్నారు . టీకా మందుల్ని ఎన్ని రకాలుగా తయారుచేయవచ్చును ?

ఎ ) వ్యాధిని కల్గించే ఏజెంట్ (పాథోజెన్ ) ని ఉపయోగించి టీకా మందు తయారు చేయటం ; పాథోజెన్  ని శరీరం  బయట పెంచి , ప్యూరిఫై చేసి , రసాయనాలతో ఇన్ ఆక్టివేట్ చేసే పధ్ధతి (ఈ విధంగా ఇంజెక్ట బుల్ పోలియో టీకా తయారు చేశారు )

బి) పాథోజెన్ ని జన్యు పరం గా గాని , రిపీటెడ్ కల్చర్ పధ్ధతి తో గాని బలహీన పరచి టీకా మందు తయారు చేయటం ( ఈ విధం గా ఓరల్ పోలియో టీకా మందు తయారు చేశారు )

సి)పాథోజెన్ కి ఉపరితలం మీద ఉండే ప్రోటీన్ ను కృత్రిమ పధ్ధతి లో ఉత్పత్తి చేసి టీకా మందు తయారు చేయటం (హెపటైటిస్ – B టీకా ఇలా తయారు చేశారు )

డి )పై వన్ని

జవాబు :   డి

9)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (COVID-19 వైరస్  కి సంబంధించినవి )?

ఎ )ACE 2 : యాన్ జి యో టెన్సివ్ - కన్వర్టింగ్ ఎంజైం - 2

బి)Mrna-1273: మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ - 1273

సి)స్పైక్ ప్రోటీన్ : SARS-COV-2 వైరస్ చుట్టూ ఉన్న సైకిల్ చక్రపు చువ్వల వంటి వాటిల్లో ఉండేది

డి )పైవన్నీ

జవాబు :   డి

10) G-7 దేశాల మీటింగ్ కు ఏ దేశాల వారు వస్తారు ?

ఎ ) UK,USA

బి)కెనడా , ఫ్రాన్స్ , జర్మనీ

సి)ఇటలీ , జపాన్

డి ) పైవన్నీ

జవాబు :   డి

11)ప్రపంచం లో ‘అత్యధిక సంతోష ‘ దేశం గా ఎంపికైన ఫిన్లాండ్ దేశ ప్రత్యేకతలు ఏవి ?

ఎ )జనాభా : 5.5 మిలియన్ లు

బి) అక్కడ దీర్ఘ కాలం చీకటి ఉండే శీతా కాలం ఉంటుంది

సి)ప్రజలు హై క్వాలిటీ జీవితం , భద్రత, అతి స్వల్ప ‘అసమానతలు మరియు చాలా తక్కువ  బీదరికం’ ; ప్రజలకు ఒకరంటే ఒకరికి అనుబంధం , నమ్మకం , పరస్పర ఆనందం

డి )పైవన్నీ

జవాబు :   డి

12)COVID-19 కేసులు వ్యాపించే పరిశీలనలో BRN (బేసిక్ రి ప్రొడక్షన్ నెంబర్ ) పధ్ధతి వాడుతున్నారు. అంచనా వేయటానికి  SEIR (స సెప్టిబుల్ – ఎక్స్ పోజ్ డ్ ఇన్ ఫె క్టి  యస్ – రెసి స్టంట్ ) మోడల్ వాడుతున్నారు . SEIR పధ్ధతి,   జనాభా ను ఎన్ని రకాలుగా వర్గీ కరిస్తుంది ?

ఎ )స సెప్టిబుల్ : వ్యాధి సోకే రిస్క్ ఉన్న వారు

బి)ఎక్స్ పో జ్ డ్ : వ్యాధి సోకిన వారు ( కాని వారి నుండి వ్యాధి  ఇతరులకు వ్యాపించ లేదు )

సి)ఇన్ ఫె క్టియస్  :వ్యాధి వచ్చింది , అటు వంటి వారి నుండి ఇతరులకు వ్యాధి సోకించ గలవారు ; రెసి స్టంట్ / రి మూవ్ డ్ : వ్యాధి సోకి చని పోయిన వారు (లేక ) వ్యాధి నయమయ్యి కోలుకున్న వారు 

డి ) పైవన్నీ

జవాబు :    డి

13 )భారత రాజ్యంగం లో ని ఆర్టికల్ 80(1 )(a) క్లాజ్ (3)  ప్రకారం భారత రాష్ట్రపతి చేత నామినేషన్ పధ్ధతి లో  రాజ్యసభ (కౌన్సిల్ అఫ్ స్టేట్స్ ) కి సభ్యులు అయిన దెవ్వరు ?

ఎ )రంజన్ గగోయ్

బి)మ్రిణాల్ మిరి

సి)B.B.దత్త  & M.C.మేరి కాం

డి )పై అందరూ

జవాబు :   డి

14)గణిత శాస్త్రం లో ఇచ్చే ఎబెల్ ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు ?

ఎ ) అల్ఫ్రెడ్ నోబెల్

బి) హిల్లెల్ ఫర్ స్టెన్ బెర్గ్ & గ్రెగరీ మార్గులిస్ 

సి) ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 

డి ) ఎడ్మండ్ హిల్లరీ

జవాబు :   బి

15)ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ  కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ . ఒలింపిక్ ఫ్లేమ్ టార్చ్ (ఒలింపిక్ జ్యోతి ) ని ఇటీవల ఏ దేశం లో  జపాన్ కి అంద  జేశారు  ?  

ఎ ) ఫ్రాన్స్

బి) గ్రీస్

సి) ఫిన్లాండ్

డి ) స్వీడన్

జవాబు : బి    

16)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (SARS-COV-2 వైరస్ దేని మీద ఎంత సేపు ఉంటుంది , ఒక విశ్లేషణ /పరిశోధన ప్రకారం )

ఎ ) గాలి లో ( ఉమ్మి తుంపర్ల లో ) :3 గంటలు

బి)ప్లాస్టిక్ మీద : 72 గంటలు

సి) స్టెయిన్లెస్ స్టీల్ మీద : 72 గంటలు ; ( రాగి పత్రాల మీద 4 గంటలు ; కార్డు బోర్డు మీద : 24 గంటలు )

డి ) పైవన్నీ

జవాబు :   డి

17)మేఘాలయ - అస్సాం రాష్ట్రాలలో ప్రవహించి బ్రహ్మ పుత్ర నదిలో కలిసే నది ఏది ?

ఎ ) తీస్తానది

బి) కొపిలి నది

సి) గంగా నది

డి ) హుగ్లీ నది

జవాబు : బి    

18) ‘రుషి కుల్య రూకరి ‘ ఎక్కడ ఉంది ?

ఎ ) తమిళనాడు

బి) కర్ణాటక

సి)గంజాం జిల్లా , ఒడిష

డి ) గోవా

జవాబు :   సి

19)వాయు కాలుష్యం లో ఉంది ‘నైట్రోజన్ ఆక్సైడ్ ‘ వివరాలు ఏవి ?

ఎ ) వాయు కాలుష్యం లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్ , వాతావరణం లో ఒక రోజు ఉంటుంది

బి)ఇది వాహనాల పొగలోను , పరిశ్రమల పొగలోను ,థర్మల్ పవర్ స్టేషన్ ల పొగ లోను విడుదల అవుతుంది

సి)దీని వాళ్ళ శ్వాస కోశాలు ఉబ్బ వచ్చును (వాయుట జరగ వచ్చును )

డి )పైవన్నీ

జవాబు :   డి

20) ‘పాన థేనేయిక్’ (కల్లిమార్మారో ) స్టేడియం ఎక్కడుంది ?

ఎ ) ఈజిప్ట్

బి) ఏథెన్స్ , గ్రీస్ 

సి) లిబియా

డి ) UAE

జవాబు :   బి

 

21) అంటు వ్యాధుల, వైరస్ వ్యాధుల  వ్యాప్తి దశలను  ,ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు ?

ఎ ) బేస్ లైన్ (లేక ) ఇండెమిక్

బి)ఎపి  డె  మిక్ ; అవుట్ బ్రేక్

సి) పాన్ డె   మిక్

డి ) పైవన్నీ

జవాబు :   డి

22)ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు , 726 జిల్లాలో ఎన్ని పనిచేస్తున్నాయి ?   

ఎ ) 6300 కన్నా ఎక్కువ  

బి) 500

సి) 200

డి ) 700

జవాబు :   

23 ) ఎ ప్రా ప్రి యేషన్ బిల్ (2020-2021 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్ట టానికి లోక్ సభ ఆమోదం తెలిపింది ( రు.లక్ష కోట్ల లో )  ?

ఎ )110.4

బి) 90

సి) 80

డి )60

జవాబు : ఎ   

24) ‘గిల్లి టోన్’ అనే ప్రక్రియ ను లోక్ సభ లో ఎవరు అమలు చేయగలరు ?

ఎ ) ఆర్ధిక మంత్రి

బి)స్పీకర్

సి) న్యాయ శాఖ మంత్రి

డి ) విదేశాంగ శాఖ’ మంత్రి

జవాబు : బి   

25) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ ) కొమ్ : ఇరాన్

బి)వుహాన్ : చైనా

సి) దోహా : కతార్

డి )పై వన్ని

జవాబు :   డి

26) ఏ దేశాల లోని లేబరేటరి లు COVID-19 వైరస్ స్ట్రెయిన్  ని వేరు చేశాయి ? 

ఎ ) జపాన్

బి)చైనా

సి) థాయ్ ల్యాండ్ , USA, ఇండియా

డి ) పైవన్నీ

జవాబు :   డి

27) ‘సర్ క్రీక్’ ఏ దేశాల మధ్య ఉన్నది  ?

ఎ ) పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్

బి) ఇండియా -  పాకిస్తాన్

సి) ఆఫ్ఘనిస్తాన్ - కజాక్ స్తాన్

డి ) ఇరాన్ – ఆఫ్ఘనిస్తాన్

జవాబు :   బి

28)’కిరోసిన్ - ఫ్రీ ‘ రాష్ట్రాలుగా ఏవి ప్రకటించాయి ( వంట కోసం LPG వాడుతున్నాయి ) ?

ఎ )హర్యానా

బి)పంజాబ్

సి)అంధ్ర ప్రదేశ్

డి )పై మూడు మాత్రమే

జవాబు :   డి

29) ‘షేర్ డ్ ఎకానమీ ‘ లో ఏవేవి వస్తాయి ?

ఎ ) కో - వర్కింగ్

బి) కో - లివింగ్

సి)  షేర్ డ్ మొబిలిటీ & ఫర్నిచర్ రెంటల్

డి ) పైవన్నీ

జవాబు :    డి

30) 2019 లో భారత దేశం ఎన్ని మిలియన్ టన్నుల థర్మల్ బొగ్గు దిగుమతి చేసుకుంది ?

ఎ ) 51.33

బి) 25

సి) 197.84

డి ) 40

జవాబు :   సి

 

31) భారత దేశం , ఏ దేశాల నుండి బొగ్గు దిగుమతి చే సు కుం టోoది ?

ఎ ) ఇండోనేషియా

బి) దక్షిణ ఆఫ్రికా

సి) రష్యా & ఆస్ట్రేలియా

డి ) పైవన్నీ

జవాబు :    డి

32) పని చేసే చోట మహిళల పట్ల లైంగిక వేధింపులు , భారత రాజ్యాంగం లో ఏ ప్రాధమిక హక్కుల ఉల్లంఘన కింద కి వస్తాయి ?

ఎ ) ఆర్టికల్ 14 (సమానత్వం )

బి)ఆర్టికల్ 15

సి) ఆర్టికల్ 21 (డిగ్నిటీ తో కూడిన జీవితం )

డి )పైవన్నీ

జవాబు :    డి

33 ) ఆస్థి హక్కు భారత రాజ్యాంగం లో ఏ ఆర్టికల్ లో రాజ్యాంగ హక్కుగా తెలుప బడింది ?

ఎ ) ఆర్టికల్ 356

బి) ఆర్టికల్ 52

సి) ఆర్టికల్ 300A

డి ) ఆర్టికల్ 74

జవాబు :   సి

34) నాటునా దీవులు (సౌత్ చైనా సముద్రం లో ఉన్నవి ) , ఏ దేశానికీ చెందుతాయి ?

ఎ )ఇండోనేషియా

బి) వియత్నాం

సి) ఆస్ట్రేలియా

డి ) న్యూ జీలాండ్

జవాబు :   

35) PM CARES ( ప్రధాన మంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ & రిలీఫ్ ఎమర్జెన్సీ సిట్యు యేషన్ ) ఫండ్ ద్వారా ప్రస్తుతం ప్రధానం గా  ఎవరి సహాయం అందిస్తారు  ?  

ఎ ) విదేశీ విద్యార్ధులకు

బి) COVID-19 బాధితులకు

సి) రోదసీ యాత్రీకులకు

డి ) ఇవేవి కావు

జవాబు :   బి

36) ఇండియన్ టెలి గ్రఫి యాక్ట్ , 1885 ప్రకారం COVID-19 క్వారం టైన్ అలర్ట్ సిస్టం (CQAS) తొలుత ఏ రాష్ట్రము లో ప్రవేశ పెట్టారు ?

ఎ ) లక్ష ద్వీప్

బి) కేరళ 

సి) అండమాన్ & నికోబార్

డి ) చండీఘర్

జవాబు :బి    

37) క్రికెట్ ఆట లో వాతావరణం లో వచ్చిన మార్పుల కారణం గా లిమిటెడ్ – ఓవర్స్ మ్యాచ్ పధ్ధతి లలో వాడే డెక్ వర్త్  - లెవిస్ - స్టెన్ (DLS) పధ్ధతి వివరాలేవీ ?   

ఎ )1997 లో ఫ్రాంక్ డక్ వర్త్ - టోని లేవిస్ కల్సి దీన్ని రూపొందించారు

బి)1999 లో అధికారికంగా ICC అమలు చేసింది

సి)2014 లో ‘డక్ వర్త్ - లెవిస్ - స్టెన్ గా పేరు పెట్టారు

డి ) పైవన్నీ

జవాబు :    డి

38)’ఆపరేషన్ సంజీవని ‘ కింద 6.2 టన్నుల అత్యవసర మందులు మరియు హాస్పిటల్ వినిమయ వస్తువులు ఏ దేశానికి  భారత దేశం పంపింది ?

ఎ ) రష్యా

బి) మంగోలియా

సి)మాల్దీవులు

డి ) తైవాన్

జవాబు :   సి

39)సదరన్ ఇండియా టెక్స్ టైల్స్ రీసెర్చ్ అసోసియేషన్ (SITRA) ఎక్కడుంది ?

ఎ ) ముంబై

బి) అహ్మదాబాద్

సి)కో యంబత్తూర్

డి )జగ్ ధారి

జవాబు :   సి

40) స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్ మెంట్ ఫండ్ (SDRMF) నుండి కేంద్ర ప్రభుత్వం , రాష్ట్రాలకు ఎంత విడుదల చేసింది (COVID-19 కోసం ) ?  (రు.కోట్ల లో ) 

ఎ )11,092

బి)1611

సి)802

డి )910

జవాబు : ఎ    

 

41) ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనటానికి , ఈ కింది వాటిల్లో దేనికి ఎంత వయస్సు ఉండాలి ?

ఎ ) జిమ్నా స్టిక్స్ : కనీసం 16 ఏళ్ళు

బి)బాక్సింగ్ : 18 ఏళ్ళు

సి) ఫుట్ బాల్ : 23 ఏళ్ల లోపు

డి ) పైవన్నీ

జవాబు :    డి

42) భారత దేశం లోనే చాలా పెద్ద దైన , వెరావల్ హార్బర్ ఎక్కడుంది ?

ఎ ) పశ్చిమ బెంగాల్

బి) సౌరాష్ట్ర కోస్ట్ , గుజరాత్

సి) ఒడిష

డి ) పుదుచేరి

జవాబు :   బి

43 ) కార్పొరేట్ బాండ్ మార్కెట్ లో ‘లిక్విడిటీ ‘ తగినంత ఉండటం కోసం , ఏప్రిల్ ,2020 లో ఎవరు టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ ( TLTRO) ప్రకటించారు ?

ఎ ) SEBI

బి)RBI

సి) PFRDA

డి ) EPFO

జవాబు : బి    

44) సాధారణం గా  బియ్యం ఎగుమతి చేసే దేశాలు ఏవి ?

ఎ ) భారత్

బి) థాయిలాండ్

సి) పై (ఎ ) & (బి )

డి ) ఇవేవి కావు

జవాబు :    సి

45) తిపే శ్వర్ వన్య మృగ ప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది ?

ఎ )పంథార్ కావ్ డా , యావత్ మల్ జిల్లా , మహారాష్ట్ర

బి)ఆదిలాబాద్

సి) మధ్య ప్రదేశ్

డి ) జార్ఖండ్

జవాబు :   

46) షేర్ మార్కెట్ లో ఫారిన్ ఇన్ స్టి ట్యూ షనల్ ఇన్వెస్టర్స్ (FII) మార్చ్ 2020 లో రు.1.18 లక్షల కోట్ల విలువ గల సెక్యూరిటీ లు అమ్మారు . ఎవరిని డొమెస్టిక్ ఇన్ స్టి ట్యూ ష నల్ ఇన్వెస్టర్ లు అంటారు ?

ఎ ) దేశీయ బ్యాంకు లు

బి) ఇన్ స్యురెన్సు కంపెనీ లు

సి) మ్యూ చ్యు వల్ ఫండ్స్, డొమెస్టిక్ ఫైనాన్సియల్ ఇన్ స్టి ట్యూ ష న్స్

డి ) పైవన్నీ

జవాబు :   డి

47) COVID-19 టెస్టింగ్ మరియు ట్రీట్ మెంట్ ని ఆయుష్మాన్ భారత్ స్కీం కింద కి తెచ్చారు . COVID-19 టెస్ట్ కోసం RT-PCR(రియల్ టైం రివర్స్ ట్రాన్ స్క్రి ప్షన్ - పాలి మ రేస్ చైన్ రియాక్షన్ ) వాడుతున్నారు . రాపిడ్ టెస్ట్ కిట్ లలో వేటి ఆధారం తో వ్యాధి నిర్ణయం చేస్తారు ? 

ఎ ) (అనుమానిత) రోగి  రక్తం తో

బి) వెంట్రుకలతో

సి) కాలి గోళ్ళతో

డి ) వేలి గోళ్ళతో

జవాబు :   

48) గ్రాండ్ ఇథియోపి యన్ రినైసాన్స్ డ్యాం (GERD) ఏ నది పై నిర్మించ దలిచారు ?  

ఎ ) అమెజాన్ నది

బి) మిసిసిపి నది

సి)నైలు నది

డి ) హడ్సన్

జవాబు :   సి

49) రంగోలి బిహు పండగ సందర్భం గా బహుమతి గా ఇచ్చే కాటన్ ‘గమోసా ‘ ( చిన్న టవల్ ) ను ఏ రాష్ట్రము లో వాడతారు ?

ఎ ) అసోం

బి) పంజాబ్

సి) హర్యానా

డి ) రాజస్తాన్

జవాబు :   

50) త్వరగా పాడైపోయే వ్యవసాయ పంటలను పండించే రైతులను ఆడుకోటానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది ?

ఎ ) మర్కెట్ ఇంటర్ వెన్ షన్ పధకం అమలు 

బి) NAFED ద్వారా ప్రైస్ సపోర్ట్ స్కీం విస్తరించుట

సి) 50 ప్రత్యెక రైళ్ళ ద్వారా పంట ను రవాణా చెయ్యటం

డి ) పైవన్నీ

జవాబు :    డి

 

51) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ ) SARI : సివియర్ యా క్యూట్ రెస్పిరే టరీ ఇల్ నెస్

బి)CT : కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్

సి) ELISA టెస్ట్  : ఎంజైమ్ లింక్డ్ ఇమ్మునో  సార్బెంట్ ఎస్సే టెస్ట్

డి ) పై వన్ని

జవాబు :   డి

52) ఇండియా COVID-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ & హెల్త్ సిస్టం ప్రిపేర్ డ్ నెస్ ప్యాకేజ్ కింద రాష్ట్రాలకు , కేంద్ర ప్రభుత్వం ఎంత ధనం అందిo చింది  9.4.2020నాడు ?  (రు. కోట్ల లో )

ఎ ) 2,000

బి) 15,000

సి) 3,000

డి ) 5,000

జవాబు :   బి

53 ) ‘ఆర్మీ వార్మ్’ అనే గొంగళీ పురుగు ఏ రాష్ట్రము లోని ఈస్టర్న్ ధమాజి జిల్లా మొదలైన చోట్ల వ్యవసాయ పంటలను నాశనం చేస్తోంది ?

ఎ ) అసోం

బి) బీహార్

సి) ఉత్తర ప్రదేశ్

డి ) ఉత్తరా ఖండ్

జవాబు :   

54) బెంగాల్ కెమికల్స్ & ఫార్మ స్యూ టి కల్స్ లిమిటెడ్ (BCPL),  ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ . 1901 లో దీన్ని ఎవరు స్థాపించారు ? [ఈ సంస్థ  హైడ్రాక్సీ క్లోరో క్విన్ (HCQ) అనే ఔషధాన్ని పెద్ద ఎత్తున  తయారు చేస్తుంది ]   

ఎ ) స్వామి వివేకానంద

బి)ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్

సి) ఈశ్వర చంద్ర విద్యాసాగర్

డి ) బంకిం చంద్ర చట్టర్జీ

జవాబు :   బి

55)MPLADS పధకo అమలుని  ఏ సంవత్స రాలకి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు ?  

ఎ )  2018-2019

బి) రెండు సంవత్సరాలు ( 2020-2021 & 2021 – 2022 )

సి) 2015-2016

డి ) 2016-2017

జవాబు :   బి

56)ఏప్రిల్ 12,2020 వరకు లభించిన సమాచారం ప్రకారం , ఏ రాష్ట్రము లో అత్యధికంగా యాక్టివ్ COVID-19 కేసు లు నమోదు అయ్యాయి ?

ఎ ) సిక్కిం 

బి) ఉత్తరాఖండ్ 

సి)మహారాష్ట్ర

డి ) ఛత్తీస్ ఘర్

జవాబు :   సి

57)మధ్య ప్రదేశ్ లో ఉన్న టైగర్ రిజర్వు ఏది ?

ఎ ) పెంచ్ టైగర్ రిజర్వు

బి) కావల్ టైగర్ రిజర్వు

సి) బండిపూర్ వన్య ప్రాణి  సంరక్షణ కేంద్రo

డి ) కాజీరంగా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రo

జవాబు :   

58) ప్రతి పాదిత COVID-19 ఎమర్జెన్సీ ఫండ్ కి $ 18.8 మిలియన్ ల నిధులు చేకూరినట్లయ్యింది . భారత దేశం ఇందుకు ఎంత ఇచ్చింది ?  ( మిలియన్ US $ లలో )

ఎ )  10

బి)  5  

సి) 15

డి ) 12

జవాబు :   

59)నాడియా అనే పులి మరణించిన ‘బొంక్స్ జూ ‘ ఎక్కడుంది ?

ఎ ) లండన్

బి)న్యూ యార్క్ , USA

సి) బీజింగ్

డి ) కౌలాలంపూర్

జవాబు :   బి

60) వైద్యుల పర్యవేక్షణ లో ‘హైడ్రాక్సీ క్లోరో క్విన్’ మందు  (ఇంటర్ ఫెరాన్ బ్లాకర్ ) ను  ఏ వ్యాధులకి వాడతారు ?

ఎ )మలేరియా

బి) ఆ ర్త్రరైటిస్

సి)న్యుమోనియా

డి )పైవన్నీ

జవాబు :   డి

 

61) సమ్మర్ ఒలింపిక్ గేమ్స్  ను జపాన్ గతం లో ఎప్పుడు నిర్వహించింది ?

ఎ )2004

బి)1964

సి)1984

డి )2012

జవాబు :బి    

62) OPEC ప్లస్ అల్లయన్స్ లో ఉన్న దేశాలు ఏవి ?

ఎ ) కజాక్ స్తాన్

బి) బ్రూని  

సి) అజార్ బైజాన్

డి )పైవన్నీ

జవాబు :    డి

63 )భారత దేశానికీ పాకిస్తాన్ తో 3323కి.మీ.పొడవున్న సరిహద్దు గలదు . బంగ్లాదేశ్ తో 4096.7 కి.మీ. పొడవున్న సరిహద్దు గలదు . పశ్చిమ బెంగాల్ లోని ఏ జిల్లాల్లో బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది ?

ఎ ) ఉత్తర 24 పరగణాలు

బి) దక్షిణ 24 పరగణాలు

సి) నాడియా జిల్లా

డి ) పైవన్నీ

జవాబు :   డి

64) COVID-19 వ్యాధిని గుర్తించే RT-PCR టెస్ట్ మనవ శాoపిళ్ళలో దేన్నీ గుర్తిస్తుంది ? వివరాలు ఏవి ?

ఎ )RT-PCR టెస్ట్ మానవ శాoపిళ్ళ లోని ఉన్న వైరస్ యొక్క RNA ని గుర్తిస్తుంది 

బి)స్వల్పం గా ఉన్న DNA ల కాపీ లను , కొన్ని మిలియన్ కాపీ లు గా PCR ప్రాసెస్ చేస్తుంది

సి)ఈ టెస్ట్ కోసం ప్రిమర్స్ , ప్రోబ్స్ , ఎంజైం లు , న్యూక్లియో టైడ్స్ , ఎంజైమ్ కో ఫాక్టర్స్, బఫర్ సొల్యూషన్ కావాలి

డి )పైవన్నీ

జవాబు :    డి

65) ‘నాం పో ‘ అనే ఓడ రేవు ఏ దేశం లో ఉంది ?

ఎ ) జపాన్

బి)ఉత్తర కొరియా

సి) చైనా

డి ) రష్యా

జవాబు :   బి

66)టోక్యో ఒలింపిక్స్ (32వ ఒలింపిక్స్ ) కి సంబంధించి ఏది కరెక్ట్ ?

ఎ ) జూలై 23 నుండి ఆగష్టు 8, 2021 వరకు నిర్వహిస్తారు

బి)టోక్యో ఒలింపిక్స్ ప్రెసిడెంట్ : యోషిరో మోరి

సి)IOC ప్రెసిడెంట్ : థామస్ బాచ్

డి )పైవన్నీ

జవాబు :   డి

67) టియాయు (Tiau) నది మీద ఉన్న బ్రిడ్జి దేన్నీ కలుపుతుంది ?

ఎ )జోఖా త్వార్ ని ( చంపాయ్ జిల్లా , మిజోరాం  )  , రిహ్ ని ( మయాన్మార్ )

బి) జోరిన్ పుయ్ , లాంగ్ ట్లాయ్  - మయన్మార్

సి) జమ్మూ & కాశ్మీర్  - లడక్

డి ) ఇవేవి కావు

జవాబు :   

68) సింగర్ లారెన్ మ్యుజియం ఎక్కడుం ది ?

ఎ )లారెన్ , నెథర్లాండ్స్

బి)  ఫ్రాన్స్

సి) ఫిన్లాండ్

డి ) డెన్మార్క్

జవాబు :   

69) ఇటీవల న్యూస్ లో ఉన్న  ‘హెలికాప్టర్ మనీ ‘ అంటే ఏమిటి ?

ఎ ) క్వాంటిటేటివ్ ఈ జింగ్ (QE) అని దీన్ని అంటారు

బి) RBI నుండి GDP లో 5% ధనం విడుదల చేయమని కోరుతున్నారు

సి)ఈ విధం గా GDP లో 2% USA లో , 15% UK లో విడుదల చేశారు

డి ) పైవన్నీ

జవాబు :   డి

70) ‘క్లోరో క్విన్’ (రిసో ఛి న్ & సం టో ఛిన్ ) ను 1934 లో ఎవరు కనుగొన్నారు ?

ఎ ) లిన్నేయస్

బి) హాన్స్ ఆండర్ శాగ్  & అతని కో – వర్కర్స్ , జర్మనీ

సి) గట్ మాన్ & ఎ ర్ రిచ్

డి ) జాకో బ్స్ & L.C.క్రేయిగ్

జవాబు :   బి  

71)ఛో లా ‘ పాస్ ఎక్కడుంది ?

ఎ )సిక్కిం - టిబెట్ మధ్య (హిమాలయాలలో )  

బి) పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్

సి) ఇండియా - బంగ్లాదేశ్

డి ) ఇండియా - శ్రీలంక

జవాబు :   

 

 

విజ్ఞాన విపంచి

(జవాబులు – మే,  2020    )

 

1బి

11డి

21డి

31డి

41డి

51డి

61బి

71

2బి

12డి

22

32డి

42బి

52బి

62డి

 

3బి

13డి

23

33సి

43బి

53

63డి

 

4

14బి

24బి

34

44సి

54బి

64డి

 

5డి

15బి

25డి

35బి

45

55బి

65బి

 

6డి

16డి

26డి

36బి

46డి

56సి

66డి

 

7డి

17బి

27బి

37డి

47

57

67

 

8డి

18సి

28డి

38సి

48సి

58

68

 

9డి

19డి

29డి

39సి

49

59బి

69డి

 

10డి

20బి

30సి

40

50డి

60డి

70బి

 

 

 

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)